For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ క్యాన్సర్ డే : ఈ మహమ్మారికి ఎంతమంది తెలుగు సినీ ప్రముఖులు బలయ్యారో తెలుసా...

తెలుగు సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ధర్మవరపు సుబ్రమణ్యం కూడా కాలేయ క్యాన్సర్ తో ఆస్పత్రిలో చాలా రోజులు చికిత్స చేయించుకున్నాడు.

|

ప్రాణాంతక క్యాన్సర్ రోగం మన తెలుగు వారిపై ఎక్కువగా పగబట్టినట్టుంది. అందుకే మన తెలుగు సినిమా రంగం ఎందరో ప్రతిభావంతులైన నటులు మరియు నటీమణులను కోల్పోయింది. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు నుండి ధర్మవరపు సుబ్రమణ్యం, అంజలి వంటి ప్రముఖులందరూ క్యాన్సర్ రోగానికి బలయ్యారు.

Actors Who Died Of Cancer

ఈ క్యాన్సర్ మహమ్మారికి లింగ భేదం.. వయసు భేదం వంటివి అస్సలు ఉండవు. ఎవరి ప్రాణాలైనా చాలా తేలికగా హరించేస్తుంది. అయితే ఈ రోగం ఎందుకు వస్తుందో తెలిస్తే దీన్ని తరిమికొట్టడం తేలికే. కానీ అప్పట్లో వీరందరికీ ఈ క్యాన్సర్ పై అవగాహన లేక లేదా కొంత నిర్లక్ష్యం వల్ల వీరు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా తెలుగు సినిమా రంగంలో క్యాన్సర్ బారిన పడి మరణించిన ప్రముఖల గురించి తెలుసుకుందామా...

వరల్డ్ క్యాన్సర్ డే 2020: చక్కెర మరియు క్యాన్సర్‌కు ఇంత పెద్ద సంబంధం ఉందా?వరల్డ్ క్యాన్సర్ డే 2020: చక్కెర మరియు క్యాన్సర్‌కు ఇంత పెద్ద సంబంధం ఉందా?

అక్కినేని నాగేశ్వరరావు...

అక్కినేని నాగేశ్వరరావు...

అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు తెలుగులో ఎంత క్రేజీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు తెలుగు చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన వారిలో అగ్రస్థానంలో ఉంటారు. అలాంటి లెజెండరీ నటుడైన నాగేశ్వరరావు క్యాన్సర్ తో చాలా సంవత్సరాలు బాధపడ్డారు. ఆయన ఆ వ్యాధితో బాధపడుతున్న సమయంలో కూడా తన కుమారుడు, మనవడితో కలిసి ‘మనం‘ సినిమా కూడా చేశారు. అయితే ఆ సినిమా విడుదలవ్వక ముందే ఆయన పెద్ద ప్రేగు క్యాన్సర్ తో మరణించారు. దీంతో అప్పుడు సినీ లోకమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

ధర్మవరపు సుబ్రమణ్యం..

ధర్మవరపు సుబ్రమణ్యం..

తెలుగు సినిమాల్లో తనదైన కామెడీతో అలరించిన ధర్మవరపు సుబ్రమణ్యం కూడా కాలేయ క్యాన్సర్ తో ఆస్పత్రిలో చాలా రోజులు చికిత్స చేయించుకున్నాడు. ఈయన హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లోని పిఅండ్ టి కాలనీలోని తన నివాసంలో 2013లో మరణించారు.

ఎవి సుబ్రహ్మణ్యం..

ఎవి సుబ్రహ్మణ్యం..

తెలుగులో ఎవిఎస్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం కూడా కాలేయ క్యాన్సర్ తో చాలా రోజులు బాధపడ్డాడు. ఎంతో ప్రతిభావంత నటుడైన ఈయన కూడా హైదరాబాద్ నగరంలో కాలేయ క్యాన్సర్ తో మరణించాడు.

భయంకరమైన వ్యాధులతో పోరాడి విజయం సాధించిన సెలబ్రిటీస్ గురించి మీకు తెలుసా..భయంకరమైన వ్యాధులతో పోరాడి విజయం సాధించిన సెలబ్రిటీస్ గురించి మీకు తెలుసా..

అంజలి..

అంజలి..

90వ శతాబ్దపు నటి అయిన అంజలి అప్పట్లో ఎందరో అగ్రహీరోలతో నటించింది. అప్పటి తరం వారికి అంజలి హావభావాలు అంటే ఎంతో ఇష్టం. పెళ్లి అయిన హీరోయిన్లు తారలుగా ఉండటం కష్టమని ఆరోజుల్లోనే తేల్చి చెప్పింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఈ నటి చెన్నైలో స్థిరపడింది. ఈమె 2014లోనే మరణించారు.

ఇవివి సత్యనారాయణ..

ఇవివి సత్యనారాయణ..

రచయిత, దర్శకుడు, నిర్మాత అయినా ఇవివి సినిమాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. ప్రేక్షకులను రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఏమి కావాలో అన్ని వెండి తెరపై చూపించగల దర్శక ధీరుడు. ఈయన కాకినాడ బీచ్ ఫెస్టివల్ లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్న సమయంలో 2011లో మరణించాడు. ఈయన గొంతు క్యాన్సర్ కు కీమోథెరపీ చికిత్స చేయించుకున్నా.. ఇతర సమస్యల కారణంగా ఆయన తుదిశ్వాస విడిచాడు.

సుమన్..

సుమన్..

ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు రెండో కుమారుడు, ఆర్టిస్ట్ అయిన సుమన్ కూడా 2012లో క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించాడు. ఈయన కొన్ని సీరియళ్లను విజయవంతంగా నడిపాడు.

వరల్డ్ క్యాన్సర్ డే 2016: క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...వరల్డ్ క్యాన్సర్ డే 2016: క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...

రామిరెడ్డి..

రామిరెడ్డి..

రామిరెడ్డి విలన్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. అమ్మోరు సినిమాలో ఈయన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. అయితే ఈయన కూడా హైదరాబాద్ లో 2011 సంవత్సరంలో మరణించాడు.

దాసరి పద్మ..

దాసరి పద్మ..

దాసరి నారాయణ రావు సతీమణి అయిన దాసరి పద్మ కూడా క్యాన్సర్ రోగంతో చాలా రోజులు బాధపడ్డారు. ఆమె క్యాన్సర్ కారణంగా కార్పొరేట్ ఆస్పత్రిలో చాలా రోజులు చికిత్స చేయించుకున్నారు. అయిన ఫలితం లేకపోవడంతో ఈమె 2012లో చెన్నైలో మరణించారు.

వడ్డే రమేష్..

వడ్డే రమేష్..

అప్పటి తరం నిర్మాత వడ్డే రమేష్ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని కిమ్స్ లో 2013 సంవత్సరంలో మరణించారు.

English summary

Telugu Actors Who Died Of Cancer

Here are the telugu actors who died of cancer. Take a look
Story first published:Tuesday, February 4, 2020, 12:43 [IST]
Desktop Bottom Promotion