For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాబిల్లిపై విక్రమ్ జాడ దొరికింది.. కానీ కమ్యూనికేషన్ పై క్లారిటీనే..?

|

క్రికెట్ వరల్డ్ కప్ లో విజయం భారత్ దే అని అందరూ దర్జాగా ఉన్న సమయంలో చివరి బంతికి ప్రత్యర్థి జట్టు గెలిస్తే అభిమానులు ఎంతలా బాధపడతారో అందరికీ తెలిసిందే. జాబిల్లిపై మనం దాదాపు చేరామనుకుని ఆనందపడే సమయం ఆసన్నమైంది అనుకునే లోపే రెండు కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ ఆగిపోయినపుడు అంతకంటే ఎక్కువగా భారతీయులు బాధపడ్డారు. ఈ సందర్భంలో టిజన్లు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ సైతం ఇస్రో చీఫ్ శివన్ ను హత్తుకుని ఓదార్చిన సంగతి తెలిసిందే.

Chandrayaan 2

అయితే ఈ సందర్భంలోనే ఆదివారం జాబిల్లిపై జాడ దొరికినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో భారతీయుల ఆనందానికి అవధుల్లేవు. ఇక ట్విట్టర్లో ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందిస్తూ ట్వీట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లు తమదైన శైలిలో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రశంసించారు. విదేశాల నుండి మన శాస్త్రవేత్తలకు అభినందనలు లభించాయి. ఇజ్రాయెల్ దేశం కూడా ఇదేమంత సులభమైన పని కాదని, భారత శాస్త్రవేత్తలు గొప్ప ఘనత సాధించారని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది.

Chandrayaan 2

జాబిల్లిపై ల్యాండర్ విక్రమ్ ఆచూకీ దొరికిందని ఇస్రో చీఫ్ శివన్ ప్రకటించారు. అది సాఫ్ట్ ల్యాండింగ్ కాకుండా హార్డ్ ల్యాండింగ్ (నిర్దేశిత ప్రాంతంలో మృదువుగా కాకుండా నిర్ణీత వేగం కన్నా అధిక వేగంతో కిందికి జారిపోవడం) అయి ఉంటుందని ఇస్రో చీఫ్ అభిప్రాయపడ్డారు. ల్యాండర్ ఆచూకీ దొరకడమే కాదు చంద్రుడి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ తాలూకూ థర్మల్ ఫొటోను కూడా తీసిందని చెప్పారు. అంతా బాగానే ఉన్నప్పటికీ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆశించినంత స్థాయిలో లేదని తెలిపారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే ''భారతీయులందరూ నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ జరగలేకపోవడంతో మొత్తం మిషన్ ఫెయిల్ అయినట్టు కాదని తెలిపారు. అది వంద శాతంలో కేవలం ఐదు శాతమే వైఫల్యమేనన్నారు. కాబట్టి దాదాపు సక్సెస్ అయినట్టేనన్నారు.

Chandrayaan 2

అంతేకాదు ఈ మిషన్లో రెండు భాగాలున్నాయి. ఒకటి శాస్త్రీయ భాగం. రెండోది సాంకేతిక ప్రదర్శన భాగం. శాస్త్రీయ భాగాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ మిషన్ వందకు వంద శాతం సక్సెస్ అయినట్టే అని, ఎందుకంటే చందమామ మీదకు వెళ్లే మార్గం ఇప్పుడు మనకు చాలా సులువు అని, ఈ తరహా వనరులతో మరే ఇతర దేశం చంద్రయానాన్ని చేపట్టే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు. ఇలా చంద్రయానం చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు నెలకొల్పిందన్నారు.

Chandrayaan 2

ఇక సాంకేతిక ప్రదర్శన భాగం విషయానికొస్తే ఈ మిషన్ మూడు దశల్లో విజయవంతమైంది. చిట్టచివరిదైన సాఫ్ట్ ల్యాండింగ్ దశ మాత్రమే సాఫీగా జరగలేదు. చంద్రుడి కక్ష్యలో వంద కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న ఆర్బిటర్ మరో ఏడున్నర సంవత్సరాల పాటు చురుగ్గా పనిచేస్తూ ఖగోళ పరిశోధనలకు అవసరమైన సమాచారాన్ని పంపనుంది. అంతేకాదు చంద్రుడిపై నీటి జాడలనూ అన్వేషిస్తుంది.'' అని ఇస్రో చీఫ్ శివన్ వెల్లడించారు. అనంతరం తమ షెడ్యూల్ లో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నామని, ముఖ్యంగా గగన్ యాన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు.

Chandrayaan 2

అది హార్డ్ ల్యాండింగ్ వల్ల విక్రమ్ మాడ్యూల్ దెబ్బతిన్నదా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, కానీ విక్రమ్ తో సంబంధాలు ఏర్పరచుకునే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోమని తమ ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు. అయితే ఇది చాలా కష్టమైన పని అని, ఇందుకు అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Chandrayaan 2

మరో విషయమేమిటంటే ఒకవేళ హార్డ్ ల్యాండింగ్ అయినా విక్రమ్ సజావుగా నాలుగు కాళ్లపై నిటారుగా నిలబడినట్టుగా ఉంటే సోలార్ ప్లేట్ల సహాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, కానీ దానికి కూడా అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయిందని, అయినా అవకాశాలు తక్కువగా ఉన్నాయని సోలార్ ప్లేట్లలో విద్యుత్ ను ఉత్పత్తి చేసి, బ్యాటరీలను రీఛార్జి చేసే అవకాశాలు ఉన్నాయని మరో అధికారి తెలిపారు.

Chandrayaan 2

English summary

Chandrayaan 2: Vikram lander must have done a hard-landing, says Sivan

ISRO chief Sivan announced that Lander Vikram's whereabouts were found on Moon. The ISRO chief believes that it is a soft landing rather than a hard landing (sliding at a speed higher than a fixed speed rather than a softened area). Not only did the lander find the spot, but the orbiter of the Moon, Vikram Lander, also said that the thermal photo was taken. The communication system is not as good as expected, he said.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more