For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...

|

ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం. చిరు వేప పూత.. మామిడి కాత.. పులుపులో పులకింతతో పాటు ఆరు రుచులతో పాటు ఆనందంగా ఆరంభించే తెలుగు నూతన సంవత్సరమే ఉగాది పండుగ.

ఈ షడ్రుచులలో ఒక్కో రుచికి, ఒక్కో పదార్థానికి ఒక్కో భావానికి ప్రతీక అని పెద్దలు చెబుతుంటారు. బెల్లంలో ఉండే తీపి ఆనందానికి.. ఉప్పులో ఉండే గుణం మన జీవితంలో ఉత్సాహానికి, వేప పూతలోని చేదు మన జీవితంలో బాధ కలిగించే అనుభవాల గురించి, చింతలోని పులుపు.. మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను, మామిడి ముక్కలలోని వగరు వంటి రుచులు.. కొత్త సవాళ్ల గురించి.. ఇక చివరగా కారం విషయానికొస్తే మనల్ని సహనం కోల్పేయేటట్టు చేసే పరిస్థితులను గుర్తు చేస్తుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు మరోసారి ఇళ్లలో ఉండే పండుగ చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ బంధు, మిత్రులను కలుసుకోలేమని బాధపడాల్సిన అవసరం లేదు.

మీరు మీ ఫోన్ లోని వాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు అందుబాటులో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఉపయోగించుకుని శ్రీ ఫ్లవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలను చెప్పొచ్చు. అయితే అందరి కంటే ముందుగా.. ప్రత్యేకంగా మీకిష్టమైన వారిని ఆశ్చర్యపరచాలనుకుంటే కింద ఉన్న మెసెజ్ లు, కోట్స్ లో మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి. మీ బంధు మిత్రులతో షేర్ చేయండి.. వారిని సంతోషపరచండి..

Ugadi Rasi Phalalu 2021:కొత్త ఏడాదిలో మీ జాతకం తెలుసుకుని.. మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి...!

ఉగాది అంటే..

ఉగాది అంటే..

U - ఉత్సవం

G - గౌరవం

A - ఆనందం

D - ధనం

I - ఐశ్వర్యం తెచ్చేదే ఉగాది పండుగ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన..

ఉగాది పర్వదినాన..

తీపి, చేదు కలగలిపినదే జీవితం..

కష్టం, సుఖం ఉంటేనే నిజమైన జీవితం..

ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వచ్చేదే ఉగాది పర్వదినం

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

సంతోషాన్ని తీసుకొచ్చేదే..

సంతోషాన్ని తీసుకొచ్చేదే..

వసంత కాలం..

కొత్త చిగురు పుట్టే సమయం..

కొత్త ఏడాది ఆరంభం..

షడ్రుచుల సమ్మేళనం..

ఆనందం.. ఆహ్లాదం తీసుకొచ్చేదే ఉగాది..

ఈ సందర్భంగా శ్రీ ఫ్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు.

Ugadi Rashi Phalalu 2021:కొత్త ఏడాదిలో మిధున రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!

విజయం సాధించేవరకు..

విజయం సాధించేవరకు..

కష్టాలు రానీ.. కన్నీళ్లు రానీ..

సమస్యలు రానీ.. సంక్షోభాలు రానీ..

కలిసి పోరాడుదాం.. కలిసే ఎదుర్కొందాం..

గెలుపొందే వరకు ఒకటిగా నిలుద్దాం..

అన్నింటా మీకు విజయమందించే సంవత్సరం..

కావాలని ఆశిస్తూ..!

శ్రీ ఫ్లవ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మరచిపోలేని క్షణాలు..

మరచిపోలేని క్షణాలు..

‘మధురమైన ప్రతి క్షణం..

నిలుస్తుంది జీవితాంతం..

రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం అలాంటి క్షణాలెన్నో మీకందించాలని'' ఆశిస్తూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

షడ్రుచుల సమ్మేళనం..

షడ్రుచుల సమ్మేళనం..

‘మామిడి పువ్వుకి మాట వచ్చింది..

కోయిల గొంతుకు కూత వచ్చింది..

వేప కొమ్మకు పూత వచ్చింది..

పసిడి బెల్లం తోడు వచ్చింది..

గుమ్మానికి పచ్చని తోరణం వచ్చింది..

వీటన్నింటినీ ఉగాది మన ముందుకు తెచ్చింది..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

Ugadi Rashi Phalalu 2021: ఉగాది నుండి వృషభరాశి వారికి ఎలా ఉంటుందంటే...!

తరగని సంతోషం..

తరగని సంతోషం..

‘శ్రీ ఫ్లవ నామ సంవత్సరం ఆరు రుచులతో

ఆరంభం మనసుకు తెచ్చెను తరగని సంతోషం..

ఉగాది గుండెకు ఆనందం''

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు

తెలుగు వారి పండుగ..

తెలుగు వారి పండుగ..

‘షడ్రుచుల సమ్మేళనం..

సంబరాల సూర్యోదయం..

భవితల పంచాంగ శ్రవణం..

వసంత కోయిల గానంతో పాటు వచ్చేదే తెలుగు వారి పండుగ ఉగాది''...

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు

ఆశల తోరణాలు..

ఆశల తోరణాలు..

మీ ఇంట నవ వసంతం..

కోకిల మీ ఇంటికి అతిథిగా..

రంగవల్లుల రంగులు..

కొత్త చిగురులు..

ఆశల తోరణాలు కట్టే వేళ ఉగాది..

మీకు మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులందరికీ శ్రీ ఫ్లవ నామ ఉగాది శుభాకాంక్షలు

English summary

Ugadi 2021 Wishes, Images, Quotes, Greetings, Whatsapp and Facebook Status Messages in Telugu

Here are the ugadi 2021 wishes, images, quotes, greetings, whatsapp and facebook status messages in Telugu. Share it.
Story first published: Sunday, April 11, 2021, 9:00 [IST]