Just In
- 2 hrs ago
Today Rasi Phalalu :ఈ రోజు కొన్ని రాశుల వారికి అదృష్టం మరియు కోరికలు నెరవేరే సమయం
- 13 hrs ago
ఎంత నీళ్ళు తాగినా మరుసటి నిమిషంలో దాహం వేస్తుందా? అప్పుడు మీకు ఈ వ్యాధి రావచ్చు...!
- 15 hrs ago
మీ భర్త లేదా భార్య కోపంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ మాట అనకండి!
- 17 hrs ago
దోసకాయను తొక్కతో ఎందుకు తినకూడదు?... అలా తింటే ఏమవుతుంది?...
Don't Miss
- News
19 నుంచి ఏపీ అసెంబ్లీ - డిప్యూటీ ఎన్నిక : అసెంబ్లీకి చంద్రబాబు ..!!
- Sports
Sanjay Manjrekar: రిషబ్ పంత్ మునుపటిలా అరవట్లేదు.. కాస్త సీరియస్గా కీపింగ్ చేస్తున్నాడు
- Finance
RBI's decision on currency notes: కరెన్సీ నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
- Movies
Aamir Khan మూవీ రైట్స్ అల్లు అరవింద్ చేతికి.. నాగచైతన్య కోసం ఎంత చెల్లించారంటే?
- Technology
2023 లో SmartPhones ధరలు మరింత ప్రియం కానున్నాయా!
- Travel
మన తెలంగాణలోనూ ఓ నయాగర జలపాతం ఉందండోయ్!
- Automobiles
ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా "విటారా" హైబ్రిడ్ ఎస్యూవీ, జులై 20న లాంచ్!
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కష్టంగా ఉండొచ్చు. ఈ కాలంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీకు డబ్బు విషయంలో ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. మరి కొన్ని రాశుల వారికి ఈ వారంలోని ప్రారంభ రోజులు ప్రతికూలంగా ఉండొచ్చు.
మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. పనికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇలా అన్ని రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది? ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది.. అన్ని రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
Shukra
Gochar
May
2022:మేషంలోకి
శుక్రుని
ప్రవేశంతో..ఈ
రాశులకు
లక్ష్మీదేవి
అనుగ్రహం
లభిస్తుంది...!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో కష్టంగా ఉండొచ్చు. ఈ కాలంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీకు డబ్బు విషయంలో ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. వారంలోని ప్రారంభ రోజులు ప్రతికూలంగా ఉండొచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. పనికి సంబంధించి కొనసాగుతున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలొస్తాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :12
లక్కీ డే : బుధవారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలు రావొచ్చు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈ కాలంలో విజయం సాధించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక పరిస్థితిలో కొంత మెరుగుదల ఉంటుంది. మీరు ఉన్నత పదవిని పొందడానికి ఏదైనా కొత్త కోర్సు మొదలైన వాటిని చేయాలనుకున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ తల్లిదండ్రులతో కలిసి మతపరమైన యాత్రను చేపట్టే అవకాశాన్ని పొందొచ్చు. మీ వైవాహిక జీవితంలో కొత్త మలుపు ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చుతో కూడుకున్నది. ఆరోగ్యం విషయంలో ఈ కాలంలో మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :8
లక్కీ డే : శుక్రవారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం తమ జీవిత భాగస్వామితో గడిపేందుకు సమయం దొరుకుతుంది. మీరు ఈ కాలంలో ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే మంచి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉద్యోగులకు కొత్త మార్గాలు రావొచ్చు. ఈ కాలంలో మీపై బాధ్యతల భారం ఎక్కువగా ఉండొచ్చు. వ్యాపారులు డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పెద్ద వ్యాపార నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలించాలి. ఈ కాలంలో మీ ఆందోళన పెరగొచ్చు. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :20
లక్కీ డే : శనివారం
ఈ
6
రాశుల
వారు
ప్రేమ
విషయంలో
చాలా
లక్కీ...!
ఈ
జాబితాలో
మీ
రాశి
ఉందా?

