For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతని కలలన్నీ కల్లలు పోయాయన్న సుశాంత్ స్కూల్ మేట్స్...

సుశాంత్ సింగ్ కలలు అన్నీ అర్ధాంతరంగా ఆగిపోయాయని బాధపడుతూ చెప్పిన అతని క్లాస్ మేట్స్.

|

జీవితంలో ఓడిపోయామనే బాధలో... తనకెవరూ లేరనే భ్రమలో.. ప్రేమించిన ప్రియురాలు మోసం చేసిందనో.. తట్టుకోలేని నరకయాతన వంటి ఎన్నో కారణాలతో చాలా మంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు.

Sushant Singh Rajputs Schoolmate Reacts To His Sudden Death

అందులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒకరు. కానీ ఈ బాలీవుడ్ హీరోకు ఏం లోటొచ్చిందో తెలియదు కానీ.. అర్ధాంతరంగా తన జీవితానికి ముగింపు పలికాడు. చిన్నవయసులోనే స్టార్ హీరోగా ఎదిగి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. చేసింది కేవలం 12 సినిమాలే అయినా అందులో దాదాపు అన్నీ హిట్ సినిమాలే.

Sushant Singh Rajputs Schoolmate Reacts To His Sudden Death

కావాల్సినంత డబ్బు ఉంది. ఎలాంటి కోరికలున్నా తీర్చుకునేందుకు ఎన్నో అవకాశాలూ ఉన్నాయి. అయినా తన మనసులో ఏ బాధ కలిగిందో.. తన మరణానికి తీవ్రమైన ఒత్తిడే కారణమా.. లేదా ఏదైనా భయంకరమైన కారణం ఉందా అనే వివరాలేవీ తెలియదు.

Sushant Singh Rajputs Schoolmate Reacts To His Sudden Death

అయితే సుశాంత్ రాసుకున్న 50 డ్రీమ్స్ లిస్ట్ చదివితే ఎవరికైనా కంట కన్నీరు రావాల్సిందే. ఎందుకంటే తన కలలు, కోరికలు, ఆశయాలు, తను చేయాలనుకున్న సేవలు అన్నీ అతనితో పాటే మాయమైపోయాయి. సుశాంత్ తను కన్న కలల్లో తాను ఎంజాయ్ చేసే వాటికంటే ఇతరులకు ఏదో చేయాలన్నదే ఎక్కువగా కనిపించేది.

Sushant Singh Rajputs Schoolmate Reacts To His Sudden Death

సుశాంత్ సూసైడ్ నేపథ్యంలో పాట్నాకు చెందిన తన క్లాస్ మేట్ అనూభ(33) 'బోల్డ్ స్కై తెలుగు'తో చిన్ననాటి మధురమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. తను స్కూల్ లో ఎలా ఉండేవాడో.. తను ఎలా ఎదిగాడు అనే వివరాలను వెల్లడించారు.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తన కలల్లో కొన్ని ముఖ్యమైనవి.

తన కలల్లో కొన్ని ముఖ్యమైనవి.

  • మహిళలకు ఆత్మరక్షణ ఇవ్వాలి.
  • అందరికీ ఉచిత విద్యను అందివ్వాలి.
  • అంతరిక్షం గురించి పిల్లలకు నేర్పించాలి.
  • గాల్లో విమానం ఎలా ఎగురుతుందో తెలుసుకోవాలి.
  • లెఫ్ట్ హ్యాండ్ తో క్రికెట్ ఆడాలి.
  • ఛాంపియన్ తో టెన్నిస్ ఆడాలి.
  • వేయి మొక్కలు నాటాలి.
  • చదువుకున్న కాలేజీ హాస్టల్లో పాత స్నేహితులతో కలిసి గడపాలి.
  • ఇస్రోలో-నాసాలో వర్క్ షాపులకు కనీసం 100 మంది పిల్లనైనా పంపాలి.
  • ఇలా అతని కలలన్నీ నిజమయ్యాయో లేదో తెలియదు కానీ అతని జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. నీ నటన అద్వితీయం.. నీ జీవితం స్ఫూర్తిదాయకం.. నీ ఎదుగుదల మాకు ఒక పాఠం.. కానీ నీ ముగింపు మాత్రం మాకు మోయలేని భారం.. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అని తన స్కూల్ మేట్స్ బాధతో చెప్పిన మాటలివి...

