For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కన్యరాశిలోకి సూర్యుడి ఎంట్రీతో, కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలే...! కానీ ఈ పరిహారాలు పాటిస్తే...!

సూర్యుడు కన్యరాశిలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడిని నవగ్రహాలకు రాజుగా చెబుతారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోని ప్రవేశించే కాలాన్నే సంక్రాంతి అని కూడా అంటారు.

Sun Transit in Virgo on 16 September 2020 Effects on Zodiac Signs in Telugu

ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వారి జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. వారు ఏ పని చేసినా.. ఎలాంటి ప్రయత్నాలు చేసినా వారి పనులన్నీ చాలా సులభంగా పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు.

Sun Transit in Virgo on 16 September 2020 Effects on Zodiac Signs in Telugu

కన్యరాశిలోకి సూర్యుడి సంచారం వల్ల కొన్ని రాశుల మంచి ప్రయోజనాలు చేకూరనున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రయోజనాలు ఎదురవ్వనున్నాయి. దీంతో ప్రతి ఒక్క రాశి చక్రం యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవ్వనున్నాయి. ఈ సందర్భంగా కన్యరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...

మేష రాశి..

మేష రాశి..

సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి వ్యాధులు, అప్పులు, శత్రువుల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ సమయంలో మీరు ఏవైనా ప్రయాణాలు చేపడితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లేదా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు సానుకూల ఫలితం రావొచ్చు. మేషరాశికి ఆరోస్థానంలో సూర్యుడు ఉంటాడు. వ్యాపారులు ఈ సమయంలో వ్యాపారం విస్తరించడం వంటి ఆలోచనలను వాయిదా వేయాలి.

పరిహారం : ప్రతిరోజూ సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడిని నీటిని అర్పించాలి.

వృషభరాశి..

వృషభరాశి..

సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఐదో స్థానంలో గ్రహం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ప్రేమలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. మీరు మీ అహాన్ని పక్కనబెట్టాలి. లేదంటే సమస్యలు ఎక్కువవుతాయి.

పరిహారం : ప్రతిరోజూ సూర్య అష్టకం పఠించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

మిధున రాశి..

మిధున రాశి..

సూర్యుడు కన్యరాశిలోకి సంచరించే సమయంలో మిధున రాశి యొక్క నాలుగో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఇలాంటి సమయంలో మీరు సకాలంలో వైద్యుడిని సంప్రదించాలి. మరోవైపు మీకు ప్రస్తుత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. విద్యార్థులకు ఈ సమయంలో మంచి ఫలితాలు రావాలంటే, మీరు మరింత కష్టపడాలి.

పరిహారం : శుభప్రదమైన ఫలితాల కోసం మీరు సూర్యబీజ్ మంత్రాన్ని పఠించాలి.

గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారు... మీ రాశి ఉందేమో చూడండి...గ్రహాల మార్పుతో ఈ రాశుల వారు చాలా అదృష్టవంతులవుతారు... మీ రాశి ఉందేమో చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

కన్య రాశిలోకి సూర్యుడి ప్రయాణం సమయంలో కర్కాటక రాశి యొక్క మూడో ఇంటి ద్వారా రవాణ జరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీకు మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. దీని ఫలితంగా మీరు పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచుతారు. ఆర్థిక పరంగా ఈ సమయం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు విజయం సాధించే అవకాశం ఉంది.

పరిహారం : మీ తండ్రి ఫొటోలకు పూజించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారి రెండో ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సూర్యుడి రవాణా మీ జీవితంలో అనేక విషయాలలో శుభప్రదంగా ఉంటుంది. మీ భవిష్యత్ మెరుగుదల కోసం చాలా మంది ఇప్పటినుండే ప్లాన్ చేస్తారు. ఆర్థికంగా పురోగమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు మీ అహన్ని అధిగమించకుండా చూసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు కూడా వెళ్లొచ్చు. అలాగే మీ రోజువారీ ఆహారంలో మెరుగుదల తీసుకురాకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ముఖ్యంగా మీ కళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

పరిహారం : ఆదివారం రోజున మీ తండ్రికి ఏదైనా బహుమతిని ఇవ్వాలి.

కన్య రాశి..

కన్య రాశి..

