For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి

వ్యాపారంలో మంచి వృద్ధి సాధించడానికి, లాభాలు రావడానికి వాస్తు ప్రకారం కొన్ని నివారణలు చేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దుకాణాలు, ఆఫీసులు, రెస్టారెంట్లలో వ్యాపార వృద్ధికి కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని సూచిస్తున్న

|

జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే వృద్ధి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారం కూడా సాఫీగా నడవడానికి, లాభాలు రావడానికి అనేక అంశాలు దోహదం చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాపారంలో మంచి వృద్ధి సాధించడానికి, లాభాలు రావడానికి వాస్తు ప్రకారం కొన్ని నివారణలు చేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దుకాణాలు, ఆఫీసులు, రెస్టారెంట్లలో వ్యాపార వృద్ధికి కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.

Vastu tips for business to earn profits and attract money in Telugu

మీకు వ్యాపారం ఉంటే దానిని లాభాల్లోకి తీసుకెళ్లడానికి ఈ వాస్తు చిట్కాలు పాటించండి.

ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలుఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు

దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్ల కోసం చిట్కాలు:

దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్ల కోసం చిట్కాలు:

  • వ్యాపారాన్ని, దుకాణాన్ని తెరవగానే గణేషుడిని పూజించాలి. దీని వల్ల రోజంతా బాగుంటుంది.
  • మంచి స్థలంలో దుకాణం ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అంటే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కూడళ్లకు దగ్గరగా ఉండటం మంచిది.
  • ప్రవేశ ద్వారానికి ఎదురుగా స్తంభాలు, చెట్లు లాంటివి లేకుండా చూసుకోవాలి.
  • ప్రవేశద్వారానికి, శుభం-లాభం, రిద్ధి-సిద్ధి, స్వస్తిక్ వంటి శుభ చిహ్నాలతో అలంకరించాలి. ఇవి వాస్తు దోషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.
  • కస్టమర్లతో మాట్లాడేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండేలా చూసుకోవాలి.
  • నగదు పెట్టే ఉత్తరం లేదా తూర్పున తెరిచే విధంగా ఉంచాలి.
  • యజమానులు, ఉద్యోగులు పిల్లర్ బీమ్ కింద కూర్చోకూడదు.
  • దుకాణాన్ని, ఆఫీసును శుభ్రపరిచేటప్పుడు ఉప్పును వాడాలి.
  • అదృష్టాన్ని పెంపొందించడానికి ఉత్తర, ఈశాన్య దిశలో నీటి ఫౌంటెన్ ఉంచాలి.
  • ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే శ్రేయస్కరం.. వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో తెలుసా?ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే శ్రేయస్కరం.. వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో తెలుసా?

    దుకాణాలు, రిటైల్:

    దుకాణాలు, రిటైల్:

    • షాపుల యజమానులు ఈశాన్యం, వాయువ్యం, దక్షిణ దిశలలో కూర్చోకూడదు.
    • యజమాని నైరుతి, తూర్పు, ఉత్తరం వైపు కూర్చోవాలి.
    • విక్రయించే వస్తువులను పశ్చిమ, దక్షిణ, నైరుతి, వాయువ్యం దిశల్లో ఉంచాలి.
    • వాయువ్య దిశలో మెట్లు ఉండకూడదు.
    • ప్రవేశ ద్వారం ప్రాముఖ్యత

      తూర్పు ముఖం - ఆర్థిక లాభాలు

      పశ్చిమ ముఖం - నెమ్మదైన వృద్ధి, అడ్డంకులు

      ఉత్తరాభిముఖం - సంపద సృష్టి

      దక్షిణం - నష్టం, ఉద్రిక్తతలు

      అపార్ట్‌మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమేఅపార్ట్‌మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే

      ఆఫీస్:

      ఆఫీస్:

      • ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ప్రవేశ ద్వారం ఉండాలి.
      • ప్రవేశ ద్వారా ముందు ఇతర తలుపులు, గదులు, టాయిలెట్ ఉండకూడదు.
      • ఆఫీసుల్లో తలుపులు తెరచి ఉంచాలి.
      • డైరెక్టర్లు, మేనేజర్లు నైరుతి, దక్షిణం లేదా పశ్చిమ ప్రాతిపదికన హోదాలో కూర్చోవాలి.
      • సేల్స్ సిబ్బంది అందరూ వాయువ్య దిశలో కూర్చోవాలి.
      • ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుందిఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది

        రెస్టారెంట్:

        రెస్టారెంట్:

        • రెస్టారెంట్లకు అతిముఖ్యమైనది ప్రవేశ ద్వారం. అది ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి.
        • రిసెప్షన్ డెక్స్ ప్రవేశ ద్వారం యొక్క ఎడమ వైపున ఉండాలి. క్యాష్ కౌంటర్ రిసెప్షన్ యొక్క కుడి వైపున ఉత్తరం లేదా తూర్పు వైపు ఓపెనింగ్ ఉండాలి.
        • డైనింగ్ హాల్ పడమర, ఉత్తరం లేదా తూర్పున ఉంటే మంచిది.
        • వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి.
        • నైరుతిలో సామాగ్రి నిల్వ ఉంచుకోవాలి.
        • వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుందివాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుంది

English summary

Vastu tips for business to earn profits and attract money in Telugu

read this to know Vastu tips for business to earn profits and attract money in Telugu
Story first published:Monday, January 30, 2023, 17:07 [IST]
Desktop Bottom Promotion