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే, ఈ కాలంలో మీ డబ్బును తిరిగి పొందే బలమైన అవకాశం ఉంది. ఈ వారంలో చిన్న ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు కార్యాలయంలోని ఉన్నతాధికారులతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాలి. మీరు వివాహం చేసుకున్నట్లయితే, ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ డే : సోమవారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)
ఈ రాశి వారు ఈ వారం ప్రతికూల ఆలోచనలు చేయకండి. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు కష్టపడి పని చేయాలి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. తొందరపాటులో తీసుకున్న తప్పుడు నిర్ణయం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు కొత్త కస్టమర్లతో కనెక్ట్ అవ్వబోతున్నట్లయితే, కచ్చితంగా మీ పరిశోధనను పూర్తి చేయండి. ఉద్యోగులకు ఈ కాలంలో చాలా లక్కీగా ఉంటుంది. మీరు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినొచ్చు. ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించకండి.
లక్కీ కలర్ : డార్క్ గ్రీన్
లక్కీ నంబర్ :11
లక్కీ డే : మంగళవారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)
ఈ రాశి వారు ఈ వారం తమ వ్యక్తిగత విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోనివ్వకండి. లేదంటే మీ సమస్యలు తగ్గుతాయి. ఈ కాలంలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే, కచ్చితంగా మీ ప్రియమైన వారి నుండి సలహా తీసుకోండి. చిన్న వ్యాపారులకు ఈ వారం చాలా మంచిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :9
లక్కీ డే : ఆదివారం
Astro
Tips
for
Money:ఈ
చిట్కాలతో
మీ
సంపద
రెట్టింపు
అవ్వడం
ఖాయం...!

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)
ఈ రాశి వారు ఈ వారం పని మరియు వ్యక్తిగత జీవితంపై ఓ కన్నేసి ఉంచాలి. ఉద్యోగులు ఈ వారం పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే, ఈ వారం పరిష్కారం లభించొచ్చు. వ్యాపారవేత్తలు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఈ కాలంలో మీరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్య పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :16
లక్కీ డే : శనివారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. అయితే కొంత సమయ తర్వాత మీకు సమయం అనుకూలంగా మారుతుంది. ఉద్యోగులకు ఆఫీసులో ఉన్నతాధికారులతో మంచి సమన్వయం కూడా మెరుగుపడుతుంది. మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని కలలు కంటున్నట్లయితే, ఈ కాలంలో విజయం సాధించడానికి బలమైన అవకాశం ఉంది. వ్యాపారులు ఈ వారం పెద్ద ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ పనిలో సానుకూల మార్పులను చూడొచ్చు. మీ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :5
లక్కీ డే : గురువారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)
ఈ రాశి వారు ఈ వారం గతాన్ని మరిచపోయి కొత్తగా ప్రారంభించాలి. ఈ సమయం మీకు చాలా విలువైనది. కాబట్టి దీన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. పని విషయంలో ఈ వారం మంచిగా ఉండొచ్చు. ఉద్యోగులకు పని భారం కొంత ఎక్కువగా ఉంటుంది. మీరు మీ కోసం తగినంత సమయం కూడా పొందుతారు. వారం చివర్లో మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే తాజా పండ్లను, కూరగాయలను తీసుకోవాలి.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ డే : ఆదివారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)
ఈ రాశి వారికి ఈ వారం ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ ప్రియమైన వారి మధ్య ప్రేమ మరియు ఐక్యత పెరుగుతుంది. ఈ కాలంలో వివాహితులకు సమయం చాలా ముఖ్యమైనది. సంతానం కోసం ఎదురుచూసే వారికి ఈ కాలంలో శుభవార్త వినిపించొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :32
లక్కీ డే : బుధవారం

కుంభ రాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)
ఈ రాశి వారిలో ఈ వారం భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మెరుగుపడుతుంది. మీ వ్యాపారం కూడా వేగవంతమవుతుంది. వారం చివర్లో మీకు పెద్ద ఆర్థిక లాభాలొచ్చే అవకాశం ఉంది. బాస్ కూడా మీతో సంతోషంగా ఉంటారు. ఈ సమయం మీకు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. మీరు తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, అజాగ్రత్తగా ఉండొద్దు.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ :14
లక్కీ డే : గురువారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)
ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో కొత్త అవకాశాలొస్తాయి. మీరు ఉద్యోగం చేస్తే, ఈ సమయంలో మీరు ప్రమోషన్ పొందొచ్చు. మీకు ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కాబట్టి, మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక పరంగా చాలా ఖరీదైనది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవడానికి, మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆరోగ్య పరంగా ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్ రెడ్
లక్కీ నంబర్ :31
లక్కీ డే : శుక్రవారం
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.