For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్షయ పాత్ర గురించి మనం నమ్మలేని నిజాలు...

అక్షయ పాత్ర గురించి మనం నమ్మలేని నిజాలు ఎన్నో ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

|

అక్షయ అంటే 'నిత్యమైనది' అని అర్థం. ఈ పదాన్ని మన పెద్దవాళ్లు చాలా సందర్భాలలో ఉపయోగించడం మనం వింటూనే ఉంటాం. అయితే అక్షయపాత్రకు ఎలాంటి నిబంధనలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అయితే అక్షయ పాత్రను ఒక్కసారి కడిగితే, అది దాని శక్తి కోల్పోతుందట. ఎందుకంటే సూర్యోపాసంలో వచ్చింది.

Unknown facts about Akshaya Paatra

అసలు అక్షయ పాత్ర ఏమిటి? దీనిలో నుండి ఏదైనా సరే నిత్యం ఎందుకు వస్తూనే ఉంటుంది? ఈ అక్షయ పాత్రను ఎవరు కనుగొన్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...మీకు ఎక్కువగా ఈ కలలు వస్తున్నాయా? అయితే అందులోని అర్థాలేంటో తెలుసుకోండి...

పాండవులు వనవాసానికి వెళ్లేటప్పుడు..

పాండవులు వనవాసానికి వెళ్లేటప్పుడు..

పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళ్తున్న సమయంలో, వారి వెంట చాలా మంది బ్రాహ్మాణులు(సుమారు 10 వేల మంది) వారి వెంట వెళ్లారు. పాండవులు వద్దని చెబుతున్నా... దుర్మార్గులు ఉండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ, తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారు. దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలా అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలో పడ్డారు.

ధర్మరాజు సూర్య ప్రార్థన..

ధర్మరాజు సూర్య ప్రార్థన..

ఆ సమయంలో పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుడిని ప్రార్థించగా, అప్పుడు కరుణించిన ఆదిభగవానుడు వారికి అక్షయ పాత్రను ఇస్తారు. ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే, ఎంతమందికైన దీని నుండి కావాల్సిన భోజనం లభిస్తుందని చెప్పారు.

బోర్లిస్తే..

బోర్లిస్తే..

అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన ఉంది. దాన్ని ఎవరైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుంది. ఇక ఆరోజు నుండి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు. కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారు.

ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

కౌరవులకు అనుమానం..

కౌరవులకు అనుమానం..

ఇలా కొన్ని రోజుల పాటు పాండవులు ఇంతమంది బ్రాహ్మాణులను పోషిస్తూ వచ్చారు. ఇదే సమయంలో కౌరవులకి ఒక అనుమానం వస్తుంది. పాండవుల దగ్గర ఏమి లేదు. అయినా వీరు ఇంతమందిని ఎలా పోషిస్తున్నారో తెలియక, వారు కోపంతో రగిలిపోతూ ఉంటారు.

ఓ మహర్షి వెళ్లినప్పుడు..

ఓ మహర్షి వెళ్లినప్పుడు..

ఇదే సమయంలో ఓ దుర్వాసన మహర్షి దురోధ్యనుడికి ఈ విషయాన్ని చెప్పాడు. ఇక ఆ మహర్షి అటు వెళ్తూ పాండవుల వద్దకు ఆతిథ్యానికి వెళ్లారు. మహర్షి నేను స్నానం చేసి వస్తాను. ఈలోపు మీరు అన్నింటినీ సిద్ధం చేసి ఉంచండి అని వారితో చెప్పారు.

ద్రౌపది కంగారులో..

ద్రౌపది కంగారులో..

పాండవులంతా కలిసి మహర్షి ఆతిథ్యానికి అన్నీ సిద్ధం చేయమని ద్రౌపదిని ఆదేశిస్తారు. దీంతో ఆమె కంగారులో అక్షయపాత్రను కడిగేస్తుంది. దీంతో ఆ పాత్రలో నుండి ఎలాంటి ఆహారం అనేదే రాదు. దీంతో ద్రౌపది ఇప్పుడు ఎలా అని చింతిస్తూ కూర్చుంది.

మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...మీ ఇంట్లో ధనం ఎల్లప్పుడూ నిల్వ ఉండాలంటే... ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

క్రిష్ణుడి మాయ..

క్రిష్ణుడి మాయ..

ఇదే విషయాన్ని పాండవులకు చెబుతుంది. అప్పుడు పాండవులంతా కలిసి క్రిష్ణుడిని ప్రార్థించారు. అప్పుడు క్రిష్ణుడు అక్షయపాత్రని సరిగా చూడమని కనీసం ఒక్క మెతుకైనా దొరుకుతుంది అంటాడు.

ద్రౌపది పాత్రలో చూడగా..

ద్రౌపది పాత్రలో చూడగా..

అప్పుడు ద్రౌపది పాత్రలో మరోసారి చూడగా ఒక అన్నం మెతుకు దొరుకుతుంది. దాన్ని తెచ్చి క్రిష్ణుడికి ఇస్తుంది. ఆ మెతుకుని ఉపయోగించి క్రిష్ణ మాయతో వారి కడుపు నిండేలా చేశాడు.

మళ్లీ వస్తా..

మళ్లీ వస్తా..

ఆ తర్వాత నదీ స్నానం చేసిన మహర్షితో పాండవులు ఆతిథ్యానికి రమ్మని చెప్పగా, అతను ఈరోజు కడుపంతా ఎందుకో నిండుకుండలా ఉన్నట్టు అనిపిస్తాం. ఈరోజు వద్దులే మళ్లీ వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.

English summary

Unknown facts about Akshaya Patra

Here we discussing about Unknown facts about Akshaya Paatra. Read on.
Desktop Bottom Promotion