For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వృశ్చికంలో సూర్యుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

2021లో నవంబర్ 16వ తేదీన సూర్యుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేసే సమయంలో 12 రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో సూర్యుడిని అధిపతిగా పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఓ రాశి నుండి మరో రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇలా మారినప్పుడు మకర సంక్రాంతి అని కూడా అంటారు.

Sun Transit in Scorpio On 16 November 2021 Effects on Zodiac Signs in Telugu

2021 సంవత్సరంలో నవంబర్ 16వ తేదీన అర్ధరాత్రి 12:49 గంటలకు తులరాశి నుండి వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అదే రోజున తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Sun Transit in Scorpio On 16 November 2021 Effects on Zodiac Signs in Telugu

వృశ్చిక రాశిలో సూర్యుని సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజకరంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడనుంది.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Zodiac Signs:ఏ రాశి వారిలో ఎలాంటి టాలెంట్ ఉంటుందో తెలుసా...Zodiac Signs:ఏ రాశి వారిలో ఎలాంటి టాలెంట్ ఉంటుందో తెలుసా...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఎనిమిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం అస్థిరమైన ఖర్చుల కారణంగా క్షీణిస్తుంది. అయితే మీ భాగస్వామి నుండి కొద్దిగా సహాయం వల్ల మీరు నిలదొక్కుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ సూర్యుడిని ఆరాధించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వారికి ఈ కాలంలో ఆఫీసులో మంచి గౌరవం లభిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీకు చాలా విషయాల్లో లక్కీగా ఉంటుంది.

పరిహారం : గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఆరో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు మరియు వ్యాపారులు చాలా పురోగతిని సాధిస్తారు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇతర ప్రజలు కూడా ఈ సమయంలో మంచి ప్రయోజనాలను పొందొచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రం పఠించాలి.

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మూడు రాశుల స్త్రీలు అద్భుతమైన భార్యలు కావచ్చు..!!Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ మూడు రాశుల స్త్రీలు అద్భుతమైన భార్యలు కావచ్చు..!!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు ఐదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మరోవైపు వ్యాపారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మత పరమైన కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. రాజకీయ రంగంలో ఉండే వారికి విజయం లభిస్తుంది. మరోవైపు మీ సన్నిహితులు మరియు ప్రియమైన వారితో గొడవలు ఉండొచ్చు.

పరిహారం : ప్రతి రోజూ సూర్యుడి భక్తితో పూజించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు నాలుగో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నట్లయితే, మీ సహోద్యోగులతో మర్యాదగా ప్రవర్తించాలి. మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందుల్లో ఉండొచ్చు. మీరు ఓపికగా ఉండాలి. కోపం మరియు అహంకారానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఎరుపు రంగు దుస్తులు దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొంత డబ్బు ఆదా చేసే అవకాశం ఉంటుంది. సూర్యుని రాశి మార్పు వల్ల మీ ఖర్చులను పెంచుతుంది. ఈ సమయంలో మీరు ఖర్చులపై శ్రద్ధ వహించాలి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతారు. ఈ సమయంలో మీరు ఎవరికీ హాని చేయొద్దు. దీని కారణంగా నష్టాన్ని కూడా అనుభవించాల్సి ఉంటుంది. మీరు వివాదాల పరిస్థితిని నివారించాలి.

పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రం పఠించాలి.

మీ రాశిని బట్టి విద్యలో ఎంత మేరకు రాణిస్తారో తెలుసా...!మీ రాశిని బట్టి విద్యలో ఎంత మేరకు రాణిస్తారో తెలుసా...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధించొచ్చు. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకుంటే.. సానుకూలంగా ఉంటుంది. కానీ ఆత్రుతలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా ముఖ్యమైన పనిని చేసే ముందు, అనుభవం ఉన్న వారి సలహాలను తీసుకోవాలి. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

సూర్యుడు తుల రాశి నుండి ఇదే రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ధైర్యం, శక్తి పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కేతు గ్రహం కూడా ఇప్పటికే ఇదే రాశిలో నివాసం ఉంటున్నాడు. సూర్యుడు మరియు కేతువు కలయిక వల్ల మీ జీవితంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరగొచ్చు. ఉద్యోగులు ఈ కాలంలో ఎలాంటి రిస్కులు తీసుకోకూడదు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆలోచించొద్దు. చెడు సావాసాలను కూడా వదులుకోండి.

పరిహారం : పేదలకు ప్రతి ఆదివారం బెల్లం సమర్పించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు సుదూర ప్రయాణాలు చేయొచ్చు. మరోవైపు మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలం ఖరీదైనది. విదేశాలకు సంబంధించిన వ్యక్తులు కొన్ని శుభవార్తలను వినొచ్చు. ఈ రవాణా సమయంలో మీ ఆత్మవిశ్వాసం క్షీణించొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' మంత్రాన్ని జపించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదకొండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీకు విద్యా రంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ఫలితం లభించడం వల్ల మీరు సంతోషంగా ఉంటుంది.

పరిహారం : మంగళవారం రోజున దానిమ్మ పండు మరియు ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు పదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు పదోన్నతి కోసం ఎదురుచూస్తుంటే.. శుభవార్తలు వినొచ్చు. మీరు కోరుకున్న ఫలితాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు ఈరోజు సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఉన్నతాధికారులతో మీకు సంబంధాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో పెండింగులో ఉన్న పనులను తిరిగి ఉండొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య స్తోత్రం పఠించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి సూర్యుడు తొమ్మిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఏవైనా పనులు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు ఆరోగ్య పరంగా ఈ కాలంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఈ సమయంలో ఆసక్తిని చూపుతారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం పొందొచ్చు. మరోవైపు ఈ సమయంలో మీరు కొంత డబ్బును ఆదా చేయొచ్చు.

పరిహారం : అవసరం ఉన్న వారికి బెల్లం మరియు ఎరుపు రంగు బట్టలు దానం చేయాలి.

FAQ's
  • 2021లో సూర్యుడు వృశ్చికరాశిలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

    2021 సంవత్సరంలో నవంబర్ 16వ తేదీన అర్ధరాత్రి 12:49 గంటలకు తులరాశి నుండి వృశ్చికరాశిలోకి సూర్యుడు సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు అంటే డిసెంబర్ 16వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అదే రోజున తెల్లవారుజామున 3:28 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.

English summary

Sun Transit in Scorpio On 16 November 2021 Effects on Zodiac Signs in Telugu

Surya Rashi Parivartan 2021 in Vrishchik Rashi; Sun Transit in Scorpio Effects on Zodiac Signs in Telugu : The Sun Transit in Scorpio will take place on 16th November 2021. Learn about remedies to perform in Telugu
Story first published:Thursday, November 11, 2021, 10:28 [IST]
Desktop Bottom Promotion