For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఇలాంటి మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మనీ, సక్సెస్ పెరగొచ్చు...!

|

మనలో చాలా మంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి.. అన్నింట్లో సక్సెస్ కావాలని ఆశిస్తూ ఉంటారు. వీటితో పాటు సమాజంలో గౌరవం, హోదాను కోరుకుంటారు. అయితే కేవలం కొందరు ఇలాంటి విషయాల్లో సక్సెస్ అవుతారు. వారు తమ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.

అయితే మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా తమ జీవితంలో అధిక ఆదాయం పొందలేకపోతారు. ఏ ప్రయత్నంలో అయినా విఫలం అవుతూ ఉంటారు. ఇక సమాజంలో స్టేటస్ అనేదే ఉండదు. ఇలాంటి తమలో లోపాలను గుర్తించకుండా ఇతరుల లోపాలను మాత్రం చక్కగా చెబుతుంటారు.

అయితే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ జీవితంలో ప్రశాంతంగా మరియు ఆనందంగా జీవించాలనుకుంటే.. మాత్రం తమ కోరిక బలంగా ఉండాలట. అయితే అసలు సమస్య ఎలా జీవించాలి? దీనికి సంబంధించిన చిట్కాలు కేవలం కొందరికే తెలుసు. అది చాలా సులభమైనది.. అందమైనది.. ప్రశాంతమైనది.. మర్యాదపూర్వకమైనది.. సొగసైనది మరియు ధర్మబద్ధమైన జీవితం. మీ జీవితంలో ఇవి ఉన్నంత కాలం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారని మహవీర్ తన బోధనల్లో చెప్పేవారు. ఈ సందర్భంగా మీరు కూడా మీ జీవితంలో మనీ, సక్సెస్, నేమ్ సాధించాలంటే ఏమి చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అంతరిక్షంలో అడుగు పెట్టనున్న తొలి తెలుగుమ్మాయి ఎవరో తెలుసా...

ఆత్మవిశ్వాసం బలంగా..

ఆత్మవిశ్వాసం బలంగా..

ఎవరైతే తమ జీవితంలో సక్సెస్ కావాలనుకుంటారో.. అలాంటి వారంతా తమ ప్రతికూల పరిస్థితులలో ధైర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో బలంగా అడుగు ముందుకేయాలి. అప్పుడే మీకు కొత్త అవకాశాలు వస్తాయి. చరిత్రలో దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే పరిస్థితుల గురించి భయపడే బదులు మీ మనసు స్వీయశక్తిపై మనం ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే మీరు సమస్యలను అధిగమించేందుకు మార్గం సులభమవుతుంది.

ఇతరుల లోపాలు..

ఇతరుల లోపాలు..

మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు మీరు దాని పరిష్కారానికి ప్రయత్నించాలి. అంతేగానీ అందుకు కారణమైన వారిపై అరవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే ఇతరుల లోపాలను అన్వేషించడం.. ఇతరులను శపించడం వల్ల మీ తెలివితేటలు పని చేయవు. ఇలాంటి వాటి వల్ల మీ సమయం అనవసరంగా వ్రుథా అవుతుంది.

ప్రతికూల ఆలోచనలు..

ప్రతికూల ఆలోచనలు..

మీకు సమాజంలో గౌరవం కావాలంటే.. మీరు మీ మనసులో ముందుగా ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టాలి. నాకు సమాజంలో ఎవ్వరు గౌరవం ఇవ్వడం లేదనే భావన నుండి బయటకు రావాలి. ఎందుకంటే మీరు సమాజం కోసం ఏమి చేయనప్పుడు.. వారి నుండి మీరు గౌరవ, మర్యాదలు ఆశించడం తప్పు. అంతేందుకు మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ఫిర్యాదు ఎదురవుతాయి. దీని వల్ల మీ శక్తి, సామర్థ్యాలు తగ్గిపోతాయి.

అప్పుడు.. నిమ్మరసం అమ్మిన మహిళ.. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఎలా అయ్యిందో తెలుసా...

మీ జర్నీపై ఫోకస్..

మీ జర్నీపై ఫోకస్..

మీరు మీ జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. మీరు మీ జర్నీపై ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా మీ గురించి మీరు అంచనాలు వేసుకోవడం మానుకోండి. ఇక డబ్బు సంపాదనలో ఒక్కరోజులోనే అంతా పెరిగిపోదు. మనం నిరంతరం పని చేయాలి. అప్పుడే మీ ఆదాయం పెరుగుతుంది.

తప్పుల నుండి నేర్చుకోవాలి..

తప్పుల నుండి నేర్చుకోవాలి..

మానవ జీవితంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తారు. అయితే చేసిన తప్పు మళ్లీ చేయకుండా ఉండాలి. అలాగే మనం పొరపాటున చేసిన తప్పులను మరియు తెలియక చేసిన వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఆ తప్పులు ఎందుకు జరిగాయనే కారణాలు కూడా తెలుసుకుంటే.. భవిష్యత్తులో మళ్లీ అలాంటివి జరగకుండా ఉంటాయి.

పట్టుదల..

పట్టుదల..

జీవితంలో మీరు ఏదైనా కావాలనుకుంటే.. అది సాధించాలనే బలమైన పట్టుదల, కోరిక ఉన్నవారు మాత్రమే విజయం సాధించగలరు. అది డబ్బైనా.. సక్సెస్ అయినా.. హోదా అయినా.. కొందరమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడతారు. అందుకు తగినట్టు ప్రణాళికలు వేసుకుంటారు. మరికొందరు జీవితంలో లక్ష్యం అనేదే లేకుండా ముందుకెళ్తుంటారు. అలా చేస్తే జీవితంలో ఏమి చేస్తున్నామనేందుకు స్పష్టత అనేదే ఉండదు.

English summary

Things to Change Yourself to get Name, Money and Success in Telugu

Here are these things to change yourself to get name, money and success in Telugu. Have a look
Story first published: Monday, July 5, 2021, 12:00 [IST]
Desktop Bottom Promotion