For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచర్ తోనే మనందరికీ ఫ్యూచర్.. దాన్ని డిస్ట్రబ్ చేస్తే మనకే డేంజర్.. కానీ ఇలా చేస్తే చాలా బెటర్..

ప్రపంచంలో ఇప్పటికే చాలా వరకు వాయు కాలుష్యం వ్యాపించి అందరినీ తెగ ఇబ్బంది పెడుతోంది.

|

ప్రకృతి కరుణిస్తేనే మనకు ఆకృతి..
ప్రకృతితోనే మనకు జీవన భ్రుతి..
ప్రకృతితోనే సమస్త పురోగతి..
ప్రకృతి కన్నెర్రజేస్తే అధోగతి..

Your Nature

పర్యావ'రణం' గురించి ప్రతిఒక్కరు మాట్లాడుతూనే ఉంటారు. అయినా చాలా మందికి ప్రకృతి పవర్ ఏంటో అర్థం కావడం లేదు. ప్రకృతి అనేది లేకపోతే అసలు మన విశ్వం అనేది ఉండదనే వాస్తవాన్ని చాలా మంది పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడిప్పుడే కొందరు పర్యావరణంపై శ్రద్ధ చూపుతున్నారు. దీని కోసం వారు సాధారణంగా జీవిస్తే సరిపోదు. ప్రతి ఒక్కరు మనల్ని మనం ఎలా అయితే ఆరోగ్యంగా కాపాడుకుంటామో ప్రకృతిని పచ్చగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అందుకు కాలేజీ లైఫ్ నుండే ఇలాంటివి స్టార్ట్ చేయడానికి కరెక్ట్ టైమ్ అని మేము భావిస్తున్నాం.

ప్రపంచంలో నీరు మరియు వాయు కాలుష్యం, అడవుల్లో మంటలు, గ్లోబల్ వార్మింగ్ మరియు మరెన్నో సమస్యలను ఎదుర్కొంటున్న విషయం చాలా మందికి తెలుసు. కానీ వీటికి అడ్డుకట్ట ఎలా వేయాలో అని చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణకు మీరు చిన్న వయసులో ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారా? ప్రకృతి మాతను కాపాడేందుకు మీ వంతు ప్రయత్నం చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఇందుకు మీరు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. పనులు అంటే అవేవో పెద్ద పెద్ద పనులు కాదు, బండరాళ్లు మోయడం, డబ్బులు ఖర్చు పెట్టడం అసలే కాదు. మీరు డెయిలీ చేసే పనుల మాదిరిగానే ఉంటాయి. అవేంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చదవండి.

ఆ సమయంలో లైట్లను ఆపేయండి..

ఆ సమయంలో లైట్లను ఆపేయండి..

మీరు తరగతి గదిలో ఉన్నప్పుడు, మీరు అధ్యయనం చేయడానికి తగినంత కాంతి మరియు గాలి అవసరం అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ, మీరు క్లాస్ రూమ్ నుండి బయలుదేరినప్పుడు లేదా తరగతి ముగిసినప్పుడు లైట్లను ఆపేయండి. విద్యుత్ ఆదా చేయడం వల్ల మీరు చాలా వనరులను ఆదా చేసినట్టే.. ప్రకృతికి సహకరించినట్టే..

ప్లాస్టిక్ వాడకం మానేయండి..

ప్లాస్టిక్ వాడకం మానేయండి..

మీరు మీ రోజువారీ ఉపయోగం కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాక్సులు, సీసాలు మరియు ప్లేట్లను పరిశీలిస్తుంటే, అది ప్లాస్టిక్ కాలుష్యాన్ని మాత్రమే పెంచుతుందని అర్థం చేసుకోవాలి. మీరు నిజంగా ప్రకృతికి అనుకూలంగా జీవించాలి అనుకుంటే మీరు తప్పకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ లేదా డిస్పోజబుల్స్ వాడటం ఆపండి. దీనికి బదులు సీసాలు, పలకలను ఉపయోగిస్తే మీరు ప్రకృతికి ఎంతో సేవ చేసిన వారు అవుతారు.

ప్రజా రవాణాను ఎంచుకోండి..

ప్రజా రవాణాను ఎంచుకోండి..

ప్రపంచంలో ఇప్పటికే చాలా వరకు వాయు కాలుష్యం వ్యాపించి అందరినీ తెగ ఇబ్బంది పెడుతోంది. కాలేజీకి వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఉపయోగించడానికి బదులు ప్రజా రవాణాను ఎంచుకోండి. ఇతర రవాణా మార్గాలతో పోల్చినప్పుడు ప్రజా రవాణా తక్కువ. అంతే కాదు మీ బడ్జెట్ కు ఇది కలిసి వస్తుంది.

పర్యావరణ అనుకూల పేపర్..

పర్యావరణ అనుకూల పేపర్..

మీరు కాలేజీ స్టూడెంట్ ఉన్నప్పుడు పేపర్ వాడకం అనివార్యం. కాబట్టి పేపర్ ను వేస్ట్ చేయడం పేపర్ ఎలాగైనా రీసైకిల్ చేయబడుతుందని అనుకోవడం తెలివైన పని కాదు. దీనికి బదులుగా మీరు పర్యావరణ అనుకూల పేపర్ ను ఎంచుకోవాలి. పేపర్ ను వేస్ట్ చేయడం వల్ల కొన్ని రకాల కాలుష్యాలకు దోహదం చేస్తుంది. పేపర్ అవసరం లేనప్పుడు రాయడం మానుకోండి. మీరు పాత పుస్తకాలను కూడా తిరిగి ఉపయోగించుకోవచ్చు. కొత్త పుస్తకాలతో పోల్చినప్పుడు పాత పుస్తకాల ధర తక్కువగా ఉంటుంది. ఇది చెట్లను నరికివేయడానికి దారి తీయదు.

