Just In
- 1 hr ago
Somavati Amavasya 2022:సోమవతి అమావాస్య రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు...
- 2 hrs ago
Telangana Formation Day 2022 :ఎనిమిదేళ్ల తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు..అద్భుత విజయాలు.. ఇంకా మరెన్నో...
- 4 hrs ago
శనిదేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే? శని జయంతి నాడు మీ రాశి ప్రకారం ఇలా చేయండి...
- 5 hrs ago
ఆరోగ్యకరమైన గుండె మరియు ప్రేగు కదలికల కోసం రోజూ ఈ ఒక్కటి తింటే చాలు...!
Don't Miss
- Finance
ఒక్క ఏడాదిలోనే రూ.60,414 కోట్లు దోచుకున్నారు: బ్యాంకులపై ఆర్బీఐ షాకింగ్ రిపోర్ట్
- Technology
ఇండియాలో లాంచ్ అయ్యే ఒప్పో A57 & A57s 4G ఫోన్ల ఫీచర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి
- News
తెలంగాణ పతకాలు బీజేపీ,కాంగ్రెస్ అమలు చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.!మంత్రి మల్లారెడ్డి.!
- Sports
IPL Qualifier 2: పాన్ పరాగ్ వర్సెస్ హర్షల్ పటేల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ ఇక్కడ అంటూ నెటిజన్స్ ట్రోల్స్
- Movies
పట్టు వదలని కరాటే కళ్యాణి.. 20 యూట్యూబ్ ఛానెల్స్ పై పోలీసులకు ఫిర్యాదు!
- Automobiles
పుటుక్కున విరిగిపోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ సస్పెన్షన్.. మళ్ళీ కొత్త తలనొప్పి మొదలైందా?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sun Transit in Capricorn 2022 : మకరంలోకి సూర్యుడి రాకతో.. ఏ రాశులకు అదృష్టమంటే..!
2022వ సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ జనవరి 15వ తేదీన వచ్చింది. ఆ రోజున సూర్యుడు ఉదయం 8:04 గంటల వరకు ధనస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సమయాన్నే ఉత్తరయాణం అంటారు. ఇదే సమయంలో ఐదు గ్రహాల కలయిక కూడా జరుగుతుంది. ఇదే రాశిలోకి సూర్యుడు, బుధుడు, గురుడు, చంద్రుడు, శని గ్రహాలు కూడా ప్రవేశించనున్నాయి.
మకర సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి అద్భుతం జరగడం వల్ల కొన్ని శుభయోగాలు జరగనున్నాయి. మరోవైపు సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో అన్నిరాశిచక్రాలు కచ్చితంగా ప్రభావితమవుతాయి.
ఈ సమయంలో ఏ రాశి వారికి మంచిగా ఉంటుంది.. ఎవరికి ప్రతికూల ఫలితాలొస్తాయి.. అన్ని రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Makar
Sankranti
2022
:
సంక్రాంతి
వేళ
ఈ
పనులను
ఎట్టి
పరిస్థితుల్లో
చేయకండి..
చెడు
ఫలితాలొస్తాయట...!

మేష రాశి..
మకరంలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మీ పనులలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండే వారికి కూడా విజయం దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ కాలంలో ఎరుపు రంగు మీకు కలిసి వస్తుంది. మీరు సానుకూల ఫలితాలను పొందడానికి ప్రతి ఆదివారం ఆహారాన్ని దానం చేయండి.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ఆదిత్య పారాయణం చేయాలి.

వృషభ రాశి..
సూర్యుడు మకరంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి పని విషయంలో మంచిగా ఉంటుంది. వ్యాపారులకు పరిస్థితులు మెరుగుపడతాయి. రాజకీయాల్లో ఉండే వారికి గొప్ప విజయం లభిస్తుంది. ఈ కాలంలో మీరు కొన్ని మతపరమైన వేడుకలలో కూడా పాల్గొనవచ్చు. ఆధ్యాత్మికత వైపు మీ ఆసక్తి పెరుగుతుంది. ఉత్తమ ఫలితాల కోసం ప్రతి ఆదివారం గోధుమలను దానం చేయండి. ఈ సమయంలో గ్రీన్ కలర్ వల్ల మీకు కలిసి వస్తుంది.
పరిహారం : ప్రతిరోజూ ఉదయం మీరు గాయత్రి మంత్రాన్ని పఠించాలి.

మిధున రాశి..
మకరరాశిలోకి సూర్యుడు ప్రయాణం చేసే సమయంలో మిధున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి. నువ్వులను దానం చేస్తే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఆకుపచ్చ మరియు నారింజ రంగులు ఈ సమయంలో మిధున రాశి వారికి శుభప్రదమైన ఫలితాలను తీసుకొస్తాయి. ఆదివారం రోజున ఆవులకు ఆహారం ఇవ్వడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిహారం : ప్రతి రోజూ ఉదయం ‘రామ రక్ష స్తోత్రం' పఠించాలి.
Makar
sankranti
recipes
:
సంక్రాంతి
సంబరాల్లో
నోరూరించే
రుచులు..
స్పెషల్
రెసిపీలివే...!

