For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుందర్ పిచాయ్ : టెక్నాలజీ టాపర్ కు ఆల్ఫాబెట్ సిఇఒగా బంపరాఫర్..

ప్రపంచవ్యాప్తంగా భారత టెక్కీల హవా కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే ఆల్ఫాబెట్ నూతన సిఇఒ సుందర్ పిచాయ్. ఐఐటి ఖరగ్ పూర్ నుండి గూగుల్ సిఇఒగా ఎదిగిన సుందర్ తాజాగా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఒగా బాధ్యతలు స్

|

జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ రావాలి. అయితే నేటి యువ తరం అలా చేయకుండా మాకు ఆ సౌకర్యాలు లేవు.. ఈ సౌకర్యాలు లేవు.. మాకు కూడా మౌలిక వసతులు ఉంటే మేము కూడా ఉన్నత స్థానాలను అవలీలగా అధిరోహిస్తామని ప్రగల్భాలు పలుకుతారు కానీ కష్టపడి మాత్రం పని చేయరు.

Sundar Pichai

అయితే కొందరు మాత్రం తమకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటినన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ జీవితంలో పైకి వస్తుంటారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో సుందర్ పిచాయ్ ఒకరు. ఆయన గూగూల్ సిఇఒ వంటి స్థానాన్ని అధిరోహించడానికి అతను పడ్డ కష్టాలను వింటే మీకు కన్నీళ్లొస్తాయి. ఒకప్పుడు తాను నేలపై నిద్రించానని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంకా ఆయన ఏమేమి చెప్పారు. ఆయనకు తాజాగా అల్ఫాబెట్ సిఇఒగా అదనపు బాధ్యతలు ఎలా వచ్చాయనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి...

భారత టెక్కీల హవా..

భారత టెక్కీల హవా..

PC : Twitter

ప్రపంచవ్యాప్తంగా భారత టెక్కీల హవా కొనసాగుతోంది. అందుకు నిదర్శనమే ఆల్ఫాబెట్ నూతన సిఇఒ సుందర్ పిచాయ్. ఐఐటి ఖరగ్ పూర్ నుండి గూగుల్ సిఇఒగా ఎదిగిన సుందర్ తాజాగా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సిఇఒగా బాధ్యతలు స్వీకరించారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ ఆల్ఫాబెట్ నుండి ఎగ్జిక్యూటివ్ పదవుల నుండి తప్పుకుని ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించారు.

ఆల్ఫాబెట్ లో అతనే బిగ్ బాస్..

ఆల్ఫాబెట్ లో అతనే బిగ్ బాస్..

PC : Twitter

ఇప్పటివరకు సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు సిఇఒగా పనిచేసిన సుందర్ తాజాగా ఆల్ఫాబెట్ కు సైతం బాస్ గా వ్యవహరించనున్నారు. తాజా పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సిఇఒలలో సుందర్ పిచాయ్ కూడా ఒకరిగా నిలవనున్నారు. ఇప్పటికే మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సైతం మన భారతీయుడు సత్యనాదెళ్ల సిఇఒగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే..

మధురై నుండి సిలీకాన్ వరకు..

మధురై నుండి సిలీకాన్ వరకు..

PC : Twitter

మన దేశంలోని తమిళనాడు రాష్ట్రం మధురైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ రెండు గదుల ఇంట్లో నివసించేవాడు. తన తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు. తల్లి స్టెనోగ్రాఫర్. ఈయన ఐఐటి ఖరగ్ పూర్ లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తున్న సమయంలో తన జీవిత భాగస్వామి అంజలిని కలిశాడు. తర్వాత అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు. అనంతరం 2004లో గూగుల్ చేరారు.