నడక లేదా సైకిల్ రైడ్..

నడక లేదా సైకిల్ రైడ్..

ప్రతిరోజూ మీరు నడక ప్రారంభిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. సైకిల్ తొక్కితే కాలుష్యాన్ని తగ్గించడంలో మీరు ప్రకృతికి ఎంతో సహాయపడిన వారవుతారు. ఇది మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఒకవేళ మీరు బైక్ నడుపుతూ వాయు కాలుష్యాన్ని పెంపొందిస్తే మీరు అనారోగ్యానికి గురవుతారు.

నీటి బొట్టు కూడా..

నీటి బొట్టు కూడా..

ప్రతిరోజూ మీ రోజు వారీ పనుల్లో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రష్ చేయడం, స్నానం చేయడం, అంట్లు కడగడంతో పాటు ఇంకా చాలా పనులకు నీరు ఉపయోగించబడుతుంది. ప్రాథమిక అవసరాలకు నీటిని ఉపయోగించుకుంటే ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ బట్టలు లేదా పాత్రలు కడిగేటప్పుడు ట్యాప్ తెరిచి ఉంచడం, అనవసరం నీటిని వేస్ట్ చేయడం మూర్ఖమైన పని. మీరు షవర్ ఆన్ చేసినప్పుడు మీరు నీటి ప్రవాహాన్ని నియంత్రించలేకపోవచ్చు, కాబట్టి షవర్ కు బదులుగా బకెట్లను వాడాలని నిర్ధారించుకోండి. ఇది గణనీయమైన నీటిని ఆదా చేస్తుంది. అలాగే, మీ అవసరానికి అనుగుణంగా మీ సీసాలను నింపడానికి ప్రయత్నించండి.

డస్ట్ బిన్ ను ఉపయోగించండి..

డస్ట్ బిన్ ను ఉపయోగించండి..

స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం మరియు చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవడాన్ని అందరూ ఇష్టపడతారు. కానీ దీని కోసం మీరు వ్యర్థాలను డస్ట్ బిన్స్ లోనే ఉపయోగించాలి. అందువల్ల మీ చుట్టుపక్కల పర్యావరణం శుభ్రంగా పచ్చగా ఉంటుంది. దీని వల్ల మీకు సానుకూల శక్తి లభించి రోజంతా మీకు తాజా అనుభూతి కలుగుతుంది.

షాపింగుకు మీ సొంత బ్యాగులు..

షాపింగుకు మీ సొంత బ్యాగులు..

షాపింగుకు వెళ్లేటప్పుడు మీరు సొంత బట్టల సంచులను తీసుకెళ్లండి. కాగితపు బ్యాగుల కంటే ఇవి సులభంగా ఉంటాయి. చౌకగా కూడా లభిస్తాయి. మీకు తెలుసా వస్త్రాలు మరియు జనపనార సంచులు పర్యావరణ అనుకూలమైనవి. వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చు. ఇది అస్సలు హానికారం కాదు మళ్లీ మళ్లీ ఉపయోగించడం సులభం.

మొక్కలను పెంచడం..

మొక్కలను పెంచడం..

మొక్కలను నాటి చెట్లను పెంచాలి. వీటి ద్వారానే మనకు ఆక్సీజన్ అందుతుంది. గాలి మరియు ఇతర హానికరమైన వాయువులలో ఉండే కార్బన్ డయాక్సైడ్ ను చెట్లు పీల్చుకుంటాయి. అందుకే ప్రతి నెలా మీరు ఒక విత్తనాన్ని విత్తొచ్చు. లేదా ప్రారంభంలో ఒక మొక్కను నాటవచ్చు. మీరు వాటితో పెరిగేటప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీ మెరుగుదలను కూడా మీకు గుర్తు చేస్తుంది. మీ కళాశాల జీవితాన్ని పర్యావరణ అనుకూలంగా చేస్తుంది.

ఆహారాన్ని వృథా చేయకండి..

ఆహారాన్ని వృథా చేయకండి..

చాలా మంది ఇప్పటికీ చాలా ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఇప్పటికీ మన దేశంలో ఆకలి బాధలతో అలమటించే వారు రోజుకు కొన్ని వేల మందే ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మీరు మీ ప్లేటులో మిగిలిన ఆహారాన్ని వేస్ట్ చేయకుండా పేదలకు ఇవ్వండి. మీ చుట్టుపక్కల ఎవరైనా అవసరం లేదా ఆకలితో ఉన్న వారికి ఇవ్వండి. లేదా నిల్వ చేసిన ఆహారం మీరే తినండి.

పై దశలు అమలు చేయడం చాలా సులభం. మీరు వీటిని పాటించడం వల్ల పచ్చటి ప్రకృతికి సహాయం చేసినవారిలో ఒక అడుగు వేసిన వారు అవుతారు. అంతేకాదు మీరు మీ స్నేహితులు, బంధువులు మరియు కుటుంబసభ్యులకు కూడా అలా చేయమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రయత్నం చాలా ముఖ్యం.

English summary

Take Care Of Your Nature, 10 Eco-Friendly Ways That You Can Implement In Your College Life

Well, college life is full of enjoyment and as a college student, you are expected to give attention to studies, friendship, projects and exploring areas related to your field, but there is one thing that is above all, i.e, how we protect our environment.
Desktop Bottom Promotion