For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతి వేళ్ల పొడవును బట్టి స్త్రీల వ్యక్తిత్వాలు, రహస్యాల గురించి తెలుసుకోవచ్చట..!

|

ఇప్పటివరకు మీరు మీ భవిష్యత్ కోసం రాశి ఫలాల జాతకాన్ని చూసి ఉంటారు. అలాగే మీ గ్రహాలు, నక్షత్రాలను కూడా ఫాలో అవ్వడం చూసే ఉంటారు. అయితే ఇవేవీ నిజం కావని, ఇదంతా అబద్ధమని చెబుతూ ఉంటారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా వీటిని నమ్మే వారు నమ్ముతుంటారు. నమ్మని వారు వీటిని మూఢనమ్మకాలు అంటారు.

అయితే ఎవరికైనా సరే వారి యొక్క రహస్యాలు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. ప్రస్తుతం రాశి చక్రాల ద్వారానే కాకుండా మీ చేతుల ద్వారానే మీ రహస్యాల గురించి తెలుసుకోవచ్చు. అయితే వేలిముద్రలో కాదు. మీ చేతి వేళ్లలో కూడా మీకు సంబంధించిన అనేక రహస్యాలు దాగున్నాయి. ఇది ఒక్క జ్యోతిష శాస్త్రం ద్వారానే కాకుండా శాస్త్రీయంగానూ నిరూపించబడింది. ఉదాహరణకు మహిళల పిండంలో టెస్టోస్టెరాన్ యొక్క అధిక స్థాయి వారి చూపుడు వేళ్ల పెరుగుదలను తగ్గిస్తుంది. అదే మీ ఉంగరపు వేలు మరియు చూపుడు వేలు మధ్య పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. ఇది మరింత వైవిధ్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి వారి ఉంగరపు వేలు, చూపుడు వేలిని బట్టి వారి ప్రవర్తన గురించి, వారి పాత్ర గురించి అనేక వాస్తవాలు చెప్పవచ్చు. అలాగే మహిళల చూపుడు వేలు, ఉంగరపు వేలు మరియు ఇతర వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి.

మెదడు పనితీరు..

మెదడు పనితీరు..

మహిళల్లో సహజంగా గర్భంలో టెస్టోస్టెరాన్ అధికంగా ఉన్న స్త్రీలు ఇతరుల కన్నా మెరుగైన మెదడు పనితీరును కలిగి ఉంటారు. అయితే ఇండెక్స్ యొక్క పొడవు కంటే తక్కువగా ఉండే మహిళలకు కూడా మెదడులో పనితీరు అద్భుతంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

అధిక సహనం..

అధిక సహనం..

మహిళల యొక్క ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు తక్కువగా ఉన్న వారికి అధిక సహనం ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే తక్కువ టెస్టోస్టెరాన్ ఎక్స్ పోజర్ ఉన్నమహిళలకు మరియు ఎక్కువ టెస్టోస్టెరాన్ ఎక్స్ పోజర్ ఉన్న మహిళలతో పోలిస్తే రేసింగ్ (పరుగు పందెం) మరియు వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడలలో రాణిస్తారట. అంతేకాదు వారు ఇతర మహిళల కంటే చాలా బలంగా ఉంటారు.

కలయికపై చాలా ఆసక్తి..

కలయికపై చాలా ఆసక్తి..

చూపుడు వేలు యొక్క పొడవు సాధారణం కంటే తక్కువగా ఉంటే అలాంటి మహిళల్లో కలయిక వంటి విషయాలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వైఖరులు మాత్రం వేరుగా ఉంటాయి. అలాగే మహిళల గర్భంలో అధిక టెస్టోస్టెరాన్ బహిర్గతం అయితే, అది వారి లైంగిక పనితీరును నిర్ణయిస్తుంది.

మెమోరీ పవర్..

మెమోరీ పవర్..

చూపుడు వేలు యొక్క పొడవు సాధారణం కంటే తక్కువగా ఉన్న మహిళల జ్ఞాపకశక్తి చాలా శక్తివంతంగా ఉంటుంది. వారు గణిత శాస్త్రంలో మంచి పట్టును సాధిస్తారు. అలాగే వారి మెదడు పనితీరులో వారి జ్ఞాపకశక్తి ఒక ప్రధాన అంశం అవుతుంది.

ఆందోళన మరియు నిరాశ

ఆందోళన మరియు నిరాశ

మీ చేతి వేళ్లు సాధారణం కంటే తక్కువగా ఉన్న వ్యక్తులు ఆందోళన మరియు నిరాశకు గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నారు. గర్భంలో ఎక్కువ మగ హార్మోన్లకు గురికావడం మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో వారు తరచుగా నిరాశకు లోనవుతారు.

వివాహ జీవితం...

వివాహ జీవితం...

చూపుడు వేలు సాధారణం పొడవు కంటే తక్కువగా ఉన్న మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. వారి సున్నితమైన వైఖరి మరియు చాతుర్యం వారి వివాహాలను సంతోషపరుస్తాయి. కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ వారి వైవాహిక జీవితం చివరికి విజయవంతమవుతుంది. దీంతో వారి కోరిక నెరవేరుతుంది.

కోపంగా ఉండే మహిళలు..

కోపంగా ఉండే మహిళలు..

చూపుడు వేలు సాధారణం కంటే తక్కువగా ఉంటే వారు మరింత కోపంగా ఉంటారు. అయితే వారి కోపానికి సరైన కారణం మరియు సమర్థన ఉంటుంది. కానీ వారు వ్యక్తపరిచే విధానం చాలా కఠినమైనది. వారు కోపంగా ఉన్నప్పుడు, ఇతరులు తమ దగ్గరకు వెళ్లకపోవడం మంచిది. కోపం ముగిసిన తర్వాత, వారు సాధారణ స్థితికి వస్తారు.

అట్రాక్టివ్ లుక్..

అట్రాక్టివ్ లుక్..

అధిక టెస్టోస్టెరాన్ ఎక్స్పోజర్ మహిళల్లో వివిధ మార్పులకు కారణమవుతుంది. వీరి చూపుడు వేలు పొడవు కంటే తక్కువ ఉన్న మహిళలు తరచుగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారు పురుషులను మాత్రమే కాకుండా మహిళలను కూడా ఆకర్షించగలరు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లితే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేసుకోండి. ఇలాంటి అనేక ఆసక్తికర, ఆరోగ్యకర, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం తెలుగు బోల్డ్ స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను, కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.

English summary

Things Women Ring Finger Length Could Say About Their Personality

Here are some things that women ring finger length could say about their personality. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more