సూర్యుడు కన్యరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే నిద్రలేవడం మరియు వ్యాయామం లేదా యోగా చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసిక ఒత్తిడి మరియు సమస్యలను అధిగమించేందుకు ధ్యానం కూడా చేయొచ్చు. ఈ సమయంలో మీరు చాలా పనులను పూర్తి చేయాలని భావిస్తారు. అందుకే వాటిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మిగతావన్నీ మరచిపోతారు. వివాహితులకు ఈ సమయం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారం : ఆదివారం రోజున బెల్లం దానం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

Mercury Transit In Virgo 2020 : కన్యరాశిలోకి బుధుడి ఎంట్రీ వల్ల ఏ రాశి వారికి లాభమంటే...!Mercury Transit In Virgo 2020 : కన్యరాశిలోకి బుధుడి ఎంట్రీ వల్ల ఏ రాశి వారికి లాభమంటే...!

తులా రాశి..

తులా రాశి..

ఈ రాశి యొక్క 12 స్థానం గుండా సూర్యుడి రవాణా జరుగుతుంది. ఈ సమయంలో తులరాశి వారికి ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసేవారికి లేదా విదేశాలతో వ్యాపార సంబంధం కలిగి ఉండే వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని మంచి ఫలితాలను పొందొచ్చు. అలాగే అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండాలి. ఈ సమయంలో విద్యార్థులకు మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : సూర్యుడి ఆశీర్వాదం కోసం మీ తండ్రికి బహుమతిని ఇవ్వండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

సూర్యుడు ఈ రాశి యొక్క పదకొండో స్థానం నుండి ప్రయాణిస్తాడు. ఈ సమయంలో ఈ రాశి వారి కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు వివిధ కోణాల్లో లాభాలను కూడా పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. రాజకీయాల్లో ఉండే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు తమ చదువులకు సంబంధించి అందరి మద్దతును పొందుతారు.

పరిహారం : అవసరమైన వారికి ఆదివారం రోజున సహాయం చేయండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

కన్యరాశిలోకి సూర్యుడి రవాణా సమయంలో ఈ రాశి యొక్క పదో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి వంటివి రావొచ్చు.. మీరు చేసే పని సహోద్యోగులను కూడా బాగానే ఆకట్టుకుంటుంది.ఈ సమయంలో మీరు పెండింగులో ఉండే పనులను పూర్తి చేస్తారు. మీ కుటుంబ జీవితంలో అందరితో మంచి సంబంధాలు ఉంటాయి.

పరిహారం : ఈ ఆదివారం మీ ఉంగరపు వేలులో రూబీ రత్నాన్ని ధరించండి.

మకర రాశి..

మకర రాశి..

సూర్యుడి రవాణా ఈ రాశి యొక్క తొమ్మిదో స్థానం ద్వారా జరుగుతుంది. ఈ సమయంలో మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ పరంగా మీ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకోకండి. అంతేకాదు, మీరు ఉద్యోగ మార్పులపై ప్రణాళికలు వేస్తుంటే, మీరు ప్రస్తుతానికి ఆ ఆలోచనను కూడా వాయిదా వేయాలి. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు. మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనమస్కారం చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

సూర్యుడి రవాణా ఈ రాశి యొక్క ఎనిమిదో స్థానం ద్వారా జరుగుతుంది. ఈ సమయంలో కుంభ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు కలగొచ్చు. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీ పనులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో కూడా ప్రతికూలంగా ఉంటుంది. వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే విద్యార్థులు, పరిశోధనలతో సంబంధం ఉండేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఆదివారం రోజున సూర్యోదయం సమయంంలో ఏదైనా గుడికి విరాళం ఇవ్వండి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి యొక్క ఏడో స్థానం గుండా సూర్యుని రవాణా జరుగుతుంది. ఈ సమయంలో మీన రాశి వారు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు చిన్న విషయాలకే మీ నిగ్రహాన్ని కోల్పోతారు. ఇది మీ జీవిత భాగస్వామిని కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. అందువల్ల, మీరు మీ భాగస్వామితో బహిరంగ సంభాషణ కలిగి ఉండాలి. విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఓపికగా ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి.

పరిహారం : మీకు శుభ ఫలితాలు రావడానికి ఆదివారం రోజున రాగిని దానం చేయండి.

English summary

Sun Transit in Virgo on 16 September 2020 Effects on Zodiac Signs in Telugu

Sun Transit in Virgo effects on zodiac signs : Sun will make its transit in the zodiac sign Virgo on 16 September 2020. Read on
Desktop Bottom Promotion