For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది

తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ ప్లాంట్ లాంటి కొన్ని మొక్కలతో పాటు కొన్ని రకాల పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పూల మొక్కలు పెంచితే వాస్తు దోషాలు

|

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం, పూల మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇళ్లంతా పచ్చగా కనిపిస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఇళ్లైనా, ఆఫీస్ అయినా మొక్కలు కనిపిస్తే అందంగా కనిపిస్తుంది. పచ్చదనం కంటికి ఆహ్లాదకరంగా అనిపించడంతో పాటు మనసుకు హాయిగా అనిపిస్తాయి. జ్యోతిష్య ప్రకారం కూడా కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం మంచిది. కొన్ని మొక్కలు ఇంటికి అలంకరణతో పాటు జ్యోతిష్య ప్రయోజనాలను చేకూరుస్తాయి.

These flowers can remove vastu doshas in the house in Telugu

తులసి, మనీ ప్లాంట్, లక్కీ బాంబూ ప్లాంట్ లాంటి కొన్ని మొక్కలతో పాటు కొన్ని రకాల పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పూల మొక్కలు పెంచితే వాస్తు దోషాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుందివాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుంది

మల్లె:

మల్లె:

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మల్లె మొక్కలు నాటుకోవచ్చు. ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో మల్లె పెంచడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటి సభ్యుల మధ్య కలహాలు తగ్గుముఖం పడతాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మల్లె వాసన చాలా మధురంగా ఉంటుంది. ఈ మత్తైన వాసన మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. దీని వల్ల కోపం కూడా తగ్గుతుంది.

పావురం ఇంట్లో గూడు పెడితే శుభమా..? అశుభమా..?పావురం ఇంట్లో గూడు పెడితే శుభమా..? అశుభమా..?

సంపంగి:

సంపంగి:

హిందూమతం ప్రకారం సంపంగికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సంపంగిని పవిత్రమైన పువ్వుగా పరిగణిస్తారు. పూజలో సంపంగి పువ్వులను ఉపయోగించాలని చెబుతుంటారు. సంపంగి పువ్వు వాసన మధురంగా ఉంటుంది. ఇది మైండ్ ను రిఫ్రెష్ చేస్తుంది. దాంతో పాటు సంపంగి పూల వాసన వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కూడా పని చేస్తుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారువాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు

గులాబీ:

గులాబీ:

ముళ్లు ఉన్న మొక్కలు ఇంట్లో నాటకూడదని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. అయితే వీటికి గులాబీ మొక్క మినహాయింపు. ఇంట్లో గులాబీ మొక్కలు నాటడం జ్యోతిష ప్రకారం మేలు చేస్తుంది. గులాబీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. వాస్తు దోషాలు తొలగిపోతాయి. గులాబీ పూలను చూస్తే మనస్సుకు ఆహ్లాదంగా అనిపిస్తుంది. పచ్చని చెట్టుకు ఎరుపు రంగులో కనిపించే పూలు ఎంతో అందంగా ఉంటాయి.

ఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయిఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి

పారిజాతం:

పారిజాతం:

వాస్తు ప్రకారం ఇంట్లో పారిజాతం పెంచుకుంటే మంచి జరుగుతుంది. ఇంటి సభ్యుల మధ్య కలహాలు దూరమవుతాయి. పారిజాతం చెట్లను ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం కూడా పారిజాతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, పాల సముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం తీసుకొచ్చినట్లు చాలా మంది నమ్ముతారు.

ఈ చెట్టు వయసు సుమారు 1000 నుండి 5000 సంవత్సరాల వరకు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. ఈ చెట్టుకు ఉండే మరో విశేషం ఏంటంటే.. దీని ఆకులు గానీ, కొమ్మలు గానీ ఎప్పటికీ ఎండిపోయి రాలవు. ఇవి ఎప్పటికీ చాలా బలంగా ఉంటాయి. పురాణాల్లోనూ పారిజాతంకు ప్రత్యేక స్థానం ఉంది.

రోడ్డుపై డబ్బు దొరికితే అదృష్టమా..? దురదృష్టమా..?రోడ్డుపై డబ్బు దొరికితే అదృష్టమా..? దురదృష్టమా..?

English summary

These flowers can remove vastu doshas in the house in Telugu

read this to know These flowers can remove vastu doshas in the house in Telugu
Desktop Bottom Promotion