For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు పెద్దమనిషి అయినట్టే...!

మీరు అధికారికంగా పెద్ద మనిషి అయ్యారని ఎప్పుడు తెలుస్తుందో చూడండి.

|

మామూలుగా 'నువ్వు పెద్దమనిషి అయ్యావు' అంటే చాలా మంది ఇది ఆడవారికి మాత్రమే వర్తిస్తుందని... అందులోనూ అమ్మాయిలు పుష్పావతిగా మారింటారని అనుకుంటారు. అయితే నిజంగా పెద్దమనిషి అంటే అది కాదు అర్థం...

Things That Prove You’re Officially An Adult

ఆడవారిలో సహజంగా జరిగే ప్రక్రియ అది. కేవలం వారి శరీరంలో మాత్రం కొంత మార్పు జరుగుతుంది అంతే కానీ... నిజంగా వారు పెద్దమనిషి అయినట్టు కాదు. మరి పెద్దమనిషి అని ఎవరిని అంటారంటే.. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి, ఓ వైపు జాబ్ కోసం..

Things That Prove You’re Officially An Adult

మరోవైపు లవ్, బ్రేకప్, ప్యాకప్ వంటివి చేస్తుంటారో.. వారంతా పెద్దమనుషులైనట్టే లెక్క. అయితే ఆ విషయాన్ని మనం గుర్తించలేం. అయితే ఇలాంటివి మనకు తెలియకుండానే మనపై చాలా ప్రభావం చూపుతుంది. అంతేకాదు మనలో చాలా మార్పులను తీసుకొస్తుంది.

Things That Prove You’re Officially An Adult

అయితే ఇంతకీ ఆ మార్పులేంటి... వాటిని ఎలా గుర్తించాలనుకుంటున్నారా? అవి చెప్పడానికి మేం రెఢీగా ఉన్నాం.. ఇంకెందుకు ఆలస్యం ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నట్లయితే.. మీరు పెద్దమనిషి అయినట్టేనని ఫిక్స్ అయిపోండి. వాస్తవానికి వీటిలో కొన్ని మీలో కచ్చితంగా ఉండొచ్చు...

మనువాడదామంటే మగువ దొరకట్లేదు... పెళ్లి కాని ప్రసాదులతో బాధపడుతున్న దేశాలు...!మనువాడదామంటే మగువ దొరకట్లేదు... పెళ్లి కాని ప్రసాదులతో బాధపడుతున్న దేశాలు...!

ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే...

ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటే...

మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.. మీ చిన్నతనంలో కాసేపు ఇంట్లో ఉండాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా? ఫ్రెండ్స్ తో ఎప్పుడెప్పుడు ఆటలాడుకుందామా? అని ఆత్రుతగా ఎదురుచూసే వాళ్లం కదా...! కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఇంట్లో నుండి బయటకు వెళ్దామంటేనే ఏదోలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే హాయిగా కాలు మీదు కాలు వేసుకుని ఏ నెట్ ఫ్లిక్స్ లోనో లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో ఏవో సినిమాలను లేదా ఐపిఎల్ మ్యాచులను చూడాలనిపిస్తుంది. అదే చిన్నగున్నప్పుడు ఒక్కరోజు సెలవొచ్చినా చాలు.. ఎక్కడికైనా వెళ్లాలని.. ఫ్రెండ్స్ తో సరదాగా ఆడుకోవాలని అనిపించేది. కానీ ఇప్పుడు తేడా తెలుస్తోంది కదా..

ఒంటరిగా ట్రావెల్ చేసేందుకు..

ఒంటరిగా ట్రావెల్ చేసేందుకు..

టూరిస్టు ప్లేసులకు.. వాటర్ ఫాల్స్, ఆధ్యాత్మిక కేంద్రాలకే కాదు ఎక్కడికైనా మనం ఫ్రెండ్స్ లేదా కుటుంబసభ్యులతో కలిసి వెళ్తుంటాం. అయితే పాతికేళ్లు దాటిన తర్వాత స్నేహితులు లేదా కుటుంబంతో కలిసి వెళ్లడం కంటే ఒంటరిగా ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడుతుంటాం. పైగా ఏదో ఒక జాబ్ చేయడమో.. లేదా జాబ్ సర్చింగులో ఉండటమో చేస్తుంటాం. అంతే కాదు టూర్ ప్లాన్ చేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. అంతేకాదండోయ్ ఒంటరిగా ట్రావెల్ చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ఇలా చేయడం వల్ల మీ గురించి మీరు బాగా తెలుసుకోగలుగుతారు.

వాటిలో సంతోషం ఉందని గుర్తిస్తే..

వాటిలో సంతోషం ఉందని గుర్తిస్తే..

