For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు

ఈ వాలెంటైన్స్ డే రోజు మీరు తెలియకుండా కూడా ఈ తప్పులు చేయొద్దు. మీకు తెలియకుండా, ప్రేమికుల రోజు నాడు మీరు చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాలెంటైన్స్ డే.. ఈ ప్రేమికుల రోజు కోసం ఎదురుచూసే ప్రేమ పక్షులు ఎన్నో. ఎందుకంటే ఇది వారి ముఖ్యమైన, ప్రియమైన వారి పట్ల ఆప్యాయతను చూపించేందుకు అవకాశం కల్పించే రోజు. ప్రేమను వ్యక్తం చేసే ఈ రోజు చాలా మంది తెలిసో తెలియకనో కొన్ని తప్పులు చేస్తుంటారు. వారికి ఏమాత్రం అవగాహన లేకుండా ఈ ప్రత్యేక సందర్భాన్ని నాశనం చేస్తారు. ఈ వాలెంటైన్స్ డే రోజు మీరు తెలియకుండా కూడా ఈ తప్పులు చేయొద్దు. మీకు తెలియకుండా, ప్రేమికుల రోజు నాడు మీరు చేసే ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Things not to do on valentines day 2023 in Telugu

ఆ రోజును మర్చిపోవడం:

చాలా మంది చేసే అతి పెద్ద తప్పు ఇది. కొందరికి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు గుర్తుండవు. ముఖ్యంగా పురుషుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది. మీ లవర్ మీరేదో పొడిచేస్తారని ఎదురు చూస్తుంటుంది. కానీ మీకసలు ఆ రోజే గుర్తుండదు. మీరింక గిఫ్ట్స్ ఏమిస్తారు, సర్‌ప్రైజ్‌లు ఏం ప్లాన్ చేస్తారు. అందుకే మీ ఫోన్‌లో కనీసం ఒక రోజు ముందే రిమైండర్ సెట్ చేసి పెట్టుకోండి. వాలెంటైన్స్ డే రోజు ఏదైనా చేయాలని ఇప్పుడే ఆలోచించండి. సర్‌ప్రైజ్‌గా ఏదైనా ఇవ్వండి.

Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..Valentines Day 2023: ఈ దేశాల్లో ప్రేమికుల రోజు వేడుకలు కాస్త డిఫరెంట్, వావ్ అనాల్సిందే..

వాయిదా వేయడం:

వాయిదా వేయడం:

వాలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14 కదా.. ఇంకా చాలా రోజుల టైం ఉంది. ఏం గిఫ్ట్ ఇవ్వాలో తర్వాత ఆలోచించొచ్చు లేదంటే గిఫ్ట్ తర్వాత తీసుకోవచ్చు అని చాలా మంది వాయిదా వేస్తూ వస్తుంటారు. ఇక రేపే వాలెంటైన్స్ డే అనే వరకు వాయిదా వేస్తూ వచ్చి ఆఖరి రోజు ఏదీ సరిగ్గా కుదరక మిన్నకుండిపోతారు. ఇది చాలా మందిలో చూసే సమస్యే. ఈ ధోరణి వల్ల కేవలం మీరే కాదు, మీ ప్రియమైన వారు కూడా నిరాశకు, అసంతృప్తికి గురవుతారు. కాబట్టి త్వరపడటం ముఖ్యం.

Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్Valentines Day Destinations 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవడానికి ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్

పిసినారిగా ఉండొద్దు:

పిసినారిగా ఉండొద్దు:

వాలెంటైన్స్ డే రోజు హాయిగా ఇద్దరూ కలిసి సంతోషంగా గడపాల్సిన సమయం. ఇలాంటి ఆనంద సమయంలో మీరు పిసినారిగా వ్యవహరించొద్దు. అనవసరమైన ఖర్చులు చేయడం మంచిది కాదు నిజమే.. కానీ ఈ ఒక్కరోజు చూసీ చూడనట్లుగా ఉండండి. అలాగే చౌకగా దొరికే బహుమతులు ఇస్తే సరిపోతుందని కూడా అస్సలే అనుకోవద్దు. ప్రియమైన వారికి ఇస్తున్నారంటే దానికంటూ ఓ వాల్యూ ఉండాలి.

Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..

ఎదుటివారి ఇష్టాలను విస్మరించొద్దు:

ఎదుటివారి ఇష్టాలను విస్మరించొద్దు:

వాలెంటైన్స్ డే రోజు లవర్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటారు. బహుమతులు ఎన్నుకునేటప్పుడు మీ భాగస్వామి ఆసక్తులు, ఇష్టాలు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ఇక్కడ విలువ ఏమాత్రం ముఖ్యం కాదని గుర్తుంచుకోవాలి.

వారి భావాలను విస్మరించొద్దు:

వారి భావాలను విస్మరించొద్దు:

వాలెంటైన్స్ డే అంటే ప్రేమ, ఆప్యాయత చూపడం. అయితే ఇది మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం మరియు సున్నితంగా ఉండటం. వారి అవసరాలను విస్మరించవద్దు. వారు ఏమనుకుంటున్నారో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

ఇతరులతో పోలిక వద్దు:

ఇతరులతో పోలిక వద్దు:

మీ సంబంధాన్ని ఇతరులతో పోల్చడం సహజం. కానీ ప్రేమికుల రోజున ఇతరులతో పోల్చడం కంటే మీ ముఖ్యమైన వ్యక్తితో మీకు ఉన్న ప్రేమ మరియు అనుబంధాన్ని దృష్టి పెట్టడం ఉత్తమం.

English summary

Things not to do on valentine's day 2023 in Telugu

read this to know Things not to do on valentine's day 2023 in Telugu
Story first published:Sunday, February 5, 2023, 10:10 [IST]
Desktop Bottom Promotion