For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఉన్న ఈ చెడు అలవాట్లే..ఎంత ధనవంతులైనా..బిచ్చగాడిగా మార్చేస్తుంది జాగ్రత్త!వెంటనే మానుకోండి

|

మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అది మంచి కావచ్చు లేదా చెడు కావచ్చు. మన ప్రతి అలవాటు మరియు ప్రవర్తన ప్రతి గ్రహంతో ముడిపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి యొక్క చెడు అలవాట్లు అతని జీవితంలో సంతోషాన్ని మరియు శాంతిని దూరం చేస్తాయి. కాబట్టి మీరు చేసే ప్రతి ప్రవర్తన మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తికి ఏదైనా చెడు జరిగినప్పుడు వారు తమ అదృష్టాన్ని నిందిస్తారు. కానీ ఈ చెడు సంఘటనలన్నింటి వెనుక వారికి యొక్క ప్రవర్తన మరియు అలవాట్లు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరిగ్గా ప్రవర్తించకుంటే లేదా అలవాట్లు చెడుగా ఉంటే, ఫలితంగా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని పేదరికం వైపు వెళ్లాల్సి రావచ్చు.

ఇది కాకుండా, కొన్ని అలవాట్లు సంపదకు అధిపతి అయిన లక్ష్మీ దేవి యొక్క ఆగ్రహానికి గురవుతాయి మరియు ఫలితంగా జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ అభ్యాసాలను పాటించడం చాలా ముఖ్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే పేదరికంలో కూరుకుపోవచ్చు. మనిషిని పేదవాడిని చేసే ఈ చెడు అలవాట్లు ఏమిటో, ప్రతి వ్యక్తి శ్రద్ద వహించాల్సిన ఈ విషయాలేంటో ఇక్కడ చూద్దాం.

మంచం మీద తినడం

మంచం మీద తినడం

మీరు మంచం మీద ఏదైనా తింటున్నారా? అలా అయితే, వెంటనే ఈ అలవాటును మానేయండి. ఎందుకంటే మంచం మీద కూర్చొని భోజనం చేయడం వాస్తు శాస్త్రంలో నిషిద్ధం. ఈ రకమైన అలవాటు ఇంట్లో ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇంకా కుటుంబంలో సంతోషం మరియు శాంతిని ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో ఏదో ఒక రకంగా డబ్బు వ్రుదా అవుతూ పేదరికం కూడా ప్రబలుతుంది.

సూర్యాస్తమయం తర్వాత అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం

సూర్యాస్తమయం తర్వాత అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఇలా చేస్తే అప్పుల భారం పెరిగిపోతుంది. ఇలా చేస్తే ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం తగ్గడం మొదలవుతుంది. ప్రధానంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది.

పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేయకపోడం

పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేయకపోడం

ఇంట్లో వంటగదిని పూజగదితో సమానం అంటారు. వంటగది, ఇల్లాలు శుభ్రంగా ఉంటే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారంటారు. ఇంటి వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధానంగా రాత్రి పడుకునే ముందు వంటగదిలో గిన్నెలు కడుక్కోవాలి, వంటగదిని శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. జోతిష్య శాస్త్రం ప్రకారం వంటగది అపరిశుభ్రంగా ఉంటే పేదరికానికి కారణం. బహుశా అపరిశుభ్రంగా ఉంచినట్లయితే,జేబులో డబ్బు నిలవదు. ఫలితంగా అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి.అలాగే ఇల్లు నెగెటివ్ ఎనర్జీతో నిండిపోయి వాస్తు లోపం ఉన్న ఇల్లుగా కనిపిస్తుంది.

రాత్రి బట్టలు ఉతకడం

రాత్రి బట్టలు ఉతకడం

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడం మంచిది కాదు. రాత్రిపూట బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో ప్రతికూల శక్తులు ఎక్కువగా సంచరిస్తాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యానికి గురవుతారు. రాత్రిపూట బట్టలు ఆరుబయట ఆరబెట్టినట్లయితే, ప్రతికూల శక్తులు బట్టలకు వ్యాప్తి చేస్తాయి. అలాంటప్పుడు ఆ బట్టలు వేసుకున్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ చుట్టుముట్టి ఏ విషయంలోనూ విజయం సాధించకుండా అపజయాన్ని ఎదుర్కొంటారు.

రాత్రి సమయంలో ఇల్లు ఊడవడం

రాత్రి సమయంలో ఇల్లు ఊడవడం

రాత్రిపూట ఇంట్లో చీపురు పట్టి కసువు ఊడ్చటం . మీరు చాలా మందిని చూసుంటారు. రాత్రుల్లో ఇల్లు ఊడవడం. కానీ వాస్తు ప్రకారం చీపురులో లక్ష్మీదేవి నివాసముంటుంది. ఇలాంటప్పుడు రాత్రిపూట ఇంటిని ఊడ్చితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, వాస్తు దేవుళ్లకు కూడా కోపం వస్తుంది. కాబట్టి మళ్లీ ఈ తప్పు చేయవద్దు. లేకుంటే ఇంట్లోనే పేదరికం మొదలవుతుంది.

గోళ్ళు కొరికే అలవాటు:

గోళ్ళు కొరికే అలవాటు:

పనిపాట లేకుండా ఊరికనే కూర్చొని గోళ్ళు కొరుకుతుంటారు కొంతమంది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో సూర్యగ్రహం బలహీనపడుతుందని నమ్ముతారు. అలా బలహీనపడినప్పుడు ఆ వ్యక్తి యొక్క గౌరవం, ఆరోగ్యం మరియు పని పై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

సోఫా, కుర్చీలు, మంచాలపై కూర్చొని కాళ్ళు ఊపడం లేదా కాళ్ళు ఊడ్చికుంటూ నడవడం

సోఫా, కుర్చీలు, మంచాలపై కూర్చొని కాళ్ళు ఊపడం లేదా కాళ్ళు ఊడ్చికుంటూ నడవడం

నడిచేటప్పుడు కొంత మంది పాదాలను ఈడ్చుకుంటూ నడవడం చేస్తుంటారు. అలాగే సోఫా, కుర్చీలు, మంచాలపై కూర్చొని కాళ్ళు ఊపడం చేస్తుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అలవాటు చాలా తప్పు అని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల వ్యక్తి వైవాహిక జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది మరియు శత్రుత్వం కూడా పెరుగుతుంది.

పాదరక్షలు చెల్లాచెదురుగా వదలడం

పాదరక్షలు చెల్లాచెదురుగా వదలడం

ఇంటి బయట మీ పాదరక్షలు చెల్లా చెదురుగా ఉన్నా మిమ్మల్ని పేదరికంలోకి నెట్టాస్తాయి. ఈ అలవాటు వల్ల చెడు ప్రభావంతో దురదృష్టం వైపు నెట్టుతాయి. అలాగే వారు చేసే ప్రతి పనిలోనూ అపజయం ఉంటుంది.

పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం చేస్తే

పరిశుభ్రత పట్ల నిర్లక్ష్యం చేస్తే

జోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టం. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు. అలా కాకుండా అపరిశుభ్రంగా ఉంటే ఇంట్లో వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు తమ పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద వహించాలని గుర్తుంచుకోవాలి.

English summary

These habits make you poor according to astrology in telugu

In this article, we shared about some habits that make you poor according to astrology. Read on to know more...
Story first published:Tuesday, January 24, 2023, 15:54 [IST]
Desktop Bottom Promotion