For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?

లక్ష్మీదేవిలా భావించే చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలి, కొత్త చీపురును ఎప్పుడు కొనాలి లాంటి వాస్తు నియమాల గురించి ఇప

|

హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంట్లోని చీపురును లక్ష్మీ దేవితో పోలుస్తారు. అందుకే ధన త్రయోదశి రోజున చాలా మంది కొత్త చీపుర్లు కొని పూజలు చేస్తుంటారు. చీపురు కాలికి తగిలితే మొక్కుతుంటారు. చీపురును ఎక్కడ పడితే అక్కడ ఉంచరు. ప్రతి హిందూ ఇళ్లల్లో చీపురును ప్రత్యేకం చూస్తారు. ఈ సాంప్రదాయాలను పాటించడం ద్వారా లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందవచ్చని విశ్వాసం.

Vastu tips when to purchase and where to keep broom in house in Telugu

లక్ష్మీదేవిలా భావించే చీపురును ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని వాస్తు శాస్త్రం చెబుతోంది. అసలు ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలి, కొత్త చీపురును ఎప్పుడు కొనాలి లాంటి వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Vastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండిVastu Tips: వ్యాపారంలో లాభాల కోసం ఈ వాస్తు చిట్కాలు పాటించండి

కొత్త చీపురు ఎప్పుడు కొనాలి:

కొత్త చీపురు ఎప్పుడు కొనాలి:

వాస్తు ప్రకారం శనివారం రోజున కొత్త చీపురు కొనడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. శనివారం నాడు కొత్త చీపురు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుందని, సంతోషం వెల్లివిరుస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి కూడా సంతోషంగా ఉంటుంది. కృష్ణ పక్షంలోని ఏదైనా శనివారం మాత్రమే చీపురు కొనాలని గుర్తుంచుకోవాలి. శుక్ల పక్షంలో ఎప్పుడూ కొత్త చీపురు కొనవద్దు. అది దురదృష్టాన్ని తెస్తుంది.

పౌర్ణమి నుండి అమావాస్య వచ్చే రోజులను కృష్ణ పక్షంగా, అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే రోజులను శుక్ల పక్షంగా పరిగణిస్తారు.

ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలుఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు

చీపురును కనబడే చోట పెట్టకూడదు:

చీపురును కనబడే చోట పెట్టకూడదు:

చీపురు ఇంట్లో బహిరంగ ప్రదేశంలో లేదా కళ్ల ముందు ఉంచకూడదు. ఇంట్లో డబ్బును దాచినట్లే చీపురును కూడా దాచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంటి బయట కూడా బహిరంగ ప్రదేశంలో చీపురును ఉంచకూడదు. ఇలా అందరికీ కనిపించేలా పెట్టడం వల్ల ఇంట్లో సానుకూలత దెబ్బ తింటుందని శాస్త్రం చెబుతోంది.

అపార్ట్‌మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమేఅపార్ట్‌మెంట్ కొంటున్నారా? అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే

చీపురు నిటారుగా ఉంచకూడదు:

చీపురు నిటారుగా ఉంచకూడదు:

చీపురు ఎప్పుడూ పడుకోబెట్టే ఉంచాలి. చీపురు నిలబెట్టడం వల్ల ఇంట్లో దారిద్ర్యం వస్తుంది. ఇది ఇంటికి శ్రేయస్సు మరియ దీవెనలు తెస్తుంది కాబట్టి ఇది ఎప్పుడూ నెలపై పడుకోబెట్టాలని శాస్త్రం చెబుతోంది.

ఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుందిఈ పూల మొక్కలు ఇంట్లో పెంచుకుంటే వాస్తు దోషం తొలగిపోయి మంచి జరుగుతుంది

పాత చీపురుని ఎప్పుడు పడేయాలి:

పాత చీపురుని ఎప్పుడు పడేయాలి:

కొత్త చీపురు కొన్న తర్వాత ఇంట్లోని పాత చీపురును పడేస్తాం. అయితే వాస్తు ప్రకారం పాత చీపురును గురు, శుక్రవారాల్లో ఎట్టిపరిస్థితుల్లో బయట పడేయకూడదు. అమావాస్య లేదా శనివారం రోజుల్లో మాత్రమే పాత చీపురును బయట పడేయాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుందివాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఈ వస్తువులు ఉంచొద్దు, ఉంచితే చెడు జరుగుతుంది

English summary

Vastu tips when to purchase and where to keep broom in house in Telugu

read this to know Vastu tips when to purchase and where to keep broom in house in Telugu
Story first published:Monday, January 30, 2023, 20:36 [IST]
Desktop Bottom Promotion