అప్పుడే గూగుల్ సిఇఒ

అప్పుడే గూగుల్ సిఇఒ

PC : Twitter

ఆ సంస్థలో చేరిన కొద్దొరోజుల్లోనే కీలకమైన గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతంగా మరియు అత్యంత వేగంగా పూర్తి చేశారు. 2013లో ఆయన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్ ఛార్జిగా ఎదిగారు. ఆ తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. ఈయనలో సామర్థ్యం ఉంది కాబట్టే ఆయనకు ఆల్ఫాబెట్ ప్రాజెక్టులు కూడా ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల అక్కడ ఉద్యోగుల నిరసనలు, వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు ఆయన్ను ఆల్ఫాబెట్ సిఇఒ పీఠానికి అత్యంత దగ్గర చేశాయి.

గూగుల్ రెండో స్థానంలో..

గూగుల్ రెండో స్థానంలో..

ఫాక్ట్ సెట్ రీసెర్చ్ సిస్టమ్స్ ప్రకారం ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ 137 బిలియన్ డాలర్ల తర్వాత, గూగుల్ సంస్థ 128 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉంది. ఇందులో సుందర్ పిచాయ్ ది కీలకపాత్ర పోషించారు. అంతేకాదు గూగుల్ లో జిమెయిల్, గూగుల్ మ్యాప్స్, హలో గూగుల్ వంటి ప్రాజెక్టుల విజయవంతంలో కీలకపాత్ర పోషించారు.

‘నేను సంతోషిస్తున్నాను‘

‘‘హోదా మార్పు వల్ల ఆల్ఫాబెట్ సంస్థాగత స్వరూపంలో పెద్ద మార్పులేమీ ఉండవు. కంప్యూటింగ్ యొక్క సరిహద్దులను చెరిపేసేందుకు, అందరికీ మరింత అందుబాటులో ఉండేలా గూగుల్ మరింత డెవలప్ చేసేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాను. టెక్నాలజీలో పెను సవాళ్లను అధిగమించే దిశగా పని చేస్తాను. అదే సమయంలో ఆల్ఫాబెట్ సిఇఒగా బాధ్యతలు స్వీకరించే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఆల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా జరుగుతుంది.‘‘ అని చెప్పారు.

సుందర్ విద్యాభ్యాసం గురించి..

సుందర్ విద్యాభ్యాసం గురించి..

సుందర్ పిచాయ్ తన కళాశాలలో విద్యాభ్యాసం గురించి న్యూయర్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడారు. ఐఐటి ఖరగ్ పూర్ లో చదువుతున్న సమయంలో తొలి సంవత్సరం పరీక్షలో సి గ్రేడ్ సాధించినట్లు తెలిపారు. అప్పుడు మార్కులు చాలా పేలవంగా వచ్చినట్టు ఒప్పుకున్నాడు. అయితే వాటిని అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పాడు.

సుందర్ నికర ఆస్తులు..

సుందర్ నికర ఆస్తులు..

సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థలో చేరినప్పటి నుండి సెర్చి దిగ్గజం యొక్క ధర మార్కెట్ లో డబుల్ క్యాపిటలైజేషన్ కు పెరిగింది. ప్రస్తుతం ఇది 894 బిలియన్ డాలర్లుగాఉంది. అలాగే సుందర్ పిచాయ్ యొక్క నికర ఆస్తుల విలువ 150 మిలియన్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన మరిన్ని ఎక్కువ బాధ్యతలు చేపట్టాడు కాబట్టి ఇంకా ఆస్తులు పెరిగే అవకాశం ఉంది.

ఒక భారతీయుడైన సుందర్ పిచాయ్ విజయానికి మేము గర్విస్తున్నాము. బోల్డ్ స్కై తెలుగు తరపున అతనికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము!

English summary

Sundar Pichai: Facts About Alphabet's New CEO That Will Inspire You To Give Your Best In Everything

The IIT Kharagpur alumni, Sundar Pichai who was CEO of Google will now be taking the charge of Alphabet, Googles parent company as well. This happened after Googles co-founder stepped down from their executive roles.
Story first published:Thursday, December 5, 2019, 12:50 [IST]
Desktop Bottom Promotion