For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతదేశంలో సాంప్రదాయ క్రీడల గురించి తెలుసుకుందామా..

|

ప్రతి ఏడాది హాకీ దిగ్గజ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ పుటినరోజు నాడు మన భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. క్రీడల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు, మన దేశంలోని అర్హులైన ఆటగాళ్లకు గుర్తింపు ఇచ్చేందుకు ఈరోజును జరుపుకుంటారు.

National Sports Day

పిల్లల పెరుగుదల, అభివృద్ధిలో క్రీడలు కీలక పాత్రను పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత తరం పిల్లలతో పోలిస్తే ఇంతకుముందు తరం పిల్లల్లో బహిరంగ క్రీడలు బాగా ప్రాచుర్యం పొందాయి. దాని ద్వారా వారు మానసిక ఆరోగ్యాన్ని పెంచుకునేవారు. గిల్లీ దండా, సబ్ జా, గోలీలాట వంటి వాటిని నేలమీద ఆడేవారు. దీంతో వారిలో ఉత్సాహం నేటి తరం పిల్లల కంటే చాలా రెట్టు ఎక్కువగా ఉండేది. కానీ నేటి తరం పిల్లలు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ లేదా వీడియో గేమ్స్ నే ఎక్కువగా ఆడుతున్నారు. క్రీడల సమయం మరియు సంస్కృతి మారిపోవడం వల్ల భారతదేశ సాంప్రదాయ ఆటలు మరుగున పడిపోతున్నాయి. దాదాపు అంతరించిపోయిన కొన్ని భారతీయ ఆటల గురించి ఈ స్టోరీలో తెలుసుందాం.

1) గిల్లి దండా..

1) గిల్లి దండా..

ఇంతకుముందు తరం వారికి ఈ ఆట గురించి పరిచయం అవసరం లేదు. ఈ ఆటను రెండు రకాల కట్టెలతో ఆడతారు. అందులో ఒకటి గిల్లీ. ఇది సాధారణంగా మూడు అంగుళాలు మాత్రమే ఉండి చిన్నగా ఉంటుంది. ఇంకొకటి రెండు అడుగుల పొడవు గల దండా. దీన్ని గిల్లీని కొట్టడానికి ఉపయోగిస్తారు.

2) లగోరి (పిథూ) ..

2) లగోరి (పిథూ) ..

లగోరి ఆటను పిథూ అని కూడా పిలుస్తారు. ఈ ఆట అంటే చాలా మంది ఇష్టపడతారు. ఈ ఆటను చిన్నరాళ్లను ఒకదానిపై ఒకటి జోడించి పెడతారు. దానిని బంతితో కొడతారు. దీనికి ముందే ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోతారు. ఇందులో ఏదో ఒక జట్టు ఆటగాళ్లు రాళ్లను పడగొట్టి పరుగులు తీస్తారు. అదే సమయంలో ఇతర జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లపై బంతిని విసిరి వారికి అది తగిలితే అవుట్ అని అంటారు. కానీ వారు విసిరిన ఆ బంతి వారికి తగిలేలోపే ఆ రాళ్ల జోడిని అమరిస్తే వారికొక పాయింట్ లభిస్తుంది.

3) గోలీలు (కంచా)..

3) గోలీలు (కంచా)..

గ్రామీణ ప్రాంతాలు, పట్టణాళ్లో రంగు గోలీలను కంచా అని అంటారు. ఇది పాలరాయి యొక్క ఆట. ఇప్పటికీ ఈ ఆటను చాలా మంది ఇష్టపడతారు. ఈ ఆటలో ఒక ఆటగాడు ఒక లక్ష్యాన్ని ఎంచుకుని కచ్చితంగా దానినే కొట్టాలి. దీంతో ఇతర గోలీలను కూడా గెలుచుకోవచ్చు.

4) ఖో-ఖో..

4) ఖో-ఖో..

ఈ క్రీడ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ క్రీడ ఇంతకుముందు పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా ఉండేది. ఈ క్రీడను రెండు జట్లుగా విడిపోయి ఆడతారు. ఒక జట్టు నుండి వచ్చిన ఆటగాడు నిర్ణీత సమయంలో మరొక జట్టు ఆటగాడిని పట్టుకోవాలి. కానీ కూర్చున్న వారిని మాత్రం పట్టుకోకూడదు. అంతకుముందు అందరూ వరుసలో కూర్చుంటారు.

5) బొంగరం (లట్టూ)..

5) బొంగరం (లట్టూ)..

Image Curtosy: lattoo

బొంగరాన్ని లట్టూ అని కూడా అంటారు. ఇది మరో రకమైన ఆట. దీనిలో చెక్కతో లేదా ప్లాస్టిక్ తో పై భాగం ఉంటుంది. దిగువ భాగంలో మేకుతో అతికించబడి ఉంటుంది. మందంగా ఉండే దారం లేదా తాడుతో దీని చుట్టూ చుట్టి దీన్ని నేలపై తిప్పుతారు. కొంతమంది ఇందులో బాగా నైపుణ్యం సంపాదించిన వారు చేతిలోనూ బొంగరాన్ని గింగరాలు తిప్పిస్తారు.

