Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు అస్సలే పెంచొద్దు, లేకుంటే తీవ్రంగా నష్టపోతారు
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో అస్సలే పెంచకూడదు. ఆ మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల దోషాలు తలెత్తి వివిధ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచకూడదో ఇప్పుడు తెలుసుకు
ఇంటి అలంకరణకు ఇండోర్ మొక్కలు చాలా బాగుంటాయి. కొంత మందికి ఇంట్లో పచ్చగా మొక్కలు నాటుకోవడం చాలా ఇష్టం. మొక్కలతో ఇంటికి అందంతో పాటు మనస్సుకు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. అయితే ఇంట్లో ఏ మొక్క పడితే ఆ మొక్క పెంచుకుంటే ఆరోగ్యంగానే కాకుండా వాస్తు పరంగా కూడా సమస్యలు వస్తాయి. తులసి, కలబంద వంటి మొక్కలు ఇంట్లో పెంచితే అటు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇటు వాస్తుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో అస్సలే పెంచకూడదు. ఆ మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల దోషాలు తలెత్తి వివిధ సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలు కారే మొక్కలు:
కొన్ని మొక్కల కొమ్మలు విరిచినప్పుడు పాల వంటి పదార్థం బయటికి వస్తుంది. అలాంటి మొక్కలను ఇంట్లో పెంచుకోవద్దు. అవి దురదృష్టాన్ని తెస్తాయి. ఇలాంటి మొక్కలను ఇంటి పరిసరాలతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా ఉంచకూడదు.

2. బోన్సాయ్:
బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా ఉంటాయి. భారీ వృక్షాలు కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో బోన్సాయ్ మొక్కలు పెంచుకోవద్దు. వీటి వల్ల కుటుంబసభ్యుల ఎదుగుదల ఉండదు. అభివృద్ధి చెందలేరు. బోన్సాయ్ మొక్కలు పెంచడం వల్ల కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడతారు.

3. కాక్టస్:
చిన్నగా చూడముచ్చటగా కనిపించే కాక్టస్ మొక్కలను చాలా మంది ఇష్టపడతారు. కానీ కాక్టస్ మొక్కలను ఇంట్లో పెంచుకోవద్దు. కాక్టస్ మొక్కలు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. కాక్టస్ మొక్కలు పెంచుకోవడం వల్ల కుటుంబసభ్యుల మధ్య కలహాలు జరుగుతాయి. ఒత్తిడి, ఆందోళన ఇబ్బంది పెడతాయి.

4. ఖర్జూరా:
ఖర్జూరా చెట్లను ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పెంచవద్దు. వాస్తు ప్రకారం ఖర్జూరా చెట్లను పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలూ వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కూడా వస్తాయి.

5. చింతపండు:
చింత చెట్లను ఇంట్లో పెంచుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. చింత చెట్లు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయి. చింత చెట్ల వల్ల కుటుంబసభ్యుల మధ్య కలహాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. కుటుంబసభ్యుల మధ్య ప్రశాంతత కొరవడుతుంది.

6. గోరింటాకు:
గోరింటాకు చెట్లను అశుభంగా భావిస్తారు. గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గోరింటాకు చెట్టు పెట్టుకోవద్దు.



Click it and Unblock the Notifications
