Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
అపార్ట్‌మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే
వాస్తు దోషాలు లేని ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు అపార్ట్‌మెంట్ కొంటుంటే ఎలాంటి వాస్తు చూడాలి, ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఉంచుకున్నా అది ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వస్తువు ఉండే చోటు కూడా విధిని నిర్ణయిస్తుంది. వాస్తు అనుకూలంగా ఉంటే ఇల్లు, కార్యాలయాలు జీవితంపై మంచి ప్రభావం చూపిస్తాయి. వాస్తు దోషాలు ఉండే ఇంట్లోని సభ్యులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఇల్లు కట్టుకుంటున్నా, కొంటున్నా, కార్యాలయం, దుకాణం పెడుతున్నా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలని శాస్త్రం చెబుతుంది.

వాస్తు దోషాలు లేని ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు అపార్ట్‌మెంట్ కొంటుంటే ఎలాంటి వాస్తు చూడాలి, ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రవేశద్వారం ఎటువైపు ఉండాలంటే..
అపార్ట్‌మెంట్ కొంటుంటే అన్నింటికి కంటే మొదట చూడాల్సినది ప్రవేశ ద్వారం. ప్రవేశ ద్వారం మొత్తం కుటుంబానికి సానుకూలత మరియు ఆనందాన్ని అందించడానికి కీలకం. ఉత్తరం వైపు ప్రవేశం ద్వారం ఉంటే ఆర్థిక, వ్యాపార విషయాల్లో గొప్ప విజయాన్ని, అలాగే మీ కెరీర్‌లో మంచి అవకాశాలను పొందుతారు. ఎంచుకున్న అపార్ట్‌మెంట్‌కు వాస్తు అనుకూల ప్రవేశం ద్వారం లేకుంటే అలాంటి అపార్ట్‌మెంట్‌కు దూరంగా ఉండటం మంచిది. తప్పక కొనాల్సి వస్తే మాత్రం కొన్ని వాస్తు నివారణ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ప్రవేశం ద్వారా దక్షిణం, పశ్చిమ దిశల్లో అస్సలే ఉండకూడదు. ఉత్తరం వైపు లేదా ఈశాన్యం వైపు ఉండాలి. ఇలా ఉండటం వల్ల సూర్య కిరణాలు ఇంట్లో ప్రవేశిస్తాయి.

వాస్తు అనుకూల గది దిశ..
సరైనా స్థానంలో గదులు నిర్మించి ఉండాలి. అలా ఉంటే సానుకూల శక్తి ఇంట్లో ఉంటుంది. పనులు కూడా విజయవంతం అవుతాయి. గదులు వాస్తు ప్రకారం లేకపోతే ప్రతికూల ప్రభావం పడుతుంది.
తూర్పు వైపు లివింగ్ రూము, సామాజిక సంబంధాలను అభివృద్ధి చేయడానికి, బలోపేతం చేయడానికి అనువైనది. వాస్తు ప్రకారం తూర్పు, ఆగ్నేయం మధ్య పడకగదికి దూరంగా ఉండాలి. వాస్తు ప్రకారం నిద్రించే స్థానం, జోన్లలో ఒకరి జీవిత భాగస్వామితో ఆందోళన, విభేదాలకు దారి తీస్తుంది.
ఇంట్లో ఉత్తర, ఈశాన్య మండలాల మధ్య టాయిలెట్ నిర్మించుకోవద్దు. ఇది ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కిచెన్ కు ఆగ్నేయం అనుకూలమైనది. ఈశాన్య, నైరుతి మూలల్లో వంటగది ఉండకూడదు.
పడకగది నైరుతి మూలలో ఉండాలి. దీని వల్ల దాంపత్య బంధం బలోపేతం అవుతుంది. మంచి నిద్ర, విశ్రాంతి అందుతుంది. అలాగే పడకగది చతురస్రాకారం, దీర్ఘచతురస్రాకారంలో మాత్రమే ఉండాలి.
పిల్లల బెడ్రూము ఈశాన్యం, వాయువ్య మూలల్లో ఉండాలి. కిటికీలు ఉత్తరం వైపు ఉన్న గోడకు ఉండాలి.
టాయిలెట్లు వాయువ్యం, లేదా ఆగ్నేయ మూలలో ఉండాలి. అలాగే పూజాగది టాయిలెట్ ఆనుకుని ఉండకూడదు. ఒకే గోడను పంచుకోకూడదు.

అపార్ట్మెంట్లకు వాస్తు నివారణలు:
మీరు ఇప్పటికే అపార్ట్‌మెంట్ కొని ఉంటే వాస్తు ప్రకారం ఇంట్లో గోడలు పడగొట్టాల్సిన అవసరం లేదు. ఇంటి పూర్తి ప్లాన్ మార్చాల్సిన అవసరం లేదు. సాధారణ, ప్రభావవంతమైన వాస్తు నివారణ పద్ధతుల ద్వారా వాస్తు దోషాలను నివారించవచ్చు. రంగులు, ఆకారాలు, లైట్లు, లోహాలు, చిహ్నాలు ఉపయోగించి వాస్తు దోషాలను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications