For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలుమగలపై ఆ గ్రహాల ప్రభావం... ఏడడుగుల బంధానికి దూరం...!

|

భార్యభర్తలు అన్నాక ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో గొడవలు, అలకలు, మనస్పర్దలు రావడం అత్యంత సహజమైన విషయం. అయితే కొంతమంది జంటలు తర్వాత వీటి గురించి ఆలోచించి.. క్షమాపణలు చెప్పుకోవడమో లేదా ఎవరో ఒకరు రాజీ పడటమో జరుగుతుంది.

అలాంటి జంటల మధ్య సంబంధం ఎల్లప్పుడూ సాన్నిహిత్యంగా ఉంటుంది. కానీ మరికొందరు జంటలు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటారు. అంతేకాదు చిన్నపాటి గొడవలకే విడాకుల వరకు విడిపోతూ ఉంటారు.

పెళ్లికి ముందు వరకు ఎంతో ప్రేమగా ఉన్న వారి మధ్య అకస్మాత్తుగా దూరం పెరిగిపోతుంది. అంతేకాదు వారు ఒకేసారి తమ బంధానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఇదంతా కొన్ని గ్రహాల ప్రభావం కారణంగానే జరుగుతుందని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కేవలం నాలుగు గ్రహాల ప్రభావం వల్లే జంటల మధ్య వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని, ఏ గ్రహాల ప్రభావం వల్ల ఆలుమగల బంధానికి చెక్ పడుతుందని.. అందుకు ఎలాంటి పరిహారాలు చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ రాశి ప్రకారం.. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా...

రాహువు ప్రభావం..

రాహువు ప్రభావం..

ప్రేమ వివాహం చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా.. ఇద్దరిలో ఎవరి జాతకంలో అయితే రాహువు బలహీనంగా ఉంటారో... అప్పుడు వారి వైవాహిక జీవితంలో కొంత గందరగోళంగా ఉంటుంది. అందులోనూ వారి జాతకం ప్రకారం, ఐదు, ఏడో స్థానాలు బలహీనంగా ఉంటే ప్రేమ బంధంలో అయినా వివాహ బంధంలో అయినా ఇబ్బందులు తరచుగా వస్తుంటాయి.

శుక్రుడి ప్రభావం..

శుక్రుడి ప్రభావం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శుక్రుడు తెలివితేటలు, జ్ణానం, సంపదలు పెరగడంలో సహాయపడతాడని పండితులు చెబుతుంటారు. అయితే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో.. వారి మనసులో ప్రేమ భావనలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇలాంటి కారణాల వల్ల భార్యభర్తల మధ్య ఏదో ఒక విషయంలో సమస్యలు వస్తు ఉంటాయి. దీంతో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు.

గురుడి ప్రభావం..

గురుడి ప్రభావం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలలో పెద్ద గ్రహం గురుడు. ఎవరి జాతకంలో అయితే ఈ గ్రహం ప్రభావం సానుకూలంగా ఉంటుందో వారికి జీవితంలో అన్ని విషయాల్లో విజయం సులభంగా లభిస్తుంది. అయితే గురు గ్రహం అనుగ్రహం బలహీనంగా ఉంటే ఆలుమగల మధ్య ప్రేమ మరియు ఆప్యాయత తగ్గిపోతాయి. వారి వైవాహిక జీవితంలో చీలికలు ఏర్పడి.. వారు విడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

మిధునంలోకి శుక్రుడి సంచారం.. ఈ 7 రాశులకు ఆర్థిక ప్రయోజనాలు... మీ రాశి కూడా ఉందేమో చూడండి...!

బుధుడి ప్రభావం..

బుధుడి ప్రభావం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ గ్రహ ప్రభావం వల్ల తమ వైవాహిక జీవితం మరింత బలపడుతుందని నమ్ముతారు. అయితే ఎవరి జాతకంలో అయితే బుధుడి ప్రభావం తక్కువగా ఉంటుందో.. వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు భాగస్వాములిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు మోసం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇవి చేయాలి..

ఇవి చేయాలి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నాలుగు గ్రహాల ప్రభావం మీ జాతకంలో పెరగడానికి.. మీరు ఈ సమస్యలను అధిగమించడానికి, కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది.

- శుక్రుడు, బుధుడు, గురుడు మరియు రాహువు శాంతి కోసం ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని అర్పించాలి.

- గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

- శుక్రవారం రోజున మరియు పౌర్ణమి రోజులలో దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేయాలి.

- జ్యోతిష్య నిపుణుల సలహాతో పచ్చ రంగులో లేదా పుష్పరాగము ఉంగరాన్ని ధరించాలి.

ఇలా చేస్తే మీ జాతకంలో ఈ నాలుగు గ్రహాల అనుగ్రహం లభించడమే కాదు.. మీ వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

English summary

The Effect of Those Planets on the Couple Relationship Divorce or Breakup

Here are the effect of those planets on the couple relationship divorce or breakup. Have a look
Story first published:Friday, May 28, 2021, 10:00 [IST]
Desktop Bottom Promotion