For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Shukra Rashi Parivartan 2022:మకరంలోకి శుక్రుడి రవాణా..ఏ రాశులపై ఎలాంటి ఫలితాలంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రుడి అనుగ్రహం ఉంటే మేధస్సు, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అంత గొప్ప శుక్రుడు ఈ నెలలో తన స్థానాన్ని మారనున్నాడు.

2022 సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10.13 గంటలకు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో మార్చి 31వ తేదీ ఉదయం 8:37 గంటల వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఈ సందర్భంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలొస్తాయి. ఇంతకీ ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ 4 రాశుల వారు 'ఆ' విషయంలో సూపర్ స్టార్ రజినీలా ఉంటారట..! మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి రావొచ్చు. ప్రభుత్వ సంబంధిత పనులు కూడా పూర్తవ్వొచ్చు. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి తొమ్మిదో పాదం గుండా శుక్రుడు ప్రయాణించనున్నాడు. ఈ సందర్భంగా మీరు మతం మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు. మీ నిర్ణయాలు, మీరు చేసే పనులకు ప్రశంసలు పొందుతారు. విదేశీ కంపెనీలలో సేవ లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలన్న ఆశ నెరవేరొచ్చు. సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఏదైనా ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు లేదా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయొచ్చు. పిల్లలకు సంబంధించిన ఆందోళన కూడా భంగం కలిగించొచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Mangal Rashi Parivartan 2022:కుజుడి రవాణాతో ఈ రాశులకు ప్రతికూలం..ఈ పరిహారాలు పాటించండి..!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి వివాహ సంబంధిత విషయాల్లో అడ్డంకులు తగ్గుతాయి. మీరు ఏదైనా ప్రభుత్వ టెండర్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, ఈ అవకాశం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఉన్న పెండింగ్ పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలుకు ఎక్కువ అవకాశం ఉంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానంలో మారనున్నాడు. ఈ సందర్భంగా సింహ రాశి వారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు రహస్య శత్రువులు ఎక్కువగా ఉంటారు. అయితే మీకు కోర్టు కేసులలో అనుకూల నిర్ణయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయాణం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం ద్వారా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు విశేష విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం వరం కంటే తక్కువ కాదు. కొత్తగా పెళ్లయిన దంపతులకు సంతానం గురించి శుభవార్త వినిపిస్తుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో తీవ్రత ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు సహకారం అందిస్తారు.

Shani Uday 2022:ఫిబ్రవరి 24 నుండి ఈ 5 రాశుల వారికి శని దేవుని అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుందట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. మీరు వాహనం కొనాలనుకుంటే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు స్నేహితులు మరియు బంధువుల నుండి కూడా శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఏదైనా ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే, ఆ కోణం నుండి గ్రహం యొక్క రవాణా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి మూడో స్థానంలో శుక్రుడు మారనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. మీరు విదేశీ కంపెనీల్లో సేవ లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మరోవైపు మీరు కుటుంబంలోని సీనియర్లు మరియు సోదరులతో విభేదాలు పెంచుకోవద్దు. మీ పనులు పూర్తయ్యే వరకు ఓపికగా ఉండాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి రెండో స్థానంలో శుక్రుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు ఆర్థిక ఒడిదుడులకులను ఎదుర్కోవచ్చు. అయితే మీ డబ్బును తిరిగి పొందుతారు. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు కూడా ఈ కాలంలో ముగుస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సహోద్యోగుల కుట్రలకు బలి అవ్వాల్సి ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించాలనుకుంటే ఆలస్యం చేయకండి. మీ వివాహానికి సంబంధించిన చర్చలు సఫలమవుతాయి. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రేమకు సంబంధించిన విషయాల్లో తీవ్రత ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి 12వ స్థానంలో శుక్రుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఖర్చులు అధికంగా ఉండొచ్చు. మీరు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి సంబంధించిన చర్చల్లో కాస్త ఆలస్యం జరగొచ్చు. మీ వ్యూహాలు మరియు ప్రణాళికలను గోప్యంగా ఉంచుకుంటే, మీరు మరింత విజయవంతమవుతారు. మీకు సంతానం గురించి ఓ శుభవార్త వినిపిస్తుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో శుక్ర సంచారం వల్ల మీకు అన్ని విధాలుగా సహాయకరంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీకు సీనియర్ కుటుంబ సభ్యులు మరియు అన్నయ్యల నుండి సహకార యోగం లభించొచ్చు. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

2022లో శుక్రుడు ఎప్పుడు తన స్థానాన్ని మారనున్నాడు?

శుక్రుడు 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10.13 గంటలకు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో మార్చి 31వ తేదీ ఉదయం 8:37 గంటల వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులలోని కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలొస్తాయి. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలొస్తాయి. ఇంతకీ ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలొస్తాయి.

English summary

Venus Transit in Capricorn on 27th February 2022 Effects on Zodiac Signs in Telugu

Shukra Rashi Parivartan February 2022 in Makara Rashi; Venus Transit in Capricorn Effects on Zodiac Signs in telugu : The Venus Transit in Capricorn will take place on 27 February 2022. Learn about remedies to perform in Telugu
Story first published:Thursday, February 24, 2022, 12:04 [IST]
Desktop Bottom Promotion