Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
Ugadi Rashi Phalalu 2021: ఉగాది నుండి వృషభరాశి వారికి ఎలా ఉంటుందంటే...!
ఉగాది పండుగ సమయంలో వృషభరాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాగం ప్రకారం, ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండుగ రోజు నుండి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శ్రీ ఫ్లవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కొత్త సంవత్సరంలో జాతకం ఎలా ఉంటుంది.

ఏయే గ్రహాల ప్రభావం ఉంటుంది. గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తాయా.. లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తాయా.. గత ఏడాది మాదిరిగానే సమస్యలు వెంటాడతాయా.. అనే వివరాలతో పాటు ప్రతి నెలా మీ జాతకం ఎలా ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్
తెలుగు నూతన సంవత్సరమైన తొలి మాసం ఏప్రిల్లో వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో మీరు లక్ష్యం దిశగా పయనిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇతరుల సహాయం ఆశించి మీరు నిరాశ పడొచ్చు. ఈ నెలలో మీరు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీకు బెట్టింగ్ అలవాటు ఉంటే.. మీరు నష్టపోయే అవకాశం ఎక్కుగా ఉంటుంది. మరోవైపు మీరు నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మే..
తెలుగు నూతన సంవత్సరమైన రెండో మాసం మేలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీకు ఆదాయం సాధారణంగా ఉంటుంది. మీకు చాలా సందర్భాల్లో కష్టాలు ఎదురవుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కూడా సమయం అనుకూలంగా ఉండదు. ఉద్యోగులకు ఈ నెలలో పని భారం పెరుగుతుంది. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

జూన్..
ఈ నెలలో మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఆదాయం లభిస్తుంది. మీకు అప్పుల బాధ తగ్గుతుంది. ఉద్యోగులు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు శత్రువుల బెడద తొలగిపోతుంది. మీ వివాహ సంబంధ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలకు అనుకూల ఫలితాలు రావొచ్చు. చివరి వారంలో కొన్ని శుభవార్తలు వింటారు.

జులై..
ఈ నెలలో వృషభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగాలలో ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. మీరు కొత్త వస్తువులను కొంటారు. తొలి రెండు వారాల్లో కుటుంబ సభ్యుల మద్దతుతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలను పొందుతారు. ఈ నెల చివర్లో మీరు మంచి ఆదాయం పొందుతారు.

ఆగస్టు..
ఈ నెలలో మీరు చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీకు సకాలంలో ఆదాయం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. చివరి వారంలో ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగ ఉన్నతి కోసం ప్రయత్నాలు చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

సెప్టెంబర్..
ఈ నెలలో మీకు వారసత్వ ఆస్తికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. మరోవైపు వివాహ ప్రయత్నాలలో ఉన్నవారికి అనేక ఆటంకాలు ఏర్పడతాయి. మీ శ్రమ ఫలించి కుటుంబ సభ్యుల ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మీకు ఆధ్యాత్మిక భావాలూ పెంపొందుతాయి. మూడో వారంలో మీకు అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు.

అక్టోబర్..
ఈ నెలలో మీరు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల సహకారంతో కావాల్సిన చోటుకు బదిలీ లేదా ప్రమోషన్ వంటివి పొందుతారు. మరోవైపు మీకు ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. మీరు కోరుకున్న విశ్రాంతి లభించదు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి.

నవంబర్..
ఈ నెలలో ఆదాయ పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీ కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ప్రభుత్వ సంబంధ పెద్దల వలన సమస్యలు ఎదుర్కొందురు. వ్యాపారులు ఊహించిన ఫలితాలను పొందుతారు. అయితే మీరు నూతన ఆలోచనలు అంత త్వరగా ఆచరణ రూపంలోకి రావు. మొత్తంగా ఈ మాసం మీకు ప్రతికూలంగా అనిపిస్తుంది.

డిసెంబర్..
ఈ నెలలో మీరు ఊహించిన దానికన్నా ఖర్చులు పెరగొచ్చు. మీకు ఆకస్మిక నష్టాలు సంభవించవచ్చు. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మానసికంగా కూడా ఇబ్బందిగా ఉంటుంది. మీ స్నేహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. వాహన ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే.. చివరి వారంలో సమయం అనుకూలంగా ఉంటుంది.

జనవరి..
ఈ నెలలో వృషభరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు ఊహించిన విధంగా ఆదాయం లభిస్తుంది. మీకు ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య బలవంతంగా కాలం గడుపుతారు. మరోవైపు ఉద్యోగులకు నెల చివర్లో మంచి అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు ఆదాయ పరంగా మంచిగా ఉంటుంది.

ఫిబ్రవరి..
ఈ నెలలో ఉద్యోగులకు కొన్ని కొత్త బాధ్యతలు చేపడతాయి. మీరు కావాల్సిన ఆదాయాన్ని పొందుతారు. రెండో వారంలో వ్యాపారులు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు. మూడో వారం నుండి పట్టుదలకు పోవడం వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఉద్యోగులకు ఆకస్మికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.

మార్చి..
ఈ నెలలో ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. మీ ఇంటి వాతావారణం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని గొడవలు ఎదురవుతాయి. ఆర్థిక పరిమితులు మరింత ఇబ్బంది పెడతాయి. మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు. చివరి వారంలో మరింత ఇబ్బందులు పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి నిర్మాణ విషయాల్లో ఖర్చులు పెరుగుతాయి.



Click it and Unblock the Notifications
