For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూర్యుడు తులరాశిలోకి ప్రవేశిస్తే.. ఈ 5 రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు... మీ రాశి ఉందేమో చూడండి...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో యువరాజుగా భావించే బుధుడు ఇటీవలే తులరాశిలోకి ప్రవేశించాడు. తాజాగా సూర్యుడు కూడా కన్యరాశిని వదిలి తులరాశిలోకి అక్టోబర్ 17వ తేదీన శనివారం ఉదయం 6:50 గంటలకు ప్రవేశించనున్నాడు.

ఇదే సమయంలో హిందూ క్యాలెండర్ ప్రకారం.. నవరాత్రులు కూడా ప్రారంభం కానున్నాయి. గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడు ఈసారి బలహీనంగా ప్రయణించనున్నాడు. ఇదే రాశిలో సుమారు 30 రోజుల పాటు అంటే నవంబర్ 16వ తేదీ వరకు 6:39 గంటల వరకు ఉండనున్నాడు.

ఈ సందర్భంలో కొన్ని రాశుల వారికి సానుకూల ప్రయోజనాలు ఉండగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు కలగనున్నాయి. అయితే ప్రతి ఒక్కరూ సూర్య గ్రహం అనుగ్రహం పొందేందుకు కొన్ని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.

తులరాశిలోకి సూర్యుడి సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది గనుక.. వారు ఏయే పరిహారాలు పాటిస్తే మంచిది.. అవి ఎప్పుడెప్పుడు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

బుధుడు తులరాశిలోకి ఎంట్రీ ఇస్తే.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టమో చూసెయ్యండి...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి ఏడో స్థానంలోకి సూర్యుడు ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండే అవకాశముంది. ఈ సందర్భంలో మీరు వీలైనంత మేరకు కోపాన్ని తగ్గించుకుని మాటలను అదుపులో ఉంచుకోండి. మీ కుటుంబం గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాల కోసం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి రాగి లేదా బంగారంతో చేసిన రూబీ రత్నాన్ని ధరించండి.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరోస్థానంలోకి సంచరించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఆఫీసులో శత్రువల నుండి దూరంగా ఉండాలి. అలాగే ఉద్యోగ మార్పు గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. మరోవైపు మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబంలో కొత్త బాధ్యతలు పెరగొచ్చు. వాహనాల నుండి దూరంగా ఉండటం మంచిది.

పరిహారం : సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి ఐదో స్థానంలోకి సూర్యుడు ఆగమనం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని చాలా ఉద్రిక్తంగా మారుస్తుంది. వ్యాపారులు మాత్రం కొన్ని ప్రయోజనాలు పొందుతారు. మీకు తోబుట్టువులతో అభిప్రాయభేదాలు వచ్చే అవకాశముంది. మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

పరిహారం : ఆదివారం రోజున రాగిని దానం చేయండి.

మీ పుట్టిన తేదీని మాకు చెప్పండి ... మీ జీవితంలో జరిగిన మరియు జరగబోయే రహస్యాన్ని తెలుసుకోండి ...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి చక్రం సూర్యుడు నాలుగో స్థానంలోకి సంచరించనున్నాడు. ఈ సమయంలో మీ పనికి సంబంధించిన విషయాలు ప్రభావితమవుతాయి. మీకు సరైన వనరులు లేకపోవడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనవుతారు. వాహనాలకు దూరంగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. మీ స్నేహితుల నుండి డబ్బులు కూడా వసూలయ్యే అవకాశముంది.

పరిహారం : ‘రామ రక్ష' స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభపలితాలు వస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశిచక్రం నుండి సూర్యుడు మూడో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ శక్తి పెరిగే అవకాశముంది. తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యాపారంలో మెరుగుదల ఉంటుంి. మీ రంగంలో కొత్తదనాన్ని తీసుకురావడం గురించి మీరు ఆలోచిస్తారు. ఫలితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు కెరీర్లో ముందుకు సాగడానికి ఇది సహాయపడుతుంది. మీ ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది.

పరిహారం : బంగారం లేదా రాగితో ఉన్న స్టార్ రూబీ రత్నాన్ని ధరించండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు రెండో ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఖర్చులు పెరగొచ్చు. మీరు వాటిపై ఎక్కువ నిఘా ఉంచాలి. వ్యాపారులకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఓ కన్ను వేసి ఉంచాలి.

పరిహారం : ‘ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి.

చైనీస్ ఫేస్ రీడింగ్ ప్రకారం, ఈ సంకేతాలు ఉన్నవారిని వివాహం చేసుకోవడం కష్టం ...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి చక్రంలోకే సూర్యుడు అడుగు పెడుతున్నందున.. తొలి స్థానంలో నివాసం ఉంటున్నట్లు లెక్క. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ శక్తి, సామర్థ్యాలను మీరు నమ్మాలి. మరోవైపు మీ కుటుంబంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పని చేయడం ద్వారా విజయం సాధించే అవకాశం ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి.

పరిహారం : గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల శుభఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమంలో ఈ రాశి వారిలో విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. మీ రంగంలో ప్రశంసలు పొందడానికి మీరు కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు కొన్ని పథకాల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. మీ ఇంటి వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. మీ తండ్రి నుండి వ్యాపారంలో మద్దతు లభిస్తుంది.

పరిహారం : ‘సూర్య అష్టకం' స్తోత్రాన్ని పఠించడం వల్ల ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదకొండో స్థానంలోకి మారనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. మీకు సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీరు చాలా చురుకుగా ఉంటారు. మీ ఇంట్లోని బాధ్యతలపై శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు భవిష్యత్ గురించి ప్లాన్ చేస్తారు. కెరీర్లో కొత్త దిశ వైపు పయనిస్తారు.

పరిహారం : ఆదివారం రోజున ఆవుకు బెల్లం ఇవ్వడం వల్ల శుభఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానంలోకి సంచరించనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారికి వారి రంగంలో మంచి ఫలితాలు రానున్నాయి. మీకు ఎదురయ్యే సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు ఆఫీసులో శత్రువుల కంటే చాలా ముందుంటారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

పరిహారం : మీ ఇంట్లో ఈశాన్య దిశలో లార్డ్ సన్ (సూర్యుని) చిత్రాన్ని ఉంచండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి చక్రం నుండి సూర్యుడు తొమ్మిదో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులు లాభాలను అందుకుంటారు. విద్యార్థులు విద్యపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : సూర్యుని యొక్క బంగారు పూతతో కూడిన లాకెట్టుతో బంగారు గొలుసు ధరించండి.(మీకు వీలైతేనే)

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఎనిమిదో స్థానంలోకి మారనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండొచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కలలు నెరవేరొచ్చు. మీ ఆర్థిక ప్రయత్నాల్లో సఫలం కావొచ్చు. మీ తండ్రి సలహా మీకు వ్యాపారంలో మంచిగా సహాయపడుతుంది.

పరిహారం : ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు మీ తండ్రి లేదా తండ్రి ఫొటోల ఆశీర్వాదం తీసుకోండి.

English summary

Sun Transit In Libra On 17th October Know the Effects on All Zodiac Signs in Telugu

Sun Transit in Libra on 17th October 2020. Check out the effects on all zodiac signs, and learn about remedies to perform in telugu. Read on