For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటివి మీరెప్పుడు చూసి ఉండరు... సర్జరీ సమయంలో వయోలిన్ వాయిస్తున్న రోడ్జర్ వీడియోపై ఓ లుక్కేయండి...

ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఫ్రిస్చ్ యథాతథంగా మళ్లీ వయోలిన్ ను ఎలాంటి సమస్య లేకుండా సజావుగా ప్లే చేస్తున్నాడు.

|

ఈ ప్రపంచంలో ఇప్పటివరకు మనం ఎన్నో వింతలు, విశేషాలను తెలుసుకున్నాం. ఇప్పటివరకు విశ్వవ్యాప్తంగా ఏడు వింతలు ఉన్నాయని కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే మరియు చూపబోయే విషయం గురించి ఇప్పటివరకు చాలా మందికి తెలీదు. ఎందుకంటే అది వింతలకే వింత కాబట్టి.

Violinist Plays Violin During His Brain Surgery

ఇంతకీ మ్యాటరేంటంటే... ఓ ఆసుప్రతిలో డాక్టర్ సీరియస్ గా సర్జరీ చేస్తుంటే.. ఆ రోగి మాత్రం తానే స్వయంగా హాయిగా వయోలిన్ వాయిస్తూ ఆస్వాదిస్తూ ఆపరేషన్ చేయించుకున్నాడు. వినడానికి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే పచ్చి నిజం. మీరు ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నారా? అయితే ఈ వీడియో చూడండి... కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు.... దీని ప్రకారం సాంకేతికత మరియు సంగీతం ఏ రేంజ్ లో ఊహించండి...

సంగీతం వింటూ సర్జరీ...

సంగీతంలోని సప్తస్వరాలకు కొండలైనా కరుగుతాయి అని మనం చాలా సినిమాల్లో డైలాగులను వింటూ ఉంటాం. అయితే సంగీతం వింటే మన సర్జరీ సమయంలో ఎలాంటి నొప్పి కలగదు అని నిరూపించాడు ఓ సంగీత ప్రియుడు. అతను ఏకంగా అతను సంగీతాన్ని స్వయంగా ఆస్వాదించడమే కాకుండా డాక్టర్లను కూడా అబ్బురపరుస్తూ సర్జరీ చేయించుకున్నాడు. దీన్ని బట్టి సంగీతానికి రోగాలను నయం చేసే పవర్ కూడా ఉందని చాలా మందికి తెలిసింది.

చేతులు చాలా ముఖ్యం...

చేతులు చాలా ముఖ్యం...

వయోలిన్ వాయిచడంలో చేతులు చాలా ముఖ్యమైనవి. వయోలిన్ లో మంచి నిపుణుడు అయిన రోడ్జర్ ఫ్రిస్చ్ కు అనుకోకుండా చేతులు వణకడం ప్రారంభించాయి. వయోలిన్ వాద్యకారుడైన అతనికి ఉన్నట్టుండి వయోలిన్ వాయించడం సరిగా కుదరలేదు. దీంతో ఒక వైద్యుడిని సంప్రదించాడు..

 ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

డాక్టర్ వద్దకు వెళ్లిన అతను నాడీ రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటని అడిగితే డాక్టర్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్పారు. ఇది న్యూరో సర్జికల్ విధానం. (ఇది మెదడు వశీకరణం, న్యూరో స్టిమ్యులేటర్)ను అవసరమైన కదలికలు, పార్కిన్సన్స్ వ్యాధి మరియు డిస్టోనియా వంటి కదలిక రుగ్మతలను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రోడ్ల ద్వారా లక్ష్యంగా చేసుకుంటుంది.

అప్పుడే వయోలిన్ వాయించమన్నారు..

అప్పుడే వయోలిన్ వాయించమన్నారు..

అమెరికాలోని మాయో క్లీనిక్ న్యూరల్ ఇంజనీరింగ్ ల్యాబ్ లో ఈ ఆపరేషన్ జరిగింది. సర్జన్లకు మెదడులో కచ్చితమైన వణుకుతున్న ప్రదేశాన్ని కనుగొనడం ఒక సవాలుగా మారింది. కానీ ప్రకంపనలు తేలికగా ఉన్నందున, సర్జన్లు లక్ష్యంగా చేసుకోలేకపోయారు. రోడ్జర్ మెళకువగా ఉండాలని వయోలిన్ వాయించి సహాయం చేయాల్సిన ఉందని వారు భావించారు. అప్పుడు ప్రకంపలను సులభంగా గుర్తించగలుగుతామన్నారు.

అత్యంత చాకచక్యంగా...

అత్యంత చాకచక్యంగా...

మెదడు సర్జరీ సమయంలో రోగిని మెళకువగా ఉంచడమనేది చాలా సాహసంతో కూడిన చర్య. అయితే డాక్టర్లు అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ ను పూర్తి చేశారు. వయోలిన్ వాయిద్యకారుడైన రోడ్జర్ కు తన ప్రొఫెషన్ తన సర్జరీకి ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు.

మళ్లీ సంగీతాన్ని...

మళ్లీ సంగీతాన్ని...

ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఫ్రిస్చ్ యథాతథంగా మళ్లీ వయోలిన్ ను ఎలాంటి సమస్య లేకుండా సజావుగా ప్లే చేస్తున్నాడు. వయోలిన్ వాయించే ముందు, డాక్టర్లు అతనికి ఇచ్చిన కంట్రోలర్ సహాయంతో పేస్ మేకరును ఆన్ చేస్తాడు.

ఇంతకుముందు ఓ ఇండియన్ కూడా...

ఇంతకుముందు ఓ ఇండియన్ కూడా...

రెండు సంవత్సరాల క్రితం భారతదేశంలోని బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కూడా న్యూరోలాజికల్ డిజార్డర్ సమస్యతో బాధపడుతుండేవాడు. ఇతనికి కూడా దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి డాక్టర్లు బ్రెయిన్ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు.

English summary

Viral Video of Violinist Plays Violin During His Brain Surgery To Help Doctor

Rodger Frisch, a violinist by profession plays the violin during his conscious brain surgery to help doctors identify the tremor spot in his brain. The surgery was a bit complicated, but was successful. Read about the story in detail.
Story first published:Friday, December 27, 2019, 12:27 [IST]
Desktop Bottom Promotion