For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీచక అధ్యాపకుడికి మళ్లీ బాధ్యతలా.. అందుకని ఆ విద్యార్థినులు ఏమి చేశారంటే..

|

తల్లిదండ్రులు తర్వాత గురువుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే గురువు తన శిష్యులను ప్రయోజకుల్ని చేస్తారని అందరి నమ్మకం. అయితే అదే గురువు అసభ్యంగా ప్రవర్తిస్తే తన శిష్యులు ఎవరితో చెప్పుకోవాలి. ముఖ్యంగా అభం శుభం తెలియని బాలికలపై, యువతులను పోకిరి ప్రొఫెసర్లు లోబర్చుకుంటున్న వైనాన్ని కూడా ఇది వరకే మనం చూశాం.

అయితే తాజాగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్ ను మళ్లీ విధుల్లోకి తీసుకోవడంతో విద్యార్థినులు అతడిని క్లాసు నుండి తరిమేశారు. అనంతరం యూనివర్సిటీ అధికారులపై మండిపడ్డారు. మరోవైపు నాటింగ్ హామ్ పోలీసులు కూడా మహిళలకు సంబంధించి మరో అభ్యంతరకర పోస్టును ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అయితే మహిళలు ఈ పోస్టుపై మండిపడటంతో వెంటనే దాన్ని డిలీట్ చేశారు. తమ తప్పును తెలుసుకుని మహిళలకు బేషరత్తుగా క్షమించాలని కోరారు. అసలు పోలీసులు ఎందుకు అలా చేశారో.. ఆ కీచక ప్రొఫెసర్ వివరాలేంటో తెలుసుకునేందుకు ఈ స్టోరీని చూడండి...

గురువుల ముసుగు..

ఈ విశ్వంలో ఎందరో కీచకులు గురువుల ముసుగు వేసుకుని జీవిస్తున్నారు. వీరిలో ఒకరైన సహోత్రా సర్కార్. ఈయన ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్. గతంలో లైంగికంగా విద్యార్థినులను వేధించాడనే ఆరోపణలు కూడా నిజమయ్యాయి.

ఆ కీచకుడికి మళ్లీనా...

ఆ కీచకుడికి మళ్లీనా...

విద్యార్థినులకు డబ్బు ఆశ చూపి వారిని నగ్న చిత్రాలు అడగడం, తనతో కలిసి నగ్నంగా స్విమ్మింగ్ చేయాలని వేధించడంతో పాటు క్లాసులకు సంబంధించిన మీటింగులను బార్లలో పెట్టడం వంటి విక్రుత పనులు చేసిన ఆ కీచకుడిని 2017లో తొలగించారు. అయితే అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకోవటంతో అక్కడి విద్యార్థినులు మరోసారి రెచ్చిపోయారు.

అతడు అనర్హుడు..

అతడు అనర్హుడు..

ఈయన పాఠాలు చెప్పే పంతులు కాదని, ఇతనికి విలువలు ఏ మాత్రం లేవని, ఈయన ఈ వ్రుత్తికి అనర్హుడని తేల్చి చెప్పారు. అంతటితో ఆగకుండా సహోత్రానే కాదు యూనివర్సిటీలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క కీచకుడిని డ్యూటీ నుండి తొలగించేందుకు తమకు సహకరించాలని ప్రతి క్లాసుకు వెళ్లి విద్యార్థులను కోరారు. వారు కూడా వీరికి పూర్తిగా సహకరించారు.

అక్కడ కొత్తేమీ కాదు..

అక్కడ కొత్తేమీ కాదు..

టెక్సాస్ యూనివర్సిటీలో ఇలాంటి లైంగిక ఆరోపణలు కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితమే అక్కడ దాదాపు 445 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఆ రోజులు పోయాయి...

ఆ రోజులు పోయాయి...

‘ఇలాంటివి చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాని నాకు అనిపిస్తోంది‘.. ‘నేను మీకు సవినయంగా చెప్పదలచుకున్నది ఏమిటంటే.. ప్రస్తుతం మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇంతకుముందు లాగా ప్రతి దానికీ మహిళలపై నెట్టి వేసే రోజులు పోయాయి‘.. ఇవి నాటింగ్ హామ్ పోలీసులు తమ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఒక పోస్టుకు కొందరు మహిళలు చేసిన కామెంట్స్.

పురుషాధిక దుశ్చర్య..

పురుషాధిక దుశ్చర్య..

రాత్రి వేళ ఒక మహిళ ఒంటరిగా వెళ్తుంటే ఆమె వెనుక ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్తున్నట్లు నాటింగ్ హామ్ పోలీసులు తమ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ పోస్టులో ఉచిత సలహా సైతం ఇచ్చారు. మహిళలు సురక్షితంగా ఉండాలంటే ఇలా ఒంటరిగా రాత్రి పూట వెళ్లడం మంచిది కాదని ఆ పోస్టులో పెట్టారు. దీన్ని చూసిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఒక పురుషాధిక దుశ్చర్య అని విమర్శించారు.

ట్వీట్ల మోత..

ట్వీట్ల మోత..

PC

ప్రపంచంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు మహిళలే కారణం అన్నట్టుగా నాటింగ్ హామ్ పోలీసుల చర్య ఉందని నెటిజన్లు ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో మారాల్సింది పురుషులే అని కొందరు మహిళలు ట్వీట్ చేశారు.

ఆలస్యంగా అప్రమత్తం..

ఆలస్యంగా అప్రమత్తం..

దీన్ని ఆలస్యంగా గమనించిన నాటింగ్ హామ్ పోలీసులు తమ పోస్టు నిరాధారమైనది అని పేర్కొని దాన్ని వెంటనే తొలగించేశారు. అంతే కాదు తమ పోస్టు వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమాపణ చెబుతున్నట్లు మరో పోస్టు ద్వారా తెలిపారు.

English summary

Viral Video : Students chased a professor accused of sexual misconduct out of his classroom

The college students chased a professer accused of sexual misconduct out of his classromm. Take a look