For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో వృషభ రాశి ఫలితాలు : ఈ రెండు నెలల్లో మీకు అత్యంత అనుకూలంగా సమయం...!

|

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి 2020 సంవత్సరంలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి. మీ దీర్ఘకాల కలలు కొన్ని ఈ సంవత్సరంలో నెరవెరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వేగంగా మారిపోతున్నట్టు మీరు భావిస్తారు.

ఇలాంటి వాటిలో విజయం సాధించేందుకు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో జనవరి నుండి డిసెంబర్ వరకు పని భారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా రోటీన్ పనులనే చేస్తారు.

అయితే పరిశోధన మరియు అమ్మకాలలో ఉన్నవారు ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహాన్నే పొందే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో పరిస్థితులు కొంత చేజారినప్పటికీ చివరికొచ్చేసరికి సానుకూలంగా మారతాయి. ఇలాంటి విషయాలతో పాటు మరిన్ని విషయాలను నెలల వారీగా తెలుసుకుందాం...

మేష రాశి జాతకం 2020 : ఆ విషయంలో అనేక మలుపులు ఉంటాయట...!

మొదటి నెల..

మొదటి నెల..

ఈ నెలలో మీరు కొన్ని ఎదురుదెబ్బలను ఎదుర్కోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అయితే శని గ్రహం వల్ల మీకు కొంత ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందడానికి సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి కారుణ్యమైన పనులు అయినా చేయవచ్చు. ఈ రాశి వారిలో ముఖ్యంగా యువత తమ ప్రియమైన వారిని మెప్పించడానికి ఈ నెల చాలా మంచి సమయం.

రెండో నెల..

రెండో నెల..

ఈ రాశి వారికి ఈ నెలలో ఇంటి వాతావరణం అల్లకల్లోలంా ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కష్టాల నుండి విముక్తి పొంది, ఆనందం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కాలంలో మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోండి.

మూడో నెల..

మూడో నెల..

ఈ నెలలో వృషభ రాశి వారికి గురుడు మరియు శని అనుకూలమైన స్థానాల్లో ఉన్నారు. దీని వల్ల మీరు ఈ నెలలో సంస్థాగత స్థానాల్లో సాఫీగా ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీరు ఈ నెలలో మీ ఆశయాలను మరియు కలలను సాకారం చేసుకోగలుగుతారు. అయితే మీ జీవితంలో కొన్ని ఆందోళనలు ఉంటాయి. ప్రతికూల శక్తి యొక్క భావన మీ చుట్టూ ఉన్నప్పటికీ మీరు సానుకూలంగా ఉండండి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం 2020లో ఈ రాశుల వారికి ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తుందట...

నాలుగో నెల..

నాలుగో నెల..

వృషభరాశి వారిలో మూడో వంతు ప్రజలు ఈ నెలలో వారి పుట్టినరోజును జరుపుకుంటారు. వీనస్ వీరికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇందుకు శుక్రుడు, అంగారక గ్రహాల ప్రభావమే కారణం. మీరు ఈ నెలలో ఏ పనులైనా చాలా సులభంగా చేయగలుగుతారు

ఐదో నెల..

ఐదో నెల..

ఈ నెలలో మీరు కీలకమైన పనులు చేయబోతున్నారు. మీకు సహాయం చేసిన పెద్దలకు మరియు అధికారులకు దన్యవాదాలు చెప్పడానికి ఇదే సరైన సమయం. ఈ నెలలో వృషభ రాశి వారికి సూర్యుడు మరియు బుధుడు చాలా అనుకూలంగా ఉంటారు. దీని విల్ల మీరు కమ్యూనికేషన్ నైపుణ్యాల వల్ల విజయవంతం అవుతారు.

ఆరో నెల..

ఆరో నెల..

వృషభ రాశి వారికి జూన్ మాసం అత్యంత అనుకూలమైన మాసం. ఈ నెలలో మీ రాశిపై ఎలాంటి గ్రహాల ప్రభావాలు ఉండవు. అందువల్ల మీ జీవితాన్ని మీరు ఆనందంగా ఆస్వాదిస్తారు. అయితే నిర్లక్ష్యంగా ఉండకండి. భవిష్యత్తును ఊహించుకుని పనికి సంబంధించి ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకోండి.

ఏడో నెల..

ఏడో నెల..

ఈ రాశి వారికి ఈ నెలలో వారి సామర్థ్యానికి సంబంధించి కొన్ని పరీక్షలను ఎదుర్కొంటారు. ఈ సమయంలోనే మీ నైపుణ్యాలేంటో మీరు చూపించాల్సి ఉంటుంది. ఏదైమైనా, అంగారక గ్రహం, బృహస్పతి మరియు శని గ్రహాలు మీ సంకేతానికి అనుకూలమైన అంశంలో కలిసి ఉంటాయి. ఇవి మీరు ముందుకు సాగడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.

2020 నూతన సంవత్సర రాశి ఫలాలు : ఈ ఐదు రాశుల వారు చాలా అదృష్టవంతులట...

ఎనిమిదో నెల..

ఎనిమిదో నెల..

ఈ నెలలో వృషభ రాశి వారిపై మెర్క్యురీ, యురేనస్ మరియు సూర్య గ్రహాలతో అంగారక గ్రహం బాగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారికి పూర్తి శక్తిని ఇస్తుంది. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మానసికంగా మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆధ్యాత్మికంగా నవీకరించడానికి మీరు కొన్ని తీర్థయాత్రలు మరియు పవిత్ర పర్యటనలను ప్రారంభించండి.

తొమ్మిదో నెల..

తొమ్మిదో నెల..

వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఏదైనా అద్భుత సమయం ఉందంటే అది ఈ మాసమే. ఇంతకు ముందు సమయం కన్నా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుటుంది. కన్యరాశిలోని సూర్యుడు ఈ నెలలో మీ రాశి చక్రానికి అనుకూలంగా ఉంటాడు. దీని వల్ల మీకు చాలా సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ నెలలో పెండింగు పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

పదో నెల..

పదో నెల..

వృషభ రాశి వారికి ఈ నెలలో బుధ గ్రహం వ్యతిరేకంగా ఉంటుంది. దీని వల్ల మీ జీవితంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీ వ్యక్తిగత సంబంధాలను ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి.

పదకొండో నెల..

పదకొండో నెల..

ఈ రాశి వారికి ఈ నెలలో సూర్యుడు, మెర్క్యురీ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీని వల్ల మీరు ఈ నెలలో కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సమయం మారుతున్న కొద్దీ మీరు మార్స్ మరియు యురేనస్ గ్రహాలు బుధుడు మరియు సూర్యుడికి అనుకూలంగా మారతాయి. దీని వల్ల మీ జీవితంలో కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

చివరి నెల..

చివరి నెల..

ఆంగ్ల చివరి సంవత్సరమైన డిసెంబర్ నెలలో వృషభ రాశి వారు ఎక్కువ శక్తిని కలిగి ఉంటారు. ఈ నెలలో శని అంగారక గ్రహం మరియు బృహస్పతితో కలిసి ఉన్నందున మీకు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తారు.

English summary

Taurus 2020 Horoscope in Telugu

Here we talking about taurus 2020 horoscope in telugu. Read on