For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ఎఫెక్ట్ : అక్కడ చేతులు కడుక్కుంటేనే బస్టాండులోకి ప్రవేశం...

|

ప్రస్తతుం కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం వణికిపోతోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఎన్నో దేశాల్లో.. ఎన్నో రంగాల్లో తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పాటు మన దేశం కూడా ఈ వైరస్ బారిన పడింది.

ఇంతవరకు మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ఓ వ్యక్తి కరోనా బారిన పడి మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ రోగానికి మందు దొరకకపోవడంతో ప్రపంచంలోని దేశాలన్నీ తలలు పట్టుకుంటున్నాయి.

Image Curtosy

దీంతో అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ రాకుండా ఆఫ్రికా ఖండంలోని ఓ చిన్న దేశం తీసుకున్న జాగ్రత్తల గురించి మీరు ఔరా అనాల్సిందే. ఈ దేశం ప్రపంచంలోని అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అన్ని దేశాల్లో శరవేగంగా వ్యాపించిన ఈ వైరస్ ఆ దేశంలోకి ఇప్పటివరకు కనీసం ఇప్పటివరకు అడుగు పెట్టలేకపోయింది. ఇప్పటికీ ఆ దేశంలో కరోనా జాడ కనిపించకపోవడంతో అక్కడ అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...

ముందస్తు జాగ్రత్తలు..

ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం రువాండా. ఆ దేశంలోకి కరోనా వైరస్ వ్యాపించకుండా వారు తీసుకున్న ముందు జాగ్రత్తలు.. ఆ దేశ ప్రజల అవగాహన వల్ల కరోనా వారి దరికి చేరలేదు. ఇంతకీ వారు ఏయే చర్యలు తీసుకున్నారో చూడండి...

ప్రతి బస్టాండులోనూ..

ప్రతి బస్టాండులోనూ..

Image curtosy : Twitter

కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే చేతులు శుభ్రపరచుకోవడం. రువాండా దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే. అందుకోసం ప్రతి బస్టాండులోనూ ప్రత్యేకంగా పోర్టబుల్ వాష్ బేసిన్ లు ఏర్పాటు చేశారు. చేతులు కడుక్కుంటేనే బస్టాండులోకి ప్రవేశం లభిస్తుంది.

పరిశుభ్రత విషయంలో..

పరిశుభ్రత విషయంలో..

Image Curtosy : Twitter

పచ్చదనం.. పరిశుభ్రత విషయంలో రువాండ దేశానికి మంచి రికార్డే ఉంది. 1994లో భయంకరమైన మారణహోమంతో అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్న ఆ దేశం క్రమంగా పుంజుకుంటూ వచ్చింది.

వేగంగా మెరుగవుతున్న దేశాల్లో..

వేగంగా మెరుగవుతున్న దేశాల్లో..

Image Curtosy : Twitter

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నివేదికల ప్రకారం ఆఫ్రికాలో వేగంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న దేశాల్లో రువాండా ఒకటిగా నిలిచింది.

స్వచ్ఛంగా శుభ్రపరుస్తారు..

స్వచ్ఛంగా శుభ్రపరుస్తారు..

ప్రతి నెలా చివరి శనివారం రువాండా ప్రజలు ‘ఉముగాండా‘ అనే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. ఆరోజు అందరూ కలిసి వీధులు, ఇతర బహిరంగ ప్రదేశాలను శుభ్రపరుస్తారు. అక్కడ ఇది ఒక చట్టంగా చేయబడింది.

ప్లాస్టిక్ బ్యాన్..

ప్లాస్టిక్ బ్యాన్..

మన తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. అయినా ఇది సక్రమంగా అమలు కావటం లేదు. అయితే ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం అక్కడ పదేళ్ల క్రితం నుంచే అమల్లో ఉంది. ఈ దేశంతో ఆఫ్రికాలోనే పరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్.

పర్యావరణ పరిరక్షణలోనూ..

పర్యావరణ పరిరక్షణలోనూ..

పర్యావరణ పరిరక్షణలోనూ రువాండ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. వన్యప్రాణులు, నేచర్ ను కాపాడుకునేందుకు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతోంది.

సురక్షితమై దేశం..

సురక్షితమై దేశం..

అంతేకాదు ఆ దేశం ఆఫ్రికాలో అత్యంత సురక్షితమైన దేశంగా పేరు తెచ్చుకుంది. అక్కడ క్రైమ్ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కరోనా వైరస్ భయం వల్ల ముందస్తు చర్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు విదేశీ పర్యాటకులపై నిషేధం విధించడం తెలిసిందే..

ఎలాంటి ఆంక్షలు లేవు..

ఎలాంటి ఆంక్షలు లేవు..

ఈ రువాండ మాత్రం పర్యాటకులపై ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు అనేదే విధించలేదు. అంతేకాదు తమ దేశానికి సంబంధించి పర్యాటకులకు సాధారణ సేవలు యధావిధిగా కొనసాగుతాయని కూడా ప్రకటించడం గమనార్హం.

English summary

Watch: Rwanda’s radical idea to get people to wash hands

Here are the rwanda's radical idea to get people to wash hands. Take a look
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more