For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధనస్సు రాశిలోకి శుక్రుడి ఆగమనంతో.. ఏ రాశుల వారికి అనుకూలమంటే...!

ధనస్సు రాశిలోకి శుక్రుడి ఆగమనం చేసిన సమయంలో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది భూమికి అతి దగ్గరగా ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరూ శుక్రుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు.

Venus Transit in Sagittarius on 04 January 2021 Effects on Zodiac Signs in Telugu

ఎందుకంటే శుక్రుడు ఆనందం, సంతోషం, అందరి శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. అలాంటి శుక్రుడు నూతన సంవత్సరం 2021, జనవరి 4 తేదీన తెల్లవారుజామున 4:51 గంటలకు వృశ్చికరాశి నుండి ధనస్సురాశిలోకి ప్రవేశించనున్నాడు.

Venus Transit in Sagittarius on 04 January 2021 Effects on Zodiac Signs in Telugu

ఇదే రాశిలో సుమారు 30 రోజుల పాటు సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఈ సమయంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ఏదో ఒక ప్రభావం అనేది ఉంటుంది.

Venus Transit in Sagittarius on 04 January 2021 Effects on Zodiac Signs in Telugu

శుక్రుడు ఇలా ఒక రాశి నుండి మరో రాశిలోకి మారడం వల్ల ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల ప్రతికూలంగా ఉంటుంది.. శుక్రుడి అనుగ్రహం కోసం ద్వాదశ రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ ఏడాది ఏ రాశిచక్రం వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుందంటే...!ఈ ఏడాది ఏ రాశిచక్రం వారికి ప్రేమ జీవితంలో అద్భుతంగా ఉంటుందంటే...!

మేష రాశి..

మేష రాశి..

శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే సమయంలో మేష రాశి నుండి 9వ స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి విషయంలో ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారులు లేదా ఉద్యోగాలకు సంబంధించిన వారు జర్నీ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మీకు ఎక్కువ లాభాలుంటాయి. మరోవైపు శుక్రుడు సంచారం కారణంగా మీ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీ బడ్జెట్ విషయంలో బ్యాలెన్స్ గా ఉండేలా చూసుకోవాలి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం పరశురాముని అవతార కథను చదివితే శుభఫలితాలు వస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

శుక్రుడు ధనస్సు రాశిలోకి సంచారం సమయంలో ఈ రాశి నుండి ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు సానుకూలంగా ఉంటుంది. పని చేసే వారికి ఈ సమయంలో ప్రశంసలు, ధ్రువీకరణతో పాటు బహుమతులు మరియు మీ సీనియర్ మేనేజ్ మెంట్ మరియు ఉన్నతాధికారుల నుండి ఇంక్రిమెంట్లను పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు పాత అప్పులను తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే మీరేదైనా వస్తువులను కొనడం వంటి వాటి విషయాల్లో తొందరపడకూడదు. ఎందుకంటే అధిక ఖర్చులు అయ్యే ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఉంగరపు వేలికి తెల్లని ఓపాల్ లేదా వజ్రపు రాయి ఉండే ఉంగరాన్ని ధరిస్తే మంచి ఫలితాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఏడో పాదం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మిధున రాశి వారికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడి రవాణా వల్ల ఒంటరిగా ఉండే వారి జీవితంలో ప్రేమ వెలుగులు రావొచ్చు. మీ వాక్చాతుర్యంతో మీ భాగస్వామిని చాలా సులభంగా ఆకర్షిస్తారు. మీ సంబంధాన్ని నూతన దశకు తీసుకెళ్లొచ్చు. అయితే చిన్న విషయాలు మీ ఇద్దరి మధ్య కారణమవుతాయి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది.

పరిహారం : మహిళలకు అందానికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి.

కొత్త ఏడాదిలోని తొలి నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!కొత్త ఏడాదిలోని తొలి నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ లైఫ్ కి సరికొత్త బాటలు వేసుకోండి...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఆరో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఏదైనా పని చేయడానికి వెళితే చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ బంధువులతో తల్లిదండ్రుల ఆస్తిపై కొన్ని ఘర్షణలు మీ మనశ్శాంతికి కూడా భంగం కలిగిస్తాయి. అయితే మీరు సరైన సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోండి. వ్యాపారవేత్తలు కూడా కొత్త దాన్ని ప్రారంభించకుండా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు.

