For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shocking! కళ్యాణం కాని వారికే కరోనా ముప్పు ఎక్కువట..! మగవారికి మరింత వేగంగా సోకుతుందట...!

పెళ్లి చేసుకోకున్న వారిపైనా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందట.

|

కరోనా మహమ్మారి ఏ సమయాన చైనాలో అడుగుపెట్టిందో తెలియదు కానీ.. ఇప్పటికీ అందరినీ కలవరపెడుతూనే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే దాని ప్రభావం తగ్గుతోంది. మన దేశంలో కరోనా కేసులు పెరిగినప్పటికీ.. రికవరీ రేటు బాగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని తగ్గించేందుకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రష్యా వంటి దేశం ఏకంగా టీకా కూడా విడుదల చేసినట్లు ప్రకటించింది.

Unmarried Men at Higher Death Risk from COVID-19: Study

అయితే కరోనా గురించి తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. అదేంటంటే.. ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో... అలాంటి వారికి కరోనా వైరస్ చాలా వేగంగా సోకుతుందట. ఇదే విషయాన్ని స్వీడన్ లోని స్టాక్ హోమ్ యూనివర్సిటీ జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడించింది.

Unmarried Men at Higher Death Risk from COVID-19: Study

కరోనా గురించి ఈ యూనివర్సిటీకి చెందిన టీమ్ అనేక రకాలుగా.. అనేక కోణాల్లో పరిశోధనలు చేసిందట. వీరు జరిపిన అధ్యయనంలో ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం రండి...

వైరల్ : ఈ ఫొటోకు క్యాప్షన్ చెబితే మహింద్రా స్కేల్ మోడల్ కారు గెలుచుకోవచ్చట...వైరల్ : ఈ ఫొటోకు క్యాప్షన్ చెబితే మహింద్రా స్కేల్ మోడల్ కారు గెలుచుకోవచ్చట...

కరోనా శోధన..

కరోనా శోధన..

కరోనా వైరస్ మహమ్మారిని ఎలా తరిమికొట్టాలా అని ఇప్పటికే శాస్త్రవేత్తలు అనేక రకాలుగా శోధిస్తున్నారు. కరోనా విరుగుడుకు టీకాను తయారు చేయడంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు తాము రెండో టీకా కూడా రెడీ చేసినట్లు సంచలన ప్రకటన చేశాడు.

స్టాక్ హోమ్ వర్సిటీ..

స్టాక్ హోమ్ వర్సిటీ..

కరోనా పరిశోధనల్లో ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్న సమయంలో స్టాక్ హోమ్ యూనివర్సిటీ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ యూనివర్సిటీలోని ఓ టీమ్ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది..

మగవారికే ఎక్కువ..

మగవారికే ఎక్కువ..

కరోనా వైరస్ పెళ్లి చేసుకోని ఆడ, మగవారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని.. అందులోనూ మగవారు కరోనా బారిన పడి చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని వివరించింది.

కరోనా వల్ల మరణం..

కరోనా వల్ల మరణం..

ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉంటారో.. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో జన్మించిన వారికి కరోనా వల్ల మరణం సంభవించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో పాల్గొన్న స్వెన్ డెప్రాల్ హెచ్చరించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ది జనరల్ నేచర్ కమ్యూనికేషన్ లో ప్రచురించారు.

Multiple Sclerosis: తరచుగా తిమ్మిరిగా అనిపిస్తోందా? కాబట్టి మీరు ఈ 7 ఆహారాలను ఎప్పుడూ తాకకూడదు ...Multiple Sclerosis: తరచుగా తిమ్మిరిగా అనిపిస్తోందా? కాబట్టి మీరు ఈ 7 ఆహారాలను ఎప్పుడూ తాకకూడదు ...

వ్యక్తిగత ప్రభావాలు..

వ్యక్తిగత ప్రభావాలు..

అనేక రకాల వ్యక్తిగత ప్రభావాలు కరోనా వైరస్ మరణం ముప్పును మరింత ఎక్కువ చేసే అవకాశం ఉన్నట్టుగా డెప్రాల్ చెప్పారు. ఇందుకు గల ఆధారాలు కూడా తాము చూపించగలమని వివరించారు. ఈ కారణాలన్నీ మరణాల సంఖ్యను పెంచేలా ఉన్నాయని హెచ్చరించారు.

కరోనా మరణించిన వారి వివరాలు..

కరోనా మరణించిన వారి వివరాలు..

ఈ అధ్యయనం కోసం స్వీడిష్ నేషనల్ బోర్డ్ ఆఫ్ వెల్ఫేర్ నుండి 20 ఏళ్ల.. అంతకంటే ఎక్కువ వయసు ఉండే వారిలో.. ఎవరైతే కరోనాతో చనిపోయారో వారి వివరాలు సేకరించినట్టు తెలిపారు.

పెళ్లి కానీ మహిళలు..

పెళ్లి కానీ మహిళలు..

పెళ్లి చేసుకున్న వారితో కంపేర్ చేస్తే పెళ్లి కానీ అమ్మాయిలకు (ఎప్పటికీ పెళ్లి చేసుకోని వారు, విడాకులు తీసుకున్న వారు, వితంతువులు సైతం) కరోనా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనంలో తేలింది.

మగవారికే ఎక్కువగా..

మగవారికే ఎక్కువగా..

పెళ్లి ఎవరైతే చేసుకోకుండా ఉంటారో.. అందులోనూ అమ్మాయిల కంటే అబ్బాయిలకే కరోనా ముప్పు రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయం గతంలో జరిపిన పరిశోధనలో తేలిందన్నారు. ‘పెళ్లి కాని వారితో కంపేర్ చేస్తే పెళ్లి చేసుకున్న వారే ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతారని.. కరోనా సోకినా మరణం అనే ముప్పు నుండి పెళ్లి చేసుకున్న వారిలో తక్కువగా ఉంటుంది' అని డెప్రాల్ వివరించారు. అలాగే పెళ్లి చేసుకోకుండా ఉండే వారికి మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, గతంలో అనేక అధ్యయనాలు తెలిపాయని పరిశోధకులు పేర్కొన్నారు.

English summary

Unmarried Men at Higher Death Risk from COVID-19: Study

Here we talking about unmarried men at higher death risk from covid-19: Study. Read on.
Desktop Bottom Promotion