For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విశాఖ పరిధిలోని ఆ గిరిజన గ్రామంలో ఇతరులకు నో ఎంట్రీ.. ఎందుకో తెలుసా...

విశాఖ జిల్లాలోని ఆ గిరిజన గ్రామంలో ఇతరులకు ప్రవేశం లేదట. కారణమెంటో తెలుసుకుందామా.

|

అదొక మహా నగరం.. అందులో అద్భుతమైన సాగర తీరం.. విశాలమైన భవనాల సముదాయం.. సినిమా షూటింగులు.. ఇతర కార్యక్రమాలు అనునిత్యం.. ఇదంతా ఒక ఎత్తయితే.. తాజాగా ఆ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానిగా రాజధాని మారబోతోంది.

Tribal Village In Vizag denies Entry For Outsiders, Here is The Reason

స్మార్ట్ సిటీగా అవార్డు దక్కించుకు విశాఖ మహానగరం అందాలకు ప్రతిరూపం. ఈ జిల్లా చుట్టూ అందమైన గిరిజన గ్రామాలు ఉన్నాయి. అయితే జిల్లా నడిబొడ్డున ఉండే ఓ గిరిజన గ్రామం ఉంది. అందులో ఇతరులు వెళ్లకూడదట. అదేంటి ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటి ఆంక్షలేంటి అని ఆశ్చర్యపోతున్నారా? కాలం టెక్నాలజీ పరంగా ఎంతో డెవలప్ అవుతోంది. అందరూ ముందుకు వెళ్తున్న ఈ కాలంలో అక్కడ ఇలాంటి నిబంధనలేంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడేమైనా మానవ జాతి కాకుండా ఇతరులేమైనా జీవిస్తున్నారా? అనే ప్రశ్నలు మన మదిలో పుట్టుకొస్తాయి. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి. ఆ ఊరిలోకి ఎందుకని ఇతరులకు ప్రవేశం లేదనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Real life Kumbhkarna: కలియుగ కుంభకర్ణ..! ఏడాదికి ఏకంగా 300 రోజులు నిద్రలోనే...!Real life Kumbhkarna: కలియుగ కుంభకర్ణ..! ఏడాదికి ఏకంగా 300 రోజులు నిద్రలోనే...!

ఓ గిరిజన గ్రామం..

ఓ గిరిజన గ్రామం..

విశాఖ నగరం పరిపాలన నగరంగా ఎంపిక కావడంతో రాష్ట్రంలో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ఇప్పటికే గ్రేటర్ విశాఖ నగరంగా ఉన్న ఈ ప్రాంతం రోజురోజుకు తన పరిధిని పెంచుకుంటూ పోతోంది. అత్యాధునిక నగరాలతో పోటీ పడుతోంది. అలాంటి మహా నగరం నడి బొడ్డున ఓ గిరిజన గ్రామం ఉంది. విశాఖ నగరంలోని ఆరో వార్డులో ఓ గిరిజన గ్రామం ఉంది. అది భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. పీఎం పాలేనికి దగ్గరగా కంబాల కొండ రిజర్వ్ అడవుల్లో ఉంది ఈ చిన్న గిరిజన పల్లె.

ఇతరులకు ప్రవేశం లేదు..

ఇతరులకు ప్రవేశం లేదు..

350 మంది జనాభాతో ఉన్న పల్లె పేరు శంభువానిపాలెం, మన్నెందొర అనే గిరిజనం ఇక్కడ ఐదు తరాలుగా నివాసం ఉంటున్నారు. కంబాలకొండ అభయారణ్యం మధ్యలో ఉండే ఈ ప్రాంతానికి ఇతరులకు ప్రవేశం లేదు.

చెక్ పోస్టు తనిఖీలు..

చెక్ పోస్టు తనిఖీలు..

అంతేకాదండోయ్.. ఈ ప్రాంతంలో నివసించే వారు ఎక్కువగా బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోరట. శంభువానిపాలెం వెళ్లాలన్నా.. వెళ్లిన తర్వాత బయటకు రావాలన్నా కూడా చెక్ పోస్టులు తనిఖీలు ఉంటాయి. పిఎం పాలెం నుండి 5 కిలోమీటర్ల దూరంలో కాస్త లోపలికి వెళ్తే అక్కడ ఒక చెక్ పోస్టు ఉంటుంది. శంభువాని పాలెం వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల ముందే అటవీశాఖ కూడా ఓ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. గ్రామస్తుల రాకపోకపోలై అను నిత్యం నిఘా ఉంటుంది.

Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...Sirisha Bandla:అంతరిక్ష యానాన్ని అలవోకగా పూర్తి చేసిన తెలుగమ్మాయి శిరీష...

ఇంకెవరు వెళ్లలేరు..

ఇంకెవరు వెళ్లలేరు..

అందుకే ఈ గ్రామానికి అక్కడ నివాసం ఉండే వారు తప్ప ఇంకెవరు వెళ్లలేరు. 7.200 హెక్టార్లున్న కంబాల కొండ అభయారణ్యంలో ఉన్న ఈ పల్లెలో ఇప్పటికీ గిరిజన జీవన విధానమే ఉంటుంది. నగరంలోకి అడవి వచ్చిందా..? అడవే నగరంగా మారిందా.? అన్నట్టే ఉంటుంది. అక్కడ ఉండే కంబాలకొండ రిజర్వ్ ఫారెస్టులో గ్రామస్తుల్లో కొందరు సెక్యూరిటీ గార్డులుగా, స్వీపర్లుగా పనులు చేస్తుంటారు. మిగిలిన వారు ఊళ్లో మేకలు, గొర్రెలు కాచుకుని జీవనం సాగిస్తుంటారు.

ఐదు తరాల క్రితమే..

ఐదు తరాల క్రితమే..

వీరంతా ఈ ప్రాంతానికి ఐదు తరాల క్రితమే వలస వచ్చారంట. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో 11 మండలాల్లో అనేక గిరిజన తెగలు ఉన్నాయి. అందులో కొన్ని తెగలు ఏజెన్సీ నుండి మైదాన ప్రాంతంలో ఉండే జమిందార్లకు సేవకులు కూడా వచ్చారు. అలాగే మైదాన ప్రాంతాల్లో ఏజెన్సీ వస్తువుల్ని విక్రయించడానికి వచ్చి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని మన్నెందొర తెగగానే దీన్ని పిలుస్తారు. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా ఏ భవనం లేదట. కనీసం ఆసుపత్రి కూడా లేదు. వీరంతా వైద్యం కోసం కనీసం ఐదారు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. నెట్వర్క్ సమస్య వల్ల ఈ ఊరు బయటకు వెళ్లి తెచ్చుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి రావడానికి కనీసం వీరి బంధువులు కూడా రావడానికి ఇష్టడరు. ఒకవేళ వస్తే వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోయినట్టే....

English summary

Tribal Village In Vizag denies Entry For Outsiders, Here is The Reason

Here we are talking about the tribal village in vizag denies entry for outsiders, here is the reason. Have a look
Story first published:Wednesday, July 14, 2021, 19:53 [IST]
Desktop Bottom Promotion