    నవ్విస్తూ ఉండేవాడు..

    నవ్విస్తూ ఉండేవాడు..

    తను స్కూల్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ మమ్మల్ని తెగ నవ్విస్తూ ఉండేవాడు. తెగ జోకులు వేసేవాడు. ‘సుశాంత్ నిజంగ్ Fun and Loveble person person during the school days' అని గుర్తు చేసుకున్నారు. తనతో గడిపిన ప్రతిక్షణం మేం బాగా ఎంజాయ్ చేశాం.

    నిజమైన హీరో..

    నిజమైన హీరో..

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిజమైన హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదు. తన నటన ఎంతో ప్రత్యేకమైనది. తను ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నతస్థాయికి చేరాడు. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా తెలుసుకుందాం.

    బీహార్ లో జననం..

    బీహార్ లో జననం..

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 1986, జనవరి 21వ తేదీన బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో జన్మించాడు. తను ప్రాథమిక విద్య సెయింట్ కారెన్స్ ఉన్నత పాఠశాలలోనే కొనసాగింది. తన కుటుంబంలోని ఐదుగురి సంతానంలో సుశాంత్ ఒక్కడే పురుషుడు. తనకు నలుగురు సోదరీమణులు ఉన్నారు.

    2002లో తల్లి మరణం..

    2002లో తల్లి మరణం..

    2002 సంవత్సరంలో సుశాంత్ తల్లి మరణించారు. దీంతో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకున్నారు. అనూభ చెప్పిన వివరాల మేరకు.. తన తల్లి మరణానికి ముందు తను చదువుపై అంతగా శ్రద్ధ చూపేవాడు కాదు. అయితే తర్వాత చాలా చురుకున విద్యార్థిగా మారిపోయాడు. అది ఎంతలా అంటే ఏకంగా ఆలిండియా ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్(AIEEE)లో 7వ ర్యాంకు సాధించాడు.

    మెకానికల్ ఇంజినీంగులో..

    మెకానికల్ ఇంజినీంగులో..

    2003లో ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ లో మెకానికల్ బ్రాంచ్ లో చేరాడు. అదే సమయంలో కొరియోగ్రాఫర్ శియామాక్ దావర్ డ్యాన్స్ క్లాసులలో కూడా జాయిన్ అయ్యాడు. అలాగే క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనేవాడు. అలా కాలేజీ లైఫ్ ఆనందంగా గడిపాడు. ఆ తర్వాత మూడో సంవత్సరంలోనే యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు.

    2008లోనే నటుడిగా గుర్తింపు..

    2008లోనే నటుడిగా గుర్తింపు..

    సుశాంత్ సింగ్ 2008లోనే బాలాజీ టెలిఫిలిమ్స్ ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో తను చిన్న క్యారెక్టర్ చేసినప్పటికీ తన ప్రతిభను చాటాడు. అలాగే 2010 సంవత్సరంలో డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు.

    ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో..

    ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీలో..

    M.S.Dhoni:The Untold Storyలో బయోగ్రఫీలో నటించిన సుశాంత్ అచ్చం ధోనీలాంటి హావభావాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా లభించింది. ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది.

    చివరి సినిమా చిచ్చోరే..

    చివరి సినిమా చిచ్చోరే..

    ఇక 2019 సంవత్సరంలో చిచ్చోరే సినిమాలో శ్రద్ధా కపూర్ తో కలిసి సూసైడ్ ఎంత తప్పో వివరిస్తూ... తన స్నేహితులతో కలిసి చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటూ.. ఒక్కొక్కరిగా అందరినీ పిలిపించి వివరించే ప్రయత్నం చేశాడు. కానీ నిజ జీవితంలో మాత్రం తానే ఆ పొరపాటును చేసేశాడు.

    ప్రముఖుల సంతాపం...

    ప్రముఖుల సంతాపం...

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టాలీవుడ్ హీరో మహేష్ భాబు, నటి కీర్తి సురేష్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాడ సానుభూతిని తెలిపారు.

English summary

Sushant Singh Rajput's Schoolmate Reacts To His Sudden Death

Here we talking about sushant singh rajput's schoolmate reacts to his sudden death. Read on.
Desktop Bottom Promotion