మనకు టీనేజీ వచ్చినప్పుడు లేదా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి పబ్ లకు వెళ్లడం.. అక్కడ ఎంజాయ్ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. స్వర్గమంతా అక్కడే ఉందా అనిపిస్తుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ.. ముఖ్యంగా ప్రస్తుత కరోనా మహమ్మారి కాలంలో పబ్, క్లబ్ వంటి వాటికి వెళ్లడానికి మనకు అంతగా ఆసక్తిగా అనిపించదు. దీనికి బదులుగా ఇంట్లో వారితో కలిసి భోజనం చేయడం.. కుటుంబసభ్యులతో రాత్రంతా మేలుకొని కబుర్లు చెప్పుకోవడం మొదలుపెడతారు. దీంట్లోనే సంతోషం ఉందని గుర్తిస్తారు. మీలో ఈ మార్పు వచ్చిందంటే.. మీరు పెద్ద మనిషి అయినట్టే లెక్క.

ఇంట్లోకి అవసరమైనవి..

ఇంట్లోకి అవసరమైనవి..

మీ ఇంట్లోకి అవసరమైన వస్తువులను కొనడం.. ముఖ్యంగా ఫర్నీచర్ వంటి వాటితో పాటు ఇతర వస్తువులను కొనుగోలు చేయడంలో మీరు మీ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తే మీరు మానసికంగా ఎదిగినట్లే సుమీ.

కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ : 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...!కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ : 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...!

మొక్కలు పెంచడం..

మొక్కలు పెంచడం..

చిన్నతనంలో ఉన్నప్పుడు ఏవైనా మొక్కలు కనిపిస్తే.. వాటిని పీకేయడం.. పువ్వులను కోసేయడం వంటి చిలిపి పనులు చేసిన మీరు, ఇప్పుడేమో వాటి పెరుగుదల కోసం ఆరాటపడటం వంటివి చేస్తే.. మీరు పెద్ద మనిషి అయినట్లే.

ఫ్యామిలీతో ఎక్కువగా గడపడం..

ఫ్యామిలీతో ఎక్కువగా గడపడం..

మీరు టీనేజీలో ఉన్నప్పుడు ఎక్కడైనా పెళ్లిళ్లకు లేదా ఏదైనా శుభకార్యాలకు వెళ్లాలంటే మీ పేరేంట్స్ మిమ్మల్ని బతిమాలో.. బెదిరించో తీసుకెళ్లేవారు. అయితే ఇప్పుడు వారు మిమ్మల్ని బలవంతం పెట్టాల్సిన అవసరం లేకుండానే అలాంటి కార్యక్రమాలకు వెళ్తున్నారా? పైగా మీ పేరేంట్స్ ను సైతం ఫ్రెండ్స్ గా చూసే అలవాటు చేసుకున్నారా? అయితే మీరు పెద్ద మనిషి అయినట్టే సుమా...

మనీ మ్యాటర్లో..

మనీ మ్యాటర్లో..

కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని రోజుల క్రితం వరకూ మీకు నచ్చిన వాటిని దేన్నైనా కొనాలంటే మీ పేరేంట్స్ పర్మిషన్ కావాల్సిందే. లేదా మీరు దాన్ని చూసి సర్దుకోవాల్సిందే. అయితే ఇప్పుడు మీకు నచ్చిన వాటిని కొంటున్నారు.. మీరు డబ్బు సంపాదించడం కారణంగా.. మీకు ఏది కావాలో అది కొనేస్తున్నారు కదా..

ఏం వండినా తింటున్నారా?

ఏం వండినా తింటున్నారా?

టు డే స్పెషల్ ఏంటి? ఎప్పుడూ ఈ వంటలేనా? ఏ చికెన్ బిర్యానినో.. మటన్ బిర్యానినో వండొచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలు, కామెంట్లు లేకుండా మీ ఇంట్లో ఏది వండినా తింటున్నారంటే.. మీరు పెద్దవారైనట్టే కదా.. ఎందుకంటే మీరు వండే వారి కష్టాన్ని అర్థం చేసుకున్నట్టే కదా.

షాపింగ్ చేయడం..

షాపింగ్ చేయడం..

మీరు చిన్నతనంలో మీ వీధిలో ఉన్న షాపుకు లేదా మీ గ్రామంలో ఉన్న షాపుకు వెళ్లి ఏదైనా తీసుకు రమ్మంటే.. అదేదో పెద్ద కొండను మోసినంతగా ఫీలయ్యే ఉంటారుగా.. అయితే ఇప్పుడు మాత్రం ఇంట్లోకి అవసరమైన వస్తువులను తీసుకురావడానికి ఆసక్తి చూపడం.. అవసరమైతే మీ పేరేంట్స్ ను వెంట తీసుకెళ్లి మరీ నిత్యావసరాలు కొనుగోలు చేయడం.. షాపింగ్ చేయడం వంటివి చేస్తున్నారా? ఇలా చేయడం వల్ల ఏదో తెలియని సంత్రుప్తి కలిగినట్టు మీరు ఫీలవుతున్నారా? ఇలాంటివన్నీ చేస్తుంటే మీరు పెద్దవారైనట్టేనని చెప్పొచ్చు...

English summary

Things That Prove You’re Officially An Adult

Here are these things that prove you're officially an adult. Take a look
Desktop Bottom Promotion