Just In
- 1 hr ago
జూలై 12 నుండి మకరరాశిలోకి శని సంచారం; రాబోయే 6 నెలలు, శని ఈ రాశులపై కోపంగా ఉంటారు..జాగ్రత్త!!
- 3 hrs ago
Dandruff problem: మౌత్ వాష్ వల్ల చుండ్రు పూర్తిగా పోతుంది... వెంటనే ట్రై చేయండి...
- 6 hrs ago
Asthma: ఆస్తమాకు సరైన సమయంలో చికిత్స అందివ్వకపోతే..ఈ ప్రధాన సమస్యలతో పాటు ప్రాణాంతకం అని తెలుసుకోండి..
- 11 hrs ago
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
Don't Miss
- News
ముప్పవరపు వెంకయ్యనాయుడు విషయంలో స్పష్టత వచ్చినట్లేగా?
- Finance
LIC Policy: మహిళలకు LIC స్పెషల్.. రోజూ రూ.29 చెల్లిస్తే రూ.4 లక్షల రాబడి.. పూర్తి వివరాలు
- Automobiles
కొత్త 2022 కియా సెల్టోస్ టెలివిజన్ కమర్షియల్ రిలీజ్.. ఇది భారత మార్కెట్లో విడుదలయ్యేనా?
- Sports
టీ20 ప్రపంచకప్ జట్టులోకి ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుంటాం: రోహిత్ శర్మ
- Movies
Top Telugu Movies 2022 First Half: ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాలు.. టాప్ 3లో KGF 2
- Technology
టెక్నో స్పార్క్ 8P బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్ర గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శుక్రుడు ప్రేమ జీవితానికి, విలాసవంతానికి, భౌతిక సుఖాలకు కారకంగా పరిగణిస్తారు.
ఎవరి జాతకంలో అయితే శుక్రుని స్థానం అనుకూలంగా ఉంటుందో వారి వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ నేపథ్యంలోనే శుక్రుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో మే 23వ తేదీన అంటే సోమవారం నాడు ఉదయం 8:39 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు.
ఇదే రాశిలో 18 జూన్ 2022 వరకు ఉదయం 8:28 గంటలకు నివాసం ఉండి అనంతరం వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ద్వాదశ రాశులలో ఏ రాశి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ
6
రాశుల
వారు
ప్రేమ
విషయంలో
చాలా
లక్కీ...!
ఈ
జాబితాలో
మీ
రాశి
ఉందా?

మేష రాశి..
ఈ రాశిలోకి శుక్రుడు సంచారం చేయడం వల్ల మేష రాశి వారి లక్ష్యాలు నెరవేర్చుకోవచ్చు. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు ప్రేమ నిండి ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్ ను కూడా ప్రారంభిస్తారు.
పరిహారం : శుక్రవారం రోజున గులాబీ మరియు క్రీమ్ కలర్ వస్త్రాలను ధరించాలి.

వృషభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ జీవితంలో పెద్ద మార్పులు రావొచ్చు. ఉద్యోగులకు వేతనం పెరగొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో లాభాలొస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టేందుకు సరైన సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం :ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం శుక్రాయ నమః' మంత్రాన్ని పఠించాలి.

మిధున రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారులు లాభపడతారు. మీరు మీ అభిరుచిపై ఆసక్తి చూపొచ్చు. ఈ సమయంలో మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. మీరు మీ పిల్లలతో కొంత నాణ్యమైన సమయాన్ని గడపొచ్చు.
పరిహారం : శుక్రవారం రోజున సరస్వతీ దేవిని పూజిస్తే శుభ ఫలితాలొస్తాయి.
Mangal
Gochar
2022:కుజుడు
మీనంలోకి
ప్రవేశం..
ఈ
రాశులకు
చాలా
అదృష్టం..!

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో మంచి లాభాలు పొందలేరు. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. మీరు మీ కుటుంబంతో గడిపేందుకు ప్లాన్ చేసుకోవాలి. విశ్రాంతి తీసుకోవడానికి మార్గాలను కనుగొనండి.
పరిహారం : మీరు ప్రతిరోజూ ఉదయం లక్ష్మీదేవిని పూజించి ‘‘మహాలక్ష్మీ''అష్టకం పఠించాలి.

