For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిగ్ బాస్ ఎప్పుడూ హాట్ టాపిక్ ఎందుకవుతుందో తెలుసా...

బిగ్ బాస్ షో ఎందుకంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

'బిగ్ బాస్'పరిచయం అక్కర్లేని రియాల్టీ షో... ఈ షో తెలుగుతో పాటు అన్ని లోకల్ లాంగ్వేజ్ లలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముందుగా హాలీవుడ్ లో ఆరంభమైన రియాల్టీ షో.. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకుంది.

Why Is Big Boss Reality Show So Popular in India

నాలుగో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది.. 'వాస్తవానికి ఈ షో మనసుషుల్లో ఉండే ఇతర రకాల సైకాలజీని స్టడీ చేసే ఒక ల్యాబరేటరీ' అంటూ అరవంలో బిగ్ బాస్ షో సీజన్-1ను కమల్ హాసన్ ప్రారంభించే సమయంలో ఓ ప్రొఫెసర్ మాటలను గుర్తు చేశాడు.

Why Is Big Boss Reality Show So Popular in India

కానీ 'సైకాలజీ స్టడీ చేసే ల్యాబ్ వేరు.. మనషుల సైకలాజికల్ పాయింట్స్ ని ప్రభావితం చేసేలా బంధించి వ్యాపారం చేయడం వేరు' అనే వారూ ఉన్నారు. ఇలాంటి వాటినన్నింటితోనూ సంబంధం లేదన్నట్లు ఈ బిగ్ బాస్ షోను అన్ని భాషల్లోనూ ప్రారంభ షో నుండి హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Why Is Big Boss Reality Show So Popular in India

అయితే దీనికి ఎందుకని ఇంతలా క్రేజ్ పెరుగుతోంది.. అసలు ఈ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఎక్కడ స్టార్టయ్యింది. మీడియా ఛానెల్స్, సోషల్ మీడియా వారు దీనిపై ఎందుకంత ఫోకస్ పెడుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ కాన్సెప్ట్ ని..

ఈ కాన్సెప్ట్ ని..

బిగ్ బాస్ రియాల్టీ షో కాన్సెప్ట్ ను నెదర్లాండ్స్ లోని డచ్ మీడియా కంపెనీ ద్వారా వెలుగులోకొచ్చింది. దీన్ని ఆ కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ కనిపెట్టారు. 1999లో మొదటిసారిగా ‘బిగ్ బ్రదర్' పేరుతో ప్రసారం అయ్యింది. సెలబ్రిటీల పర్సనల్ మ్యాటర్, వేష భాషలు, ప్రవర్తనను దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాల్టీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

సెలబ్రెటీ లైఫ్ స్టైల్..

సెలబ్రెటీ లైఫ్ స్టైల్..

సెలబ్రెటీలను మాములుగా ఉన్నప్పుడు చూసే అవకాశం రావడంతో దీనిని ప్రేక్షకులు ఎగబడి చూసేశారు. ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుండి కొనేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఎక్కువ టీఆర్పీలు..

ఎక్కువ టీఆర్పీలు..

ఆయా దేశాలు ఈ షోని మొదలుపెట్టిన వెంటనే ఇది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాదు టెలివిజన్ కు టీఆర్పీలని ఎక్కువగా తెచ్చేస్తోంది. దీంతో ప్రకటనల వ్యాపారం కోట్లలో జరిగింది. ఆ ప్రాఫిట్స్ లో సెలబ్రెటీలకు ఇచ్చే సొమ్ములు అసలు లెక్కలోకే రావు. అందుకే ఈ షోకు ప్రమోషన్ సైతం అదే స్థాయిలో ఉంటుంది.

అందరికీ లాభమే..

అందరికీ లాభమే..

ఈ బిగ్ బాస్ షో వల్ల కేవలం టివి వాళ్లకు మాత్రమే లాభమనుకుంటే మీరు తప్పులే కాలేసినట్టే. ఎందుకంటే దీని ఆధారంగా సోషల్ మీడియాలోనