For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా వల్ల ఇంట్లోనే ఇరుక్కుపోయారా? అయితే ఇవి ట్రై చెయ్యండి... ఎంటర్ టైన్మెంట్ పొందండి....

కరోనా వైరస్ వల్ల ఇంట్లో ఉండే వారి కోసం టైం పాస్ అయ్యేందుకు ఉన్న మార్గాలెంటో చూడండి.

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం అంతా ఇంతా కాదు. చైనాలోని వూహాన్ నగరం నుండి విశ్వ వ్యాప్తంగా శరవేగంగా విస్తరించిన ఈ కరోనా మహమ్మారి చిన్నపిల్లాడి నుండి పండు ముసలాడి వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఈ కరోనా దెబ్బకు ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 8 వేలకు పైగా చనిపోయినట్లు, లక్షలాది మందికి కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Ways you can keep yourself entertained at home during coronavirus

మన దేశంలో కూడా ఇప్పటివరకు 400 మందికి పైగా పాజిటివ్ కేసులు రాగా, 10 మంది వరకు మరణించారు. అయితే మనకు ఒక శుభవార్త ఏంటంటే కొంతమంది కరోనా బారిన పడినప్పటికీ క్వారంటైన్ పరీక్షలు, తగిన చికిత్సలు పాటించి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో తొలుత జనతా కర్ఫ్యూ అని, ఆ తర్వాత వెంటనే లాక్ డౌన్ ను బలవంతంగా అమలు చేయడం ప్రారంభించారు.

Ways you can keep yourself entertained at home during coronavirus

దీంతో అందరూ ఇళ్లకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజుల వరకు ఇంట్లో ఎలా గడపాలని ఆలోచిస్తున్నారా? ఈ చిట్కాలను పాటించండి. ఈ పది రోజుల్లో ప్రతిరోజూ పండుగలా చేసుకోండి...

మీకిష్టమైన పుస్తకం..

మీకిష్టమైన పుస్తకం..

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా బడి, గుడి, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ తో అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ మూసివేయబడ్డాయి. అనేక మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుండే పని చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో కూడా వ్యక్తుల మధ్య సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు సూచించాయి. ఎవరికైనా 24 గంటల పాటు నాలుగు గోడల మధ్య గడపడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదే బెటర్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పుస్తకాలను చదివేయండి. వీలైతే వంటల పుస్తకాలను చూసి, లేదా వీడియోలను చూసి కొత్త కొత్త వంటలను ట్రై చెయ్యండి. దీని వల్ల మీకు కొంతవరకు విసుగు అనిపించదు.

వ్యాయామం..

వ్యాయామం..

మీరు ఎలాగో ప్రస్తుతం ఎక్కువసేపు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే వ్యాయామం చేయండి. ఎక్సర్ సైజ్ చేయడానికి మీ ఇంటికన్నా గొప్ప ప్రదేశం ఏది లేదని గుర్తుంచుకోవాలి. అలాగే యోగా కూడా ప్రయత్నించొచ్చు. ఒక చాపను తీసుకోండి. ఎక్సర్ సైజ్ లేదా యోగా సంబంధించిన వీడియోలను చూడండి. వాటిని ప్రయత్నించండి. ఎందుకంటే మీ శరీరాన్ని ఇంట్లో కదిలించడం అనేది ఎల్లప్పుడూ గొప్ప ఆలోచన అవుతుంది.

రంగులు వేయండి..

రంగులు వేయండి..

మీరు కరోనా వైరస్ విషయం గురించి డైవర్ట్ అవ్వడానికి కలరింగ్ పుస్తకాలు మీకు ఎంతగానో సహాయపడతాయి. మీకు నచ్చిన రంగులను ఆ పుస్తకాల్లో గీసేయండి. మీరు ఇష్టపడే వాటిపై పెయింట్ వేసేయండి.

వంట చేయండి..

వంట చేయండి..

మీరు ఇంట్లో ఉన్న సమయంలో మీకు తెలిసిన వంటలను ప్రయత్నించండి. మీ ఇంట్లో వారికి మీ చేతి రుచి చూపించండి. మీరందరూ కలిసి భోజనాన్ని చేయండి. ఇలా మీరు ఇంట్లో తయారు చేసిన పోషకాహారాన్ని తీసుకుంటే, మీకు మంచి అనుభూతి కలుగుతుంది.