సింహ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 9వ స్థానం నుండి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో సింహ రాశి వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు కొత్త ఉద్యోగావకాశాలను కూడా పొందుతారు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని పెట్టుబడులు కూడా పెట్టొచ్చు.
పరిహారం : శుక్రవారం రోజున సరస్వతీ దేవికి తెల్లని పువ్వులను సమర్పించి శుక్ర మంత్రాన్ని జపించాలి.

కన్య రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో కన్య రాశి వారి జీవితంలో కొంత మార్పు ఉంటుంది. వ్యాపారులకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడొచ్చు. ఈ కాలంలో మీరు కొన్ని పెట్టుబడులు పెట్టొచ్చు. దీని వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. మీరు పూర్వీకుల నుండి ఏదైనా ఆస్తి ప్రయోజనం పొందొచ్చు. మీకు కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు ఉండొచ్చు. ఈ కాలంలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణించొచ్చు.
పరిహారం : మీ నుదుటిపై తెల్ల చందనం తిలకం రాయండి. ప్రతిరోజూ చందనం సువాసనను ఉపయోగించాలి.
Mangal
Gochar
2022:మీన
రాశిలోకి
అంగారకుడి
సంచారం..
ఏ
రాశి
వారిపై
ఎలాంటి
ప్రభావమంటే...!

తుల రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 7వ స్థానం నుండి మేషంలోకి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా మంచిగా ఉంటుంది. మీ పని విషయంలో సానుకూల మార్పులొస్తాయి. వ్యాపారవేత్తలు కొత్త వ్యూహాలను వెతుక్కుంటారు. మీ వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాస్తాయి. వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : మీ ఉంగరపు వేలికి లేదా మణికట్టు మీద రోజ్ క్వార్ట్జ్ ధరించాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 6వ స్థానం నుండి మేషంలోకి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా నష్టాలు రావొచ్చు. మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రత్యర్థులు హాని కలిగించేందుకు ప్రయత్నించొచ్చు. మరోవైపు వ్యాపారులు పోటీదారులతో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లయిన వారికి జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో అజాగ్రత్తగా ఉండొద్దు.
పరిహారం : ఆడపిల్లలకు బట్టలు, నగలు దానం చేయండి.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 5వ స్థానం నుండి మేషంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు వేతనం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఇతర వనరుల నుండి కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు డబ్బులు తీసుకోవద్దు. విద్యార్థులు విద్యపై ఎక్కువ ఫోకస్ పెంచుకోవాలి. మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవ పడతారు.
పరిహారం : మీరు లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు సమర్పించి ‘‘శ్రీ సూక్తం'' పఠించాలి.

మకర రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 4వ స్థానం నుండి మేషంలోకి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మకర రాశి వారి ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మీ నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపారులు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపొచ్చు. వివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు సౌందర్య సాధనాలను దానం చేయాలి

కుంభ రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 3వ స్థానం నుండి మేషంలోకి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ కెరీర్ గ్రాఫ్ పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ కూడా రావొచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. మీడియా రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన ప్రయాణాలు చేసే వారు విజయం సాధిస్తారు.
పరిహారం : ఉంగరపు వేలికి వెండి ఉంగరం లేదా మెడలో వెండి గొలుసు ధరించొచ్చు.

మీన రాశి..
ఈ రాశి నుండి శుక్రుడు 2వ స్థానం నుండి మేషంలోకి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీ జీవితంలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు కొంత నష్టాన్ని చూడొచ్చు. మార్కెట్లోని ప్రత్యర్థులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నించొచ్చు. మీరు కొన్ని అనవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయొచ్చు.
పరిహారం : శుక్రవారం రోజున ఉపవాసం ఉండి ఆడబిడ్డలకు అన్నం, పాలు, పంచదార లేదా తెల్లని స్వీట్లు దానం చేయాలి.
శుక్రుడు తన స్థానాన్ని మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో మే 23వ తేదీన అంటే సోమవారం నాడు ఉదయం 8:39 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 18 జూన్ 2022 వరకు ఉదయం 8:28 గంటలకు నివాసం ఉండి అనంతరం వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ద్వాదశ రాశులలో ఏ రాశి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...