For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Dreams : ఇంటి గురించి మీకు అలాంటి కలలొస్తే... ఏమని అర్థమో తెలుసా...

|

మనం నిద్రలోకి జారుకున్నాక ఏదో ఒక కల కచ్చితంగా వస్తుంది. కొందరికి మంచి కలలు వస్తుంటాయి. మరికొంతమందికి పీడ కలలు వస్తుంటాయి. అయితే ఇంకా కొంతమందికి మాత్రం కలలు అనేవి చాలా డిఫరెంట్ గా వస్తాయి. కొందరేమో రియాలిటీకి దగ్గరగా ఉండే కలలు కంటారు.

మరికొందరు తమకొచ్చిన కలలను మరచిపోతుంటారు. అయితే కొందరికి వచ్చే కలలు తమ లైఫ్ తో సంబంధం లేకుండా, కొత్త ఊహల్లో విహరించేలా ఉంటాయి. అలా మీరు కనే కలలో కొన్ని మంచిని సూచిస్తే.. మరికొన్ని భవిష్యత్తులో చెడును సూచిస్తాయి.

అయితే సాధారణంగా మనం పగలు ఎలాంటి విషయాల గురించి, ఆలోచిస్తూ ఉంటామో.. వాటి గురించే రాత్రి నిద్ర పోయినప్పుడు అలాంటి కలలే కంటూ ఉంటాం. అయితే మనలో చాలా మంది జీవితంలో ఒక్కసారైనా సొంతిల్లు నిర్మించుకోవాలనే కలను ప్రతి ఒక్కరూ కంటారు.

తమ ఫ్యామిలీతో కలిసి హాయిగా, సౌకర్యవంతంగా జీవించే ఇంటి కోసం ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు అలాంటి కలల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారు త్వరలో గగన విహారం చేసేస్తారు...!

ఇంటి గురించి..

ఇంటి గురించి..

మీరు నిద్రపోయినప్పుడు కొత్త ఇంటిని కట్టుకున్నట్టు కల వస్తే అది చాలా మంచి సంకేతమని భావించాలి. కలలో ఇల్లు కట్టుకోవడం మరియు చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీని వల్ల సమాజంలో మనకు గౌరవం పెరగడం, రాబోయే రోజులలో మీరు ఏదైనా పని నుండి గౌరవం, పురోగతిని పొందొచ్చు.

మంచి పార్ట్ నర్..

మంచి పార్ట్ నర్..

ఇలాంటి కలలు వస్తే భవిష్యత్తులో మీకు మంచి పార్ట్ నర్ కూడా మీ జీవితంలో వస్తుందని దీనికి అర్థమని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీ మనసు చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా జీవితంలో మీరు విజయం సాధిస్తారు.

హోమ్ డెకరేషన్..

హోమ్ డెకరేషన్..

మీకు కలలో మీ ఇంటిని డెకరేట్ చేస్తున్నట్లు ఉంటే.. అది చెడు సంకేతంగా భావించాల్సి ఉంటుదట. అలాంటి కలలను చెడు కలలుగా చెప్పొచ్చు. ఇలాంటి కలలు రావడం వల్ల రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ప్లాన్ లన్నీ ఘోరంగా దెబ్బతినొచ్చు. మీరు ఏదైనా పనులు ప్రారంభించినా కూడా వాటిలో ఆటంకాలు, అవరోధాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఆర్థిక సమస్యలు కూడా వెంటాడుతాయి.

Mars Transit in Taurus : కుజుడు వృషభంలోకి సంచారం... ఈ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుంది...!

ఇలాంటివి చూస్తే..

ఇలాంటివి చూస్తే..

మీరు కలలో ఎప్పుడైనా శిథిలావస్థలో ఉండే ఇంటిని గానీ.. లేదా పాడైపోయిన బంగ్లాను చూస్తుంటే.. వాటిని శుభప్రదంగా పరిగణించొచ్చు. ఇలాంటి కల వచ్చిందంటే భవిష్యత్తులో మీ సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మీరు చేపట్టే ఏదైనా కొత్త ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయొచ్చు. దీని ఫలితంగా అధికారుల ప్రశంసలు, పదోన్నతులు అందుకే అవకాశం ఉంటుంది.

ఇంట్లోకి అమ్మాయి వస్తే..

ఇంట్లోకి అమ్మాయి వస్తే..

మీరు కనే కలలో ఎవరైనా అమ్మాయి మీ ఇంట్లోకి వస్తున్నట్లు కలగంటే అది ఎంతో ప్రత్యేకమైనదిగా భావించాలి. ఇలాంటి కలలొస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి కలలు మిమ్మల్ని గొప్పవారిని చేయడమే కాకుండా సమాజంలో గౌరవ, ప్రతిష్టలు పెంచుకునేలా చేస్తాయని తెలుసుకోవాలి.

ఇంటికి తాళం వేసినట్లు..

ఇంటికి తాళం వేసినట్లు..

మీ కలలో తలుపు లాక్ చేసినట్లు కనిపిస్తే అది చెడు కలగా భావించాలి అలాంటి కలల వల్ల మీరు రాబోయే రోజుల్లో వ్యాపారంలో అస్థిరతను, ఇబ్బందులను సూచిస్తాయి. అంతేకాకుండా వ్యాపారంలో తీవ్రనష్టాలను, ఇబ్బందులు వచ్చే అవకాశముంటుందని తెలుసుకోవాలి. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాదు మీరు ఎక్కువ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

What does it mean to dream of building a new house?

Here we are talking about the what does it mean to dream of building a new house. Read on
Story first published:Tuesday, February 23, 2021, 12:11 [IST]
Desktop Bottom Promotion