For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Teacher's Day 2023: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే...

|

నాకు అ, ఆల నుండి గుణింతాల వరకు, అంకెల నుండి లెక్కల వరకు, పిల్లల పాటల నుండి చరిత్ర వరకు, ఆటలను, మాటలను, విద్యను అన్నింటినీ దగ్గరుండి నేర్పించిన ఉపాధ్యాయులందరికీ నమస్సుమాంజలలు తెలియజేస్తున్నా.

మన జీవితంలో ఉపాధ్యాయులు లేని జీవితం ఊహించలేనిది. వారి ప్రభావం అనునిత్యం మనపై ఎప్పుడో ఒకప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే ఉపాధ్యాయులను స్మరించుకోవడానికి సెప్టెంబర్ 5న ఎందుకు ఆనవాయితీగా వస్తోంది.

Teachers Day 2023: Why Dr Sarvepalli Radhakrishnan’s Birthday Is Dedicated To Teachers

డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారి జయంతి రోజునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు వేడుకలుగా జరుపుకుంటారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గొప్ప విద్యావేత్త..

గొప్ప విద్యావేత్త..

చాలా మందికి డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ అంటే తొలి ఉపరాష్ట్రపతిగా.. రాష్ట్రపతిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన దాని కంటే ముందు ఒక గురువు. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తెలుగు బ్రాహ్మాణ కుటుంబంలో జన్మించారు. వారి పూర్వీకులది నెల్లూరు జిల్లాలలోని సర్వేపల్లి. అందుకే వారి ఇంటిపేరు కూడా సర్వేపల్లిగా మారింది. అయితే రాధాక్రిష్ణన్ మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో జన్మించారు.

పలు విశ్వవిద్యాలయాల్లో..

పలు విశ్వవిద్యాలయాల్లో..

రాధాక్రిష్ణన్ మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత మైసూర్, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధించారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీతో పాటు బెనారస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ప్రాచ్య మతాల అంశంపై బోధించేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆయనను ఆహ్వానించింది.

పదేళ్లు ఉపరాష్ట్రపతిగా..

పదేళ్లు ఉపరాష్ట్రపతిగా..

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాక్రిష్ణన్ నియమితులయ్యారు. ఆయన పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగి, అనంతరం రాష్ట్రపతిగా 1962లో నియమితులయ్యారు.

గురువులకు గర్వకారణం..

గురువులకు గర్వకారణం..

ఒక గురువుగా పని చేసిన వ్యక్తి రాష్ట్రపతి పదవిలో కూర్చోడం ఆ పదవికే వన్నె తెచ్చింది. అందుకే 1962 నుండి ఆయన పుట్టినరోజునే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ఆయను జయంతి వేడుకలను జరుపుకోవడం ఇష్టం లేదు.

దీన్ని గౌరవంగా..

దీన్ని గౌరవంగా..

అందుకే తన పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు. సమాజానికి సేవలు చేస్తున్న టీచర్లందరికీ ఇది గౌరవంగా ఉంటుందని భావించారాయన

యువతకు ఆదర్శమూర్తి..

యువతకు ఆదర్శమూర్తి..

డాక్టర్ రాధాక్రిష్ణన్ కేవలం గురువు మాత్రమే కాదు.. ఆయన గొప్ప మానవతావాది. అందుకే ఈయన యువతకు ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఈయనకు 1931లోనే భారతరత్న పురస్కారం కూడా లభించింది. అంతేకాదు ఏకంగా 11 సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు.

ఏ సాయం కావాలన్న..

ఏ సాయం కావాలన్న..

రాధాక్రిష్ణన్ అన్న.. ఆయన బోధనలన్నా విద్యార్థులకు ఎంతగానో ఇష్టం. ఎందుకంటే విద్యార్థులకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా.. చేసేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అందుకే టీచర్స్ డే వేడుకలను చేసుకోవడానికి ఆయన జయంతిని మించిన రోజు లేదని చెప్పొచ్చు.

విద్యార్థులు గురువుపై ఉన్న ప్రేమను..

విద్యార్థులు గురువుపై ఉన్న ప్రేమను..

అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతితో పాటు ఉపాధ్యాయ దినోత్సవంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు విద్యార్థులు తమ గురువులపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ బహుమతులను అందజేస్తుంటారు.

English summary

Teacher's Day 2023: Why Dr Sarvepalli Radhakrishnan’s Birthday Is Dedicated To Teachers

Here we talking about Teacher's Day 2023 : why dr.sarvepalli radhakrishnan's birthday is dedicated to teachers. Read on
Desktop Bottom Promotion