Just In
- 5 hrs ago
Smartphone Addiction: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వదలడం లేదా.. అయితే ఇలా చేయండి
- 5 hrs ago
Health Benefits of Ragi : ఈ ఒక్క పదార్ధం కలిగిన ఆహారాలు రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి!
- 7 hrs ago
Amazon Sale: అమేజింగ్ అమెజాన్ సేల్: తక్కువ ధరలోనే విటమిన్ సప్లిమెంట్స్
- 7 hrs ago
Amazon Sale: తక్కువ ధరలో అదిరిపోయే ఆఫర్ తో ప్రోటీన్ పౌడర్లు
Don't Miss
- Movies
సీతారామం సినిమాను రిజెక్ట్ చేసిన టాలెంటెడ్ హీరోలు.. కారణం ఏమిటంటే?
- News
ఇక విమానాల్లో మాస్క్ మ్యాండెటరీ.. డీజీసీఏ ఆదేశాలు, రీజన్ ఇదే
- Sports
IPL 2023: కోల్‌కతా నైట్‌రైడర్స్ కొత్త కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
- Finance
బిగ్ బుల్ చివరిగా కొనుగోలు చేసిన స్టాక్ ఇదే.. 2 రోజుల్లో 50% పరుగులు.. మీ దగ్గర కూడా ఉందా..?
- Automobiles
రేపే మారుతి సుజుకి ఆల్టో కె10 విడుదల.. డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు..
- Technology
Dell నుంచి కొత్త Laptop లాంచ్ అయింది ! ధర & స్పెసిఫికేషన్లు చూడండి.
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
Today Rasi Phalalu :ఓ రాశి వారికి పెద్ద కంపెనీ నుండి ఆఫర్ రావొచ్చు...
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత' నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.
ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
Shukra
Rashi
Parivartan
2022:వృషభంలోకి
శుక్రుడి
సంచారం..
రాశిచక్రాలపై
పడే
ప్రభావం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది, అలాగే మీరు కొత్త ప్రాజెక్టులో పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు. ఈరోజు ఉద్యోగులకు మంచి అవకాశం ఉంటుంది. మీరు పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ పొందొచ్చు. మీ సన్నాహాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉండటం మంచిది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. వీలైతే, ఈరోజు మీ బిజీ రొటీన్ నుండి కొంత సమయం కేటాయించండి. మీ తల్లిదండ్రులతో గడపండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండదు. మీ ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ :18
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. విద్యా రంగంలో ఉండే వారికి ఈరోజు మంచి విజయం దక్కొచ్చు. వ్యాపారవేత్తలు ఎటువంటి చట్టపరమైన విషయాలలో నిర్లక్ష్యం చేయొద్దు. లేకుంటే మీరు పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో మీ వ్యాపారాన్ని చక్కగా ఉంచుకోవాలి. అహం వంటి ప్రతికూల భావాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు ఇబ్బంది పడవలసి రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఈరోజు మీ ప్రియమైన వారు కూడా మీ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ :సాయంత్రం 5 నుండి రాత్రి 8:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీరు తక్కువ ప్రయత్నంలో కూడా మంచి విజయాన్ని సాధించగలరు. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు లాభం జరుగుతుంది. ప్రత్యేకించి మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించినది అయితే, ఈరోజు మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చు. మీ ప్రమోషన్ చాలా కాలంగా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయినట్లయితే, ఈరోజు మీకు శుభవార్త అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉండాలి. ఇంటి సభ్యులతో ఈరోజు చాలా మంచి రోజుగా ఉంటుంది. మీకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమ పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 10:35 నుండి సాయంత్రం 7 గంటల వరకు
ఈ
5
రాశుల
వారు
రహస్యాలను
ఎప్పటీకీ
వేరే
వాళ్ళతో
చెప్పరు..!

