For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali 2021:దీపావళి వేళ ఈ రాశుల వారు డబ్బు కోల్పోతారట... తస్మాత్ జాగ్రత్త...!

|

మనం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న దీపావళి మరి కొద్ది గంటల్లో రానుంది. అంటే 2021 నవంబర్ నాలుగో తేదీన గురువారం నాడు వచ్చేస్తోంది. హిందూ పంచాగం ప్రకారం అశ్వీయుజ మాసంలోని బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇదిలా ఉండగా..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. దీపావళి పండుగ సందర్భంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయట. ఈ సమయంలో నాలుగు గ్రహాలు కలయిక ఒకే రాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారు డబ్బును కోల్పేయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. ఈ సందర్భంగా దీపావళి వేళ ఆర్థిక పరంగా నష్టపోయే రాశిచక్రాల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి...

Diwali 2021 : దీపావళి నుంచి ఈ రాశుల జీవితాల్లో సంతోషం వెలిగిపోతుందట...!

దీపావళి వేళ గ్రహాల స్థానాలు..

దీపావళి వేళ గ్రహాల స్థానాలు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి వంటి పవిత్రమైన రోజున తులా రాశిలో నాలుగు గ్రహాలు నివాసం ఉంటాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, చంద్రుడు ఇక్కడే సంచారం చేస్తుంటారు. బుధుడు నిన్ననే అంటే నవంబర్ రెండో తేదీన కన్య రాశి నుండి నిష్క్రమించి తులరాశిలోకి ప్రవేశించాడు. దీంతో పాటు శని గ్రహం మరియు గురువు మకరరాశిలో రవాణా చేయనున్నారు. అదనంగా మీన రాశిలోకి రాహువు, వృశ్చిక రాశిలోకి కేతువు మరియు ధనస్సు రాశిలోకి శుక్రుడు సంచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా నష్టం వాటిల్లొచ్చు. ఆరాశులేవో చూసెద్దాం రండి.

వృషభ రాశి..

వృషభ రాశి..

మీన రాశిలోకి రాహువు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. సాధారణంగా రాహువును చెడు పనులకు ప్రేరేపించేవారిగా పరిగణిస్తారు. కాబట్టి మీరు ఈ కాలంలో చాలా జాగ్రతత్గా ఉండాలి. తప్పుడు వ్యక్తులకు, తప్పులకు దూరంగా ఉండండి. లేకపోతే, మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

మిధున రాశి

మిధున రాశి

ఈ రాశి వారికి దీపావళి వేళ శని గ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. అలాగే ఈరోజు ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండాలి. లేదంటే వీటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ధనం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

దివాళి మరియు దీపావళి మధ్య గల తేడాలేంటి? ఈ పండుగ విశిష్టతలేంటో తెలుసుకుందామా...

తులా రాశి..

తులా రాశి..

దీపావళి వంటి పండుగ సమయంలో ఈ రాశి వారిపైనా శని గ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీపావళి రోజున ఒత్తిడిని నివారించేందుకు ప్రయత్నించండి. మీరు ఈ రోజున ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, జీవిత భాగస్వామి మరియు విద్యావంతుల సలహా తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఈ రాశి వారు దీపావళి రోజున గందరగోళం మరియు ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. త్వరగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో మీరు ఎక్కువగా నష్టపోవచ్చు. అలాగే ఈరోజు మీరు ఎలాంటి చెడు పనులు చేయకుండా ఉండాలి. ప్రధానంగా మద్యం మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో పడి మీరు కోలుకోలేకపోవచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు శని మరియు గురువులతో సంబంధం కలిగి ఉంటారు. శని దేవుడిని ధర్మాత్ముడు అని కూడా అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అహం మరియు వాదన వంటి సమస్యలను సృష్టించొద్దు. ఈరోజు పేదలకు సహాయం చేయండి. శని భగవానునికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తద్వారా ప్రయోజనాలు లభిస్తాయి. ఏ కారణం చేతనైనా ఈ రోజుల్లో తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలని ప్రయత్నించకండి.

హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?

హిందూ పంచాగం ప్రకారం అశ్వీయుజ మాసంలోని బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అంటే 2021 నవంబర్ నాలుగో తేదీన గురువారం నాడు ఘనంగా ప్రారంభమవుతుంది.

English summary

These Zodiac Signs May Suffer Financial Loss on Diwali in Telugu

According to the Panchang, the festival of Diwali will be celebrated on Thursday, 4 November 2021. On this day some zodiac signs may have to suffer loss in terms of money.