6) గొలుసు..

6) గొలుసు..

Image Curtosy: chain game

ఈ ఆటలో ఒక డెన్నర్ ఒక ఆటగాడిని పట్టుకుంటాడు. పట్టుబడిన ఆటగాడు చేతులు పట్టుకుని ఆటగాళ్ల గొలుసులో కలుస్తాడు. అదేవిధంగా, డెన్నర్ చేత పట్టుబడిన తర్వాత గొలుసులో చేర్చబడతారు. చివరికి మిగిలిన వారు విజేతగా నిలుస్తారు.

7) అష్టాచమ్మా..

7) అష్టాచమ్మా..

Image Curtosy: kith kith game

ఈ అష్టాచమ్మా ఆటను ఎక్కువగా ఆడపిల్లలు ఆడేవారు. దీర్ఘచతురస్రాకార నమూనాలను మైదానంలో లేదా ఇంటి దగ్గరే తయారు చేసుకుంటారు. అందులో ఒక రాయిని లేదా ఏదైనా వస్తును సరైన బాక్స్ లో విసిరి, ఆ వస్తువును ఒంటి కాలితో వెళ్లడమే కాకుండా అక్కడ గీసిన లైన్లకు కూడా తాకకుండా బయటకు తీసుకొస్తారు. ఒకవేళ పొరపాటున కాలు దించినా లేదా లైన్లను టచ్ చేసినా వారు అవుట్ అయినట్టే లెక్క.

8) సబ్ జా(చుపమ్ చుపాయ్)..

8) సబ్ జా(చుపమ్ చుపాయ్)..

Image Curtosy: chupam chupali

ఈ సబ్ జా ఆటను హైడ్ అండ్ సీక్ లేదా చుపమ్ చుపాయ్ అని పిలుస్తారు. ఈ ఆటను మాత్రం ఇప్పటికీ ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో ఆడుతున్నారు. ఈ ఆటలో డెన్నర్ అతని/ఆమె కళ్లు మూసుకుని లేదా ఎక్కడైనా దాక్కుని కొన్ని అంకెలను లెక్కిస్తాడు. అవి పూర్తయ్యే లోపు మిగిలిన వారు అతనికి తెలియని చోట్లలో దాక్కుంటారు. లెక్కించడం పూర్తయిన ఆటగాడు వారు ఎక్కడ దాక్కున్నారో కనిపెట్టాలి.

9) లాక్ అండ్ కీ..

9) లాక్ అండ్ కీ..

భారతదేశంలో ఈ ఆటను విష్ అమృత్ అని కూడా పిలుస్తారు. డెన్నర్ ఒక ఆటగాడిని తాకి వారికి విష్ (లాక్) ఇవ్వండి.

ఇతర ఆటగాళ్లు వచ్చి అతనికి/ఆమె అమృత్ (కీ) ఇచ్చే వరకు అతను/ఆమె అలాగే ఉంటుంది. అందరూ ఆటగాళ్లు లాక్ చేయబడినప్పుడు ఈ ఆట ముగుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆటను స్టెచ్ అండ్ డౌన్ అని కూడా పిలుస్తారు.

Image Curtosy : lock and key

10) రాజా, రాణి, మంత్రి, దొంగ, పోలీస్..

10) రాజా, రాణి, మంత్రి, దొంగ, పోలీస్..

Image Curtosy: raja mantri chor sipai

ఈ ఆటను ఐదుగురు కలిసి ఒకేచోట కూర్చుని ఆడతారు. వీరంతా ఒక ఐదు చిన్న పేపర్లలో ‘రాజా‘ ‘రాణి‘ ‘మంత్రి‘ ‘పోలీస్‘ ‘దొంగ‘ అని రాసి ఫోల్డ్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క చీటిని తీసుకుంటారు. ఎవరికైతు ‘రాజు‘ చీటి వస్తుందో వారు ‘రాణి‘ ఎవరి దగ్గర ఉందో కనిపెట్టి చెప్పాలి. కరెక్టుగా చెబితే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఒకవేళ కరెక్టుగా చెప్పకపోతే ఎవరిని అయితే గుర్తిస్తారో వారి చీటిని అందులో ఉండే పాత్రకు మారిపోతారు. అలా చివరికి ‘దొంగ‘ ఎవరో సులభంగా కనిపెడతారు. ‘దొంగ‘ చీటి ఎవరికి అయితే వస్తుందో వారికి చాలా తక్కువ పాయింట్లు వస్తాయి.

English summary

National Sports Day 2019: Traditional Games Of India That Are Almost Extinct

Outdoor sports are very popular among children of an earlier generation. Through it, they promote mental health. Gilly danda, sub ja, golilata were played on the ground. Their excitement was twice as high as that of today's generation. But today's generation of kids are playing games or video games on smart phones. With the changing times and culture of sports, India's traditional games are fading away. In this story we know about some of the almost extinct Indian games.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more