For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలు పాటిస్తే కరోనా నుండి కోలుకోవచ్చంటున్న 'హ్యారీపోటర్' రచయిత...

కరోనా సోకిన వారు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఈ కరోనా వైరస్ నుండి తమను తాము కాపాడుకోవచ్చని ప్రముఖ ‘హ్యారీ పోటర్‘ రచయిత జేకే రోలింగ్ అంటున్నారు. ఈ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా....

|

కరోనా వైరస్ కు ఇప్పటివరకు ఎలాంటి మందు లేదు. కేవలం నివారణ ఒక్కటే మార్గం. ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తి ఎంత సామాజిక దూరం పాటిస్తే అంత మేలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు చాలా దేశాలు చెబుతున్నాయి.

అయితే మనకు ఈ మధ్య కరోనా వైరస్ ను చంపే మందు దొరికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో ఆమోదం పొందలేదు. ఇంకా చాలా వరకు ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. ఒకవేళ కరోనా వైరస్ విరుగుడుకు మందు దొరికినప్పటికీ అవి మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది.

Uk doctor offers breathing technique

అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చిన వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి చికిత్స చేసుకుంటే కోలుకునే అవకాశం ఉందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో చాలా మంది కూడా కోలుకున్నారు. అయితే 50 ఏళ్లకు పైబడిన వారు మాత్రం దీని నుండి అంత వేగంగా కోలుకోలేకపోతున్నారు.

Uk doctor offers breathing technique

ఈ సమయంలోనే అందరికీ ఓ తీపికబురు చెప్పింది 'హ్యారీ పోటర్' రచయిత. డాక్టర్లు చెప్పిన కొన్ని సూచనలను పాటిస్తే రెండు వారాల్లో చాలా సులభంగా కోలుకోవచ్చని.. తాను కూడా రెండు వారాలుగా కరోనా లక్షణాలతో బాధపడ్డాడని, డాక్లర్ల సలహా మేరకు చిట్కాలు పాటించడంతో తిరిగి కోలుకున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సోకిన వారు ఎలాంటి చిట్కాలు పాటించాలో.. ఆమె ఇంకా ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం...

Coronavirus Outbreak:కరోనావైరస్ పై మనందరికీ ఉన్న అపోహలు- వాస్తవాలు మీకోసం ఇక్కడ...Coronavirus Outbreak:కరోనావైరస్ పై మనందరికీ ఉన్న అపోహలు- వాస్తవాలు మీకోసం ఇక్కడ...

తన భర్త కూడా డాక్టర్...

తన భర్త కూడా డాక్టర్...

‘హ్యారీ పోటర్‘ రచయిత భర్త డాక్టర్ నీల్ ముర్రే సూచన మేరకు డాక్టర్ మున్సీ సూచనలు పాటించినట్లు ఆమె చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా వీడియోను కూడా పోస్ట్ చేశారు. జ్వరం, దగ్గు, తుమ్ములు, ఊపిరి తీసుకోవడం వంటి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ రోలింగ్ కరోనా టెస్టులను ఆమె చేయించుకోలేదట. అయినా కూడా కరోనా వైరస్ తగ్గిపోయిందని చెప్పారు.

డాక్టర్ సర్ఫరాజ్ సూచనలు..

డాక్టర్ సర్ఫరాజ్ సూచనలు..

* ముందుగా ఊపిరితిత్తుల్లోకి లోతుగా గాలిని పీల్చుకోవాలి

* 50 సెకన్ల పాటు ఊపిరిని బిగపెట్టి మెల్లగా గాలిని బయటకు వదలాలి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయాలి.

* ఆరోసారి గాలిని బయటకు వదులుతూ ముఖానికి ఏదైనా ఒక గుడ్డను లేదా మాస్కును అడ్డుగా పెట్టుకుని గట్టిగా దగ్గాలి.

* దీని వల్ల ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఏదైనా ఉంటే, అది బయటకు వస్తుంది. ఇలా రెండుసార్లు చేయాలి.

* ఆ తర్వాత బెడ్ మీద దిండువైపు ముఖం చేసుకుని బోర్లా పడుకుని పదిసార్లు దీర్ఘశ్వాస తీసుకుని వదిలేయాలి.

మరికొన్ని..

మరికొన్ని..

* ఊపిరితిత్తులు మన ముందు వైపు ఛాతికి దగ్గరగా ఉండవు. వీపు వైపై దగ్గరగా ఉంటాయట.

* సహజంగా వీపు వైపు పడుకుని ఉంటాం కనుక, ఊపిరితిత్తుల్లో గాలి వచ్చే ద్వారాలు మూసుకుపోతాయట.

* అందుకే బోర్లా పడుకుని దీర్ఘశ్వాస తీసుకోవాలట.

కరోనా సోకిన వారితో పాటు..

కరోనా సోకిన వారితో పాటు..

ఈ చిట్కాలను కరోనా వైరస్ సోకిన వారితో పాటు, కరోనా వైరస్ సోకని వారు కూడా ముందు జాగ్రత్త చర్యగా చేస్తే మంచిదని లండన్ రోమ్ ఫోర్డ్ లోని క్వీన్స్ హాస్పిటల్ డాక్టర్ సర్ఫరాజ్ మున్సీ చెబుతున్నారు.

యోగా గురువులు..

యోగా గురువులు..

శ్వాస పీల్చుకునే వ్యాయామం ద్వారా కరోనా వైరస్ బారి నుండి తప్పించుకోవచ్చని పలువురు యోగా గురువులు కూడా ఇప్పటికే చెప్పిన విషయం మనలో చాలా మందికి తెలిసిందే.

English summary

Uk doctor offers breathing technique advice to assist in alleviating covid-19 symptoms says jk rowling

Here are the breathing technique advice to assist in alleviating covid-19 symptoms. Take a look
Desktop Bottom Promotion