For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకుంటే శ్రేయస్కరం.. వాస్తు ప్రకారం ఎక్కడ పెట్టాలో తెలుసా?

ఇంట్లో, కార్యాలయాల్లో ఏనుగు విగ్రహాలను, చిత్రపటాలను ఏ దిక్కులో ఉంచాలి, ఎటువైపు ఉంచితే ప్రయోజనం చేకూరుతుంది, వాటి నుండి మంచి ప్రయోజనం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వాస్తు శాస్త్రం ప్రకారం ఏనుగులను చాలా శక్తివంతమైన, పవిత్రమైన జంతువులుగా పరిగణిస్తారు. అలాగే గజరాజులు అదృష్టానికి, సంతృప్తికి చిహ్నాలుగా గౌరవిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఏనుగు బొమ్మలు, ఫోటోలు పెట్టుకుంటే అడ్డంకులు తొలగిపోతాయని, శ్రేయస్సు, సంపద సిద్ధిస్తాయని విశ్వసిస్తార. ఇల్లు, కార్యాలయాలు, వ్యాపార ప్రాంతాల్లో ఏనుగు విగ్రహాలు, ఫోటోలు ఉంచితే అదృష్టం, శ్రేయస్సు, విజయాలను తెస్తాయని నమ్ముతారు.

Vastu tips for elephant images, Benefits & placement as per vastu in Telugu

అయితే ఇంట్లో, కార్యాలయాల్లో ఏనుగు విగ్రహాలను, చిత్రపటాలను ఏ దిక్కులో ఉంచాలి, ఎటువైపు ఉంచితే ప్రయోజనం చేకూరుతుంది, వాటి నుండి మంచి ప్రయోజనం కోసం పాటించాల్సిన వాస్తు నియమాలో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారువాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు

ఇంట్లో ఏనుగు బొమ్మల ప్రాముఖ్యత:

ఇంట్లో ఏనుగు బొమ్మల ప్రాముఖ్యత:

హిందూ పురాణాల ప్రకారం ఏనుగు చిత్రాలు బలం, గౌరవం, గొప్పతనాన్ని సూచిస్తాయి. ఏనుగును గణేషుడితో పోలుస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించి జీవితం ఆనందంగా సాగిపోయేలా ఆశీర్వదిస్తాడని భక్తుల విశ్వాసం. బుద్ధుడిని ఏనుగులకు అనుసంధానించే సంప్రదాయం ఉంది.

ఇంట్లో ఏనుగు బొమ్మలు, చిత్రపటాలు ఉంచడం వల్ల అదృష్టం వస్తుందని హిందువుల విశ్వాసం. సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనే వారు ఇంట్లో ఏనుగు విగ్రహం పెట్టుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయిఈ విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయి

ఏనుగు బొమ్మలను ఏ దిక్కులో ఉంచాలంటే..

ఏనుగు బొమ్మలను ఏ దిక్కులో ఉంచాలంటే..

వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తరం లేదా ఈశాన్యం. ఇంట్లో అయినా కార్యాలయంలో అయినా ఏనుగు బొమ్మను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. ఉత్తరం, ఈశాన్య దిక్కులు సంపదను, విజయాన్ని సూచిస్తాయి. ఈ దిక్కుల్లో ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల సానుకూల శక్తి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఇంటికి శ్రేయస్సు చేకూరడానికి ఏనుగు బొమ్మలను ఉత్తరం దిక్కులో లేదా ఈశాన్యం మూలలో ఉంచాలి.

తూర్పు దిశలో కూడా ఏనుగు బొమ్మలను, చిత్రపటాలను ఉంచవచ్చు. సానుకూల శక్తిని, జీవితంలో విజయాన్ని తెస్తుందని నమ్ముతారు.

పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎటువైపు ఉంచాలి, ఎటువైపు ఉంచితే మంచిదంటేపడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎటువైపు ఉంచాలి, ఎటువైపు ఉంచితే మంచిదంటే

ఏనుగు బొమ్మలను ఎక్కడ ఉంచొచ్చంటే..

ఏనుగు బొమ్మలను ఎక్కడ ఉంచొచ్చంటే..

ఇంటి ప్రవేశ ద్వారంలో ఏనుగు బొమ్మను ఉంచడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. చదువులో, వృత్తిపరమైన విషయాల్లో ఏకాగ్రత చూపడానికి, విజయాన్ని ప్రోత్సహించడానికి స్టడీ రూములో లేదా ఆఫీసు గదిలో ఏనుగు చిత్రాన్ని ఉంచితే మంచి ఫలితం కనిపిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి. లివింగ్ రూమలో, హాలులో ఏనుగు బొమ్మలు ఉంచొచ్చు. దీని వల్ల దృష్టి దోషం తొలగిపోతుంది,

అయితే ఏనుగు చిత్రాలను, బొమ్మలను నేలపై ఉంచకూడదు. తల ఎత్తి చూసేలా ఏనుగు చిత్రపటాలను ఉంచొచ్చు. ఏనుగు బొమ్మలను నేలకు కొద్ది ఎత్తులో ఉంచాలి. ఎంత ఎత్తులో ఉంచాలనేది వ్యక్తిగత ఇష్టం.

మీ ఇంట్లో రాగి పాత్రలున్నాయా? వాస్తు ప్రకారం వాటిని ఎలా వాడాలో తెలుసా?మీ ఇంట్లో రాగి పాత్రలున్నాయా? వాస్తు ప్రకారం వాటిని ఎలా వాడాలో తెలుసా?

ఏనుగు రంగు ప్రకారం వాటి ప్రాముఖ్యత:

ఏనుగు రంగు ప్రకారం వాటి ప్రాముఖ్యత:

  • వైట్ ఏనుగు - సంపద, లగ్జరీ
  • గ్రీన్ ఏనుగు - అదృష్టం, శక్తి
  • రెడ్ ఏనుగు - కీర్తి, గుర్తింపు
  • బ్లాక్ ఏనుగు - విజయం, సంపద
  • బాల్‌ను పట్టుకున్నట్లు ఉండే ఏనుగు - జీవితంలో సామరస్యం, సంతులనం
  • నాణేలపై నిలబడి ఉండే ఏనుగు - జ్ఞానం, సంపద, శక్తి, రక్షణ
  • దంతమున్న ఏనుగు, దంతం లేని ఏనుగు - దంపతుల మధ్య సాన్నిహిత్యం
  • తొండాలతో పట్టుకున్న ఏనుగులు - స్నేహం, బలమైన బంధం
  • 3 ఏనుగులు - ప్రశాంతమైన కుటుంబ జీవితం
  • రెండు కాళ్లను పైకి లేపిన ఏనుగు - శక్తి, నాయకత్వం, రక్షణ
  • ఇంట్లో వాస్తు పిరమిడ్ ఎక్కడ పెట్టాలి? ఈ చోట్ల పెడితేనే లాభం, శ్రేయస్సుఇంట్లో వాస్తు పిరమిడ్ ఎక్కడ పెట్టాలి? ఈ చోట్ల పెడితేనే లాభం, శ్రేయస్సు

English summary

Vastu tips for elephant idols, Benefits & placement as per vastu in Telugu

read this to know Vastu tips for elephant images, Benefits & placement as per vastu in Telugu
Story first published:Saturday, January 21, 2023, 12:45 [IST]
Desktop Bottom Promotion