ఇదే సరైన అవకాశం..

ఇదే సరైన అవకాశం..

మీకు ఇంట్లో ఇంతకంటే సరైన అవకాశం మళ్లీ మళ్లీ రాదు అని అనుకోండి. మీరు మీ రక్తప్రసరణ మెరుగుపరుచుకునేందుకు జాడే రోలర్ ను ఉపయోగించండి. మీ గోళ్లను కూడా కత్తిరించండి. దీని వల్ల మీరు సెలూన్లకు వెళ్లాల్సిన పని కూడా ఉండదు. మీరు ఇంట్లోనే ఉండి మణి-పెడి సేషన్ వంటివి కూడా చేసుకోవచ్చు.

భావప్రాప్తి కోసం..

భావప్రాప్తి కోసం..

ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో మీరు మానవులతో సంబంధాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. మీ ఎదుట లేదా మీకు దగ్గర్లో మీ భాగస్వామి ఉన్నప్పటికీ.. మీరు తగినంత దూరం పాటించాలి. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా మీరు హస్త ప్రయోగం వంటివి ప్రయత్నించి ఆనందించొచ్చు. అయితే మీరు పరిశుభ్రతను కూడా పాటించాలి. ముఖ్యంగా మీ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవాలి.

స్వచ్ఛభారత్..

స్వచ్ఛభారత్..

ప్రతి రోజూ మీ ఇంట్లో స్వచ్ఛభారత్ చేయండి. స్వచ్ఛభారత్ అంటే ఆల్కహాల్ వంటి వాటితో మీ ఫోన్ మరియు ల్యాప్ టాప్ లేదా టివితో పాటు ప్రతిరోజూ మీరు తరచుగా ఉపయోగించే వాటిని శుభ్రం చేయండి. అలాగే మీ గదిని, మీ బిల్డింగును క్లీన్ చేయండి. దీన్ని రోజువారీ పనిగా పెట్టుకోండి.

కఠినమైన పజిల్..

కఠినమైన పజిల్..

మీరు పజిల్స్ కలపడం వంటి వాటిని ట్రై చెయ్యండి. అయితే సులభమైనవి తీసుకోకుండా.. కఠినమైన పజిల్స్ ను తీసుకోండి. దీని వల్ల మెదడు కండరాలు బాగా పని చేస్తాయి. మీకు మంచి టైంపాస్ కూడా అవుతుంది.

ఇండోర్ గేమ్స్..

ఇండోర్ గేమ్స్..

మీ ఇంట్లో ఇద్దరు లేదా నలుగురు సభ్యులుంటే.. మీరు క్యారమ్ బోర్డు వంటి ఆటలను ప్రయత్నించొచ్చు. ఈ క్యారమ్ బోర్డు గేమ్ లో కూడా పాయింట్స్ వంటివి ఆడటం వల్ల మంచిగా కాలక్షేపం అవుతుంది. అలాగే చదరంగం వంటి వాటిని కూడా ఆడొచ్చు. దీని వల్ల మీ మెదడు చురుకుగా పని చేస్తుంది. కార్డ్స్ కూడా ఆడవచ్చు. ఇవి అత్యంత కాలక్షేపం కలుగజేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బెట్టింగ్ వంటి ఆటలను మాత్రం ఆడకండి సుమా...

జాగ్రత్తలు పాటించండి..

జాగ్రత్తలు పాటించండి..

మీరు ఇప్పటికే చాలా విషయాలను చూశారని మేము ఆశిస్తున్నాం. అయితే ఈ కరోనా వైరస్ ను తగ్గించడంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. మీ చేతులను ఇరవై సెకన్ల పాటు సబ్బుతో కచ్చితంగా కడగండి. మీ చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ను వాడండి. సామాజిక దూరాన్ని పాటించండి. కచ్చితంగా అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయండి. తుమ్ములు లేదా దగ్గు వల్ల అంటువ్యాధులు సోకకుండా మాస్కులను లేదా కర్చీఫ్ లను ధరించండి. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండండి. మీరు సురక్షితంగా ఉండండి.. దేశ రక్షణలో మీరు కూడా భాగస్వాములు కండి...

English summary

Ways you can keep yourself entertained at home during coronavirus

Here are the ways you can keep yourself entertained at home during coronavirus. Take a look
Desktop Bottom Promotion