For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శునకాలపై ఉన్న ప్రేమతో బంపరాఫర్ కొట్టేసిన యువకుడు.. ఏకంగా రతన్ టాటాకు అసిస్టెంట్ గా మారాడు..

రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, డ్రైవర్లకు దూరం నుండే కుక్కలు కనిపించేలా వాటి మెడలో వేసేందుకు రిఫ్లెక్ట్ బెల్టులను తయారు చేశాడు.

|

శునకాలపై ప్రేమ ఉంటే ఉద్యోగం సులభంగా వచ్చేస్తుందా? అది కూడా మన దేశంలోని టాప్ కంపెనీలలో దొరుకుతుందా? ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే. ముంబైకి చెందిన 27 ఏళ్ల కుర్రాడికి శునకాలపై ఉన్న ప్రేమ కారణంగా టాటా సంస్థలో బంపరాఫర్ వచ్చేసింది.

అది కూాడా ఆ యువకుడు నేరుగా టాటా సంస్థల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు అసిస్టెంటుగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' అనే గ్రూపులో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ పోస్టు తెగ వైరల్ అయ్యింది. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

2014లో రతన్ టాటాను కలిశాను..

2014లో రతన్ టాటాను కలిశాను..

ముంబైకి చెందిన శంతను నాయుడు 2014లో తొలిసారి రతన్ టాటాను కలిశానని, తన జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటనలను గురించి, తాను రతన్ టాటాతో అంత గౌరవనీయమైన స్థానాన్ని ఎలా సంపాదించాడో ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే‘ ఫేస్ బుక్ లో వివరంగా రాసుకొచ్చాడు. అందులో ఏముందంటే..

PC : FB

ఐదేళ్ల క్రితమే..

ఐదేళ్ల క్రితమే..

2014లో రోడ్డుపై ఓ వాహనం వెళ్తుండగా వీధి కుక్కను ఢీ కొట్టింది. అది చూసి చలించిపోయిన శంతను అందుకు పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఇకపై ఎలాంటి కుక్కలు రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదని ఆలోచించాడు.

PC : FB

టాటా గ్రూపులో..

టాటా గ్రూపులో..

ఈ ఆలోచన కాస్త బాగా వ్యాపించింది. ఇది ఏకంగా టాటా గ్రూప్ ఆఫ్ న్యూస్ లెటర్ లోకి చేరింది. ‘‘సరిగ్గా అదే సమయంలో తన తండ్రి రతన్ టాటాకు లేఖ రాయమని సూచించాడు. ఎందుకంటే రతన్ టాటాకు కుక్కలంటే అమితమైన ప్రేమ అని చెప్పాడు. తొలుత లేఖ రాసేందుకు సంశయించిన శంతను ధైర్యం చేసి టాటాకు లెటర్ రాశాడు. అంతే అదే తన జీవితాన్ని మలుపు తిప్పేసింది.

PC : FB

రిఫ్లెక్ట్ బెల్టు...

రిఫ్లెక్ట్ బెల్టు...

రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, డ్రైవర్లకు దూరం నుండే కుక్కలు కనిపించేలా వాటి మెడలో వేసేందుకు రిఫ్లెక్ట్ బెల్టులను తయారు చేశాడు. దీని వల్ల దూరం నుంచే వాహనాలు నడిపే డ్రైవర్లు రోడ్లపై కుక్కలను గుర్తించగలుగుతారని శంతను చెప్పాడు.

PC : FB

రెండు నెలల తర్వాత..

రెండు నెలల తర్వాత..

రతన్ టాటా దగ్గర సమాధానం ఇలా వచ్చింది. ‘రెండు నెలల తర్వాత నన్ను కలవాలని అనుకుంటున్నట్టు రతన్ టాటా దగ్గర నుండి సమాధానం వచ్చింది. నేను అది నమ్మలేకపోయాను.. ఆ తర్వాత ముంబైలోని టాటా కార్యాలయంలో ఆయనను కలిశాను. నేను చేసిన పని ఆయనకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. ఆ తర్వాత నేను నా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాను.

భారత్ కు తిరిగొచ్చాక...

భారత్ కు తిరిగొచ్చాక...

PC : FB

‘అప్పటికే నేను నా చదువు పూర్తయ్యాక నా జీవితాన్ని టాటా ట్రస్టుకు అంకితం చేస్తానని చెప్పాను. నేను భారత్ వచ్చాక ఆయన కాల్ చేశారు. ఇక్కడ చేయాల్సింది చాలా ఉందని నన్ను సాదరంగా ఆహ్వానించారు. అప్పుడే నువ్వు నా అసిస్టెంటుగా ఉంటావా? అని అడిగారు. కొద్దొ క్షణాలు ఏమి చెప్పాలో నాకు అర్థం కాలేదు. వెంటనే ఓకే అని చెప్పేశాను‘ అని శంతను నాయుడు తన ఫేస్ బుక్ పోస్టులో వివరించారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ప్రత్యేకమైన, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి. అలాగే మీ సలహాలను, సూచనలను మాకు తెలియజేయండి.

English summary

The love of dogs has made a young man Ratan Tata's assistant

Here we talking about the love of dogs has made a young man ratan tata's assistant. Read on
Desktop Bottom Promotion