కర్కాటక రాశి.
మకరంలోకి సూర్యుడు ఆగమనం చేసే సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవారికి విజయం లభిస్తుంది. మరోవైపు మీరు భూమి లేదా వాహనాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉండే వారికి స్నేహితుల నుండి సహాయం లభించొచ్చు. ఈ కాలంలో శుభ ఫలితాల కోసం నువ్వులను దానం చేయడం కొనసాగించండి.
పరిహారం : ప్రతిరోజూ ఉదయం సూర్య మంత్రాన్ని పఠించాలి.

సింహ రాశి..
మకరంలోకి సూర్యుడు ప్రయాణించే సమయంలో ఈ రాశి వారికి పని విషయంలో విజయవంతంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే వారికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా పెండింగులో ఉండే మీ డబ్బులు తిరిగి ఇవ్వబడతాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ కాలంలో మీరు ఆరెంజ్ రంగును ధరించడం మంచిది.
పరిహారం : ప్రతిరోజూ ఉదయం తూర్పు వైపు తిరిగి ‘ఆదిత్య పారాయణం' చేయాలి.

కన్య రాశి..
సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఈ కాలంలో ఎరుపు రంగు మీకు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. హనుమంతుడిని ఆరాధించండి.
పరిహారం : ప్రతిరోజూ రాగిపాత్రలో నీరు తాగితే.. శుభ ఫలితాలు వస్తాయి.
ఈ
రాశుల
వారు
శృంగారంపై
ఎక్కువ
ఆసక్తి
చూపుతారట...!
మీ
రాశి
ఉందేమో
చూసెయ్యండి...

తుల రాశి..
మకరంలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో తుల రాశి వారికి చాలా పవిత్రమైన సమయం. ఈ సమయంలో రాజకీయాల్లో ఉండే వారికి విజయం లభిస్తుంది. ఇప్పటివరకు విఫలమైన వ్యాపారులు ఈ కాలంలో ప్రణాళికలను తిరిగి రూపొందించొచ్చు. మీరు మతపరమైన వేడుకలలో పాల్గొనవచ్చు. ఈ కాలంలో బ్లూ కలర్ మీకు శుభఫలితాలను తీసుకొస్తుంది.
పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేయాలి.

వృశ్చిక రాశి..
మకరంలోకి సూర్యుడి రవానా సమయంలో ఈ రాశి వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనేక పనులు పూర్తవుతాయి. ముఖ్యంగా పెండింగులో ఉండే పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు ఈ కాలంలో లాభాలు వస్తాయి. పని చేసే ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు మంచిగా ఉంటుంది. ఈ కాలంలో రెడ్ కలర్ మీకు మంచిగా ఉంటుంది.
పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి రాగి లేదా బంగారం ఉన్న అధిక నాణ్యత ఉన్న రూబీ రత్నాన్ని ధరిస్తే మంచి ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..
సూర్యుడు మకరంలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారిలో వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. రాజకీయంలో ఉండే వారు ఈ కాలంలో పురోగతి సాధిస్తారు. పిల్లల పురోగతిలో మీరు ఆనందిస్తారు. ఈ సమయంలో మీరు నువ్వులు, నీరు, ధాన్యాలు దానం చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ ‘ఓం రామ్ రామాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి

మకర రాశి..
సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారి ప్రవర్తన మృదువుగా ఉంటుంది. ఇది మీకు ప్రయోజనాలను ఇస్తుంది. మీరు పనిలో విజయం సాధించవచ్చు. ఏదైనా వ్యాపార సంబంధిత నిర్ణయంలో మీరు విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో తెలుపు మరియు నీలం ఉత్తమ రంగులు.
పరిహారం : ఆదివారం రోజున అవసరమైన వారికి ఉచితంగా మందులు దానం చేయాలి.

కుంభ రాశి..
సూర్యుడు మకరంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారు ఊహించని విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా గృహ నిర్మాణానికి సంబంధించిన నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించబడతాయి. మీ ఆందోళన ఆరోగ్య సమస్యలపైకి వెళ్తుంది. ఈ సమయంలో కుంభం రాశి వారికి ఆకుపచ్చ చాలా పవిత్రమైనది. మంచి ఫలితాల కోసం నీటిని దానం చేయండి.
పరిహారం : ఆదివారం రోజున బెల్లం దానం చేస్తే.. శుభఫలితాలొస్తాయి.

మీన రాశి..
మకరంలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు ముఖ్యమైన పనులను పూర్తి చేయొచ్చు. వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సూర్యుడి రవాణా మీన రాశి వారికి గొప్ప అవకాశాలను తీసుకొస్తుంది. విద్యార్థులు ఈ సమయంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీకు ఎరుపు రంగు మంచిగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో ‘సూర్య అష్టకం' పఠించాలి.