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో వ్యాపారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల పర్యవసానాలను మీరు భరించాల్సి ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలలో ఏ ఒక్కటి తొందరపడి తీసుకోకపోవడమే మంచిది. ఆఫీసులో మీపై పని భారం పెరగొచ్చు. కాబట్టి మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఉన్నతాధికారులు మీకు కొన్ని ముఖ్యమైన పనులను అప్పగిస్తే, మీరు తొందరపాటుకు దూరంగా ఉండాలి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాలలో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు మీరు నిద్రలేమితో బాధపడొచ్చు. మీరు వైద్యుడిని సంప్రదించాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :35
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండాలి. ఇలాంటి విషయాలు మీ పురోగతిని కూడా ప్రభావితం చేస్తాయి. మీరు దానిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం లభిస్తుంది. మీ పనిలో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ, ఈ కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. మీ సమస్య త్వరలో పరిష్కారమవుతుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈరోజు మీ ముఖ్యమైన పనిని ఇంటి పెద్దల సహాయంతో పూర్తి చేయొచ్చు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ ప్రియమైన వారు ఏదో ఒక విషయంలో మీపై కోపంగా ఉండొచ్చు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4:15 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో వ్యాపారులు మంచి ఫలితాలను పొందొచ్చు. మీరు పెద్ద క్లయింట్‌తో కనెక్ట్ అయ్యే అవకాశం మీకు లభిస్తుంది. త్వరలో మీ వ్యాపారంలో కొన్ని పెద్ద మార్పులు కూడా రావచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు అనేక పనులను ఏకకాలంలో సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ శక్తి మరియు సానుకూలతతో ఉన్నతాధికారులు బాగా ఆకట్టుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడొచ్చు. ఈరోజు డబ్బుకు సంబంధించిన ఆకస్మిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :9
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 గంటల వరకు
Surya
Gochar
2022
:మిధునంలోకి
సూర్యుని
రవాణాతో
ఏ
రాశులపై
ఎలాంటి
ప్రభావమంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి వారిలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలాగే మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పనిని ప్రారంభించాలని నిర్ణయించుకోవచ్చు. ఈరోజు ఉద్యోగస్తుల చేతిలో మంచి అవకాశం ఉంటుంది. మీరు పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ పొందొచ్చు. మీ సన్నాహాల్లో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఉండటం మంచిది. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ తల్లిదండ్రులతో గడపండి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : ఉదయం 8:15 నుండి సాయంత్రం 6 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారిలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అకస్మాత్తుగా మీ పనిలో పెద్ద అడ్డంకి రావొచ్చు. ఈరోజు బాస్ కూడా మీ పట్ల చాలా అసంతృప్తిగా ఉంటారు. చిరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఒక చిన్న పొరపాటు మీకు నష్టానికి కారణం కావొచ్చు. చిన్న విషయాలకు కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఇది మీ ఇంటి వాతావరణానికి భంగం కలిగించొచ్చు. మీ మానసిక ప్రశాంతతకు భంగం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీరు నిరంతరం కూర్చొని పనిచేయడం మానుకోవాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీరు మీ పార్ట్నర్ పై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. లేదంటే మీ ఇద్దరి మధ్య సంబంధం విషయంలో ఏవైనా ఇబ్బందులు రావొచ్చు. మీ పిల్లల విద్య విషయంలో మంచిగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయానికొస్తే, ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈరోజు ఎక్కువ ఒత్తిడి ఉండొచ్చు. అయితే వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు రావొచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, ఈరోజు దగ్గుకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :13
లక్కీ టైమ్ : తెల్లవారుజామున 4 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో కొందరికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు. అయితే మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధి రంగంలో ఉండే వారికి ఈరోజు మంచి ఫలితాలు రావొచ్చు. ఈరోజు మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి బయటికి కూడా వెళ్లొచ్చు. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఖర్చు చేయకూడదు. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ప్రతికూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 4:40 నుండి రాత్రి 9:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనాలు రావొచ్చు. మీరు రుణాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటే, ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరోవైపు ఉద్యోగులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండొచ్చు. మీరు పొదుపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు వారిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రించడం వంటివి మానుకోవాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :7
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వ్యాపారాన్ని పెంచాలని ఆలోచనలో ఉంటే, తొందరపాటులో నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగులకు కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ బాస్ మీతో కఠినంగా వ్యవహరిస్తారు. జీతం విషయంలో ఈరోజు మీకు సమస్యలు మరింత పెద్దవిగా మారతాయి. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ సోదరి లేదా సోదరుల గురించి కొన్ని శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామితో మంచి సామరస్యంగా ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో వారి మద్దతు మీకు లభిస్తుంది. మైగ్రేన్ వ్యాధితో బాధపడేవారు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :37
లక్కీ టైమ్ : ఉదయం 6:25 నుండి ఉదయం 10 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.