పరిహారం : సోమ మరియు శుక్రవారాల్లో తెల్లని వస్తువులు(బియ్యం, చక్కెర, పాలు, పిండి) దానం చేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు ఐదో స్థానం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగం చేస్తున్న ప్రజలకు ప్రయోజనాలు దక్కుతాయి. మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. మరోవైపు ఆస్తి లేదా ఇతర రకాల పనుల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతారు.

పరిహారం : మీరు ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు నాలుగో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కన్య రాశి వారికి ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. అయితే శుక్రుడి రవాణా కారణంగా మీ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ ప్రస్తుత ఆస్తి లేదా వాహనానికి కూడా జోడించవచ్చు. మీరు కీర్తి మరియు సంపదను పొందే అవకాశం ఉంది. తండ్రి, మరియు సీనియర్, ఉన్నతాధికారుల నుండి మీకు మంచి మద్దతు లభించే అవకాశం ఉంది. మొత్తమ్మీద శుక్రుడి రవాణా వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే లక్ష్మీ నారాయణ భగవంతుడిని ఆరాధించండి.

Rasi Phalalu 2021 : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి ‘ఆ'విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందట...!Rasi Phalalu 2021 : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి ‘ఆ'విషయాల్లో ప్రతికూలంగా ఉంటుందట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు మూడో స్థానంలో ప్రయణం చేయనున్నాడు. ఈ సమయంలో తుల రాశి వారికి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ తోబుట్టువులతో సంబంధాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు తక్కువ టైమ్ లో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. శుక్రుడి రవాణా సమయంలో మీరు చాలా తక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఈ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం కూడా ఉంటుంది.

పరిహారం : శుక్ర గ్రహం యొక్క ప్రయోజన ఫలితాలను పొందడానికి క్రిస్టల్ క్వార్ట్జ్ రోసరీ పూసలను ధరించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత జీవిత విషయానికొస్తే, మీరు అవివాహితులైతే, ఈ కాంలో వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పొందుతారు. మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది. ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. మరోవైపు మీరు మీ జీవిత భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపండి.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘అష్ట లక్ష్మీ' స్తోత్ర పారాయణం చేయండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశిలోకి శుక్రుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ వృత్తి పరంగా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు మార్పు కోసం చూస్తుంటే, ఉన్నత స్థానాలను పొందాలని ఆశిస్తుంటే, మీకు సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. శుక్రుడి రవాణా సమయంలో పేరు, కీర్తి మరియు సంపదను సంపాదించడానికి ఇది మీకు బలమైన సామర్థ్యాన్ని అందిస్తుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం శుక్ర మంతాన్ని జపించండి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పన్నెండో స్థానం నుండి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారు ఆర్థిక పరంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ముందుగా పెండింగులో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేసేస్తారు. విదేశీ సంస్థల కోసం పని చేసే ప్రజలకు ఒక మంచి అవకాశం రావొచ్చు. విదేశాల్లో చదువుకుని, స్థిర పడాలనుకునే వారికి కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘శ్రీ సూక్తం' పఠించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదకొండో స్థానం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారికి ఆదాయం, ఆస్తి పరంగా అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంగా మీకు ప్రతికూలంగా ఉంటుంది. వివాహ సంబంధాలలో ఉండే వారు ఆనందం, సామరస్యం మరియు సంత్రుప్తిపై పొరపాట్లు చేయవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంది. ఇది మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి లేదా ప్రియమైన వారు ఈ రవాణా ద్వారా ప్రయోజనాలు పొందొచ్చు.

పరిహారం : శుక్రుడి మంత్రం జపించడం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి శుక్రుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వాతావరణంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగులకు కూడా ఎలాంటి మార్పులు ఉండవు. అయితే మీరు స్థిరమైన మరియు నిరంతర ప్రయత్నాలను కొనసాగించండి. వ్యాపారులు ఈ సమయం లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మీకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే నుదిటిపై తెల్లని గంధం(విభూతి)ని రాసుకుంటే మంచి ఫలితాలొస్తాయి.

English summary

Venus Transit in Sagittarius on 04 January 2021 Effects on Zodiac Signs in Telugu

Here we talking about the venus transit in sagittarius effects on zodiac signs in Telugu. Read on,
Desktop Bottom Promotion