Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎటువైపు ఉంచాలి, ఎటువైపు ఉంచితే మంచిదంటే
బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచేటప్పుడు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి, ఎక్కడ ఉంచితే ఇంట్లో శ్రేయస్సు, పరస్పర ప్రేమ ఉంటుది, బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్‌ను పెట్టడానికి ఎలాంటి వాస్తు నియమాలో పాటించాలో ఇప్పుడు తెలుస
ఇంట్లో ఏదైనా దాని స్థానంలో ఉంచితే ఇంటి సభ్యులకు శుభప్రదంగా భావిస్తారు. వాస్తు నియమాలను పాటిస్తూ ఇంట్లో ఏదైనా వస్తువును ఉంచినట్లయితే ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. అలాగే పడకగదిలో వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఉండటం అవసరమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మీరు పెళ్లి చేసుకున్నట్లయితే బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచేటప్పుడు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి, ఎక్కడ ఉంచితే ఇంట్లో శ్రేయస్సు, పరస్పర ప్రేమ ఉంటుది, బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్‌ను పెట్టడానికి ఎలాంటి వాస్తు నియమాలో పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.
దంపతులు ఉండే పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్‌ను బెడ్‌కు ఎదురుగా ఉంచకూడదు. మీ డ్రెస్సింగ్ టేబుల్‌కు అద్దం లేకపోతే ఎక్కడైనా ఉంచవచ్చు. కానీ అద్దం ఉంటే మాత్రం మంచానికి ఎదురుగా ఉంచకూడదు.
నిద్రపోతున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో దంపతుల ప్రతిబింబం లేదా బెడ్ ప్రతిబింబం కనిపించకూడదు. డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉంచిన అద్దం ఈ ప్రాంతంలో ఉంతే ప్రతికూల ప్రభావాలను సృష్టిస్తుంది. మరియు వివాదాలకు దారి తీస్తుంది.
2.
ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడానికి స్థలం లేకుండా బెడ్రూములో మాత్రమే ఉంచగలం. అలాంటి పరిస్థితుల్లో నిద్రపోయేటప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అద్దాన్ని టవల్‌తో, దుప్పటితో కప్పాలి.
3.
బెడ్రూములో నైరుతి మూలలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచొద్దు. ఇలా ఉంచితే వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. పడకగదిలో ఉంచిన అటువంటి డ్రెస్సింగ్ టేబుల్ యొక్క దిశ భాగస్వామితో గొడవలకు దారి తీస్తుంది.
4.
పడకగదిలో ఓవల్ లేదా గుండ్రని ఆకారపు డ్రెస్సింగ్ టేబుల్‌ను ఉంచడం మానుకోవాలి. అలాంటి ఆకారపు అద్దం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్‌ను ఇంట్లో వేరే రూముల్లో పెట్టుకోవచ్చు కానీ పడకగదిలో పెట్టొద్దు. గెస్ట్ రూము, స్టడీ రూము, హాల్ లో పెట్టవచ్చు. పడకగదిలో అలాంటి ఆకారం ఉన్న అద్దాలను, డ్రెస్సింగ్ టేబుల్ ఉంచితే ప్రతికూల ప్రభావం పడుతుంది.
5.
పడకగదిలో గాజు పగిలిన అద్దాలను, పగిలిన డ్రెస్సింగ్ టేబుల్‌ను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ రకమైన డ్రెస్సింగ్ టేబుల్ సంబంధాలలో చీలికలను సృష్టిస్తుంది.
6.
బెడ్రూములో ఉంచిన డ్రెస్సింగ్ టేబుల్ కు తూర్పు దిశ అత్యంత అనువైనదని వాస్తు శాస్త్రం చెబుతోంది. డ్రెస్సింగ్ టేబుల్ ను అలా ఉంచితే దంపతుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయి. పడకగదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచినట్లయితే దానిని తూర్పు దిశలో పెట్టడానికి ప్రయత్నించండి.
7.
బెడ్రూములో దక్షిణ దిశలో డ్రెస్సింగ్ టేబుల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉంచకూడదు. ఈ దిశ వైవాహిక జీవితంలో చీలికలను సృష్టిస్తుంది. దీని కారణంగా ఎటువంటి కారణం లేకపోయినా దంపతుల మధ్య గొడవలు జరుగుతాయి.
8.
బెడ్రూములో ఎప్పుడూ డ్రెస్సింగ్ టేబుల్ ను పడమర దిశలో ఉంచకూడదు. అలా ఉంచితే మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడూ అసంతృప్తి వెంటాడుతుంది. దీని వల్ల చేసే పనిలోనూ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
9.
బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడానికి చక్కని ప్రాంతం ఉత్తరం వైపు ఉండే గోడ. ఉత్తరం వైపు ఉండే గోడకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంచితే అంతా మంచే జరుగుతుంది. దంపతుల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా బంధం బలోపేతం అవుతుంది.
10.
బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచడంలో గుర్తుంచుకోవాల్సిన మరో విషయం. డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో బాత్రూము కనపడకూడదు. బాత్రూమ్ తలుపుకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉండకూడదు.
11.
బెడ్రూములో డ్రెస్సింగ్ టేబుల్ ఉంచేటప్పుడు అది నల్లని రంగులో ఉండకూడదని గుర్తుంచుకోవాలి. నలుపు రంగులో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ వల్ల దంపతుల మధ్య కలహాలు వస్తాయి.



Click it and Unblock the Notifications