For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఏడు రాశుల వారు ప్రేమలో చాలా అదృష్టవంతులవుతారట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

|

కళ్యాణం... కమనీయం.. అనేది మధురమైన ఘట్టం.. అయితే అంతకుమించిన ఆనందం ఒక్క ప్రేమలోనే దక్కుతుంది అంటారు ప్రేమికులు. అయితే ప్రేమలో పడేందుకు యువత ఎంతగానో కష్టపడతారు. ముఖ్యంగా జంటల మధ్య పవిత్రమైన బంధాన్ని కొనసాగించేందుకు నానా తంటాలు పడతారు.

ఇలా ఏవేవో సందేహాలు.. సమస్యల వంటివి ప్రేమ విషయంలో తలెత్తితే.. చాలా మంది తమను ఈ కష్టాల నుండి గట్టెక్కించమని కోరతారు. చాలా మంది వారి రాశి చక్రాలను బట్టి నక్షత్రాలను ఫాలో అవుతుంటారు.

ఈ సందర్భంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏమి చెబుతుందంటే.. ఈ ఏడాది ఏడు రాశి చక్రాల వారు సూర్య సంకేతాల వల్ల ఎలాంటి శ్రమ లేకుండా ప్రేమలో పడిపోతారట. అయితే వీరికి ప్రేమ పరంగా అదృష్టం కలసి వస్తుందా లేదా తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

వాలెంటైన్స్ డే స్పెషల్ : వీరి ప్రేమ కథలు వింటే... ప్రేమకు హద్దులే లేవనిపిస్తుంది...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ ప్రపంచంలో నాటకీయ వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు. వారి భావోద్వేగ ప్రవర్తనను బాగా గుర్తిస్తారు. వారు తమ భాగస్వామి యొక్క చిన్న చిన్న విషయాలను ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారిలో చాలా మంది ప్రేమికులు వారి భాగస్వాములకు చాలా రక్షణగా ఉంటారు. మీరు ఈ రాశి వారిలో రిలేషన్ షిప్ లో ఉంటే.. తదుపరి ఘట్టానికి సిద్ధంగా ఉండండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సంబంధం విషయంలో చాలా నిబద్ధతగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వీరు ఎక్కువగా నాయకత్వం వహించడానికి ఇష్టపడతారు. వీరు భాగస్వాముల చేత నడిపించడం అనేది చాలా సహజంగా వస్తుంది. వీరు సరైన వారిని కనుగొన్నప్పుడు వీరు ఉదారంగా ప్రేమిస్తారు. తమ ప్రేమ గురించి బాధపడే ఏదైనా చర్చ జరిగేటప్పుడు చాలా నిరాడంబరంగా ఉంటారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు. అయితే సంబంధం విషయంలో చాలా దయగా ఉంటారు. అయితే లోతుగా ఆలోచిస్తారు. వీరు గొప్ప సహజసిద్ధమైన శక్తులతో ఆశీర్వదించబడి ఉంటారు. కాబట్టి వీరిని తప్పుదారి పట్టించడం అసాధ్యం. అయితే వీరు నిస్వ్సార్థ ప్రేమ ఆధారంగా రిలేషన్ షిప్ లో పూర్తిగా మునిగిపోతారు.

ఎంత గొడవ పడితే.. అంత ప్రేమంట...! అప్పుడే ఆ బంధం గట్టిగా బలపడుతుందట...!

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో ‘చావో లేదా రేవో‘ అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు వారి నిజమైన ప్రేమ సొంత ఖర్చులతోనే వస్తుందని నమ్ముతారు. ఈ రాశి చక్రం వారు ప్రేమ భాషలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు. అంతే కాదు తమ ప్రేమికులతో చాలా సన్నిహితంగా ఉంటారు. భావోద్వేగ పెరుగుదలకు వీరు చాలా ఎక్కువ విలువ ఇస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ప్రేమ విషయంలో సాహసోపేతంగా ఉంటారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే.. వారి సంబంధంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. అయితే వీరి స్వేచ్ఛ భావం కారణంగా, వీరు ప్రేమలో స్థిరపడటం అనేది చాలా కష్టం. ధనస్సు రాశి వారు ప్రేమలో పడితే ఆ సంబంధాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు తమదైన శైలిలో పనులు చేసుకోవటానికి ఇష్టపడతారు. ఒక సాధారణ సంబంధం కోసం ఎవరనైనా ఎంపిక చేసుకుంటే వారి పట్ల అంకిత భావంతో గడుపుతారు. వీనస్ గ్రహ ప్రభావం వల్ల వీరు ప్రేమలో పడాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి రొమాన్స్ వంటి ప్రయాణం కూడా మొదలవుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు స్థిరమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన వారు. కన్యరాశి యొక్క వ్యతిరేక లింగానికి చెందిన ప్రజలను వీరు చాలా సులభంగా మరియు సహజంగా ఆకర్షిస్తారు. మీరు వారికి తగినంత గౌరవం, విలువ ఇస్తే చాలు మీరు ఉత్తమ భాగస్వామి అని మీరు నిరూపించుకోవచ్చు. కన్య రాశి వారితో మీ జీవితం పంచుకునేటప్పుడు మీరు మీ హావభావాలన్నింటినీ తెలియజేయాలి.

English summary

These Zodiac sign people are most active in love

Here are the zodiac sign people are most active in love. Take a look
Story first published: Thursday, February 13, 2020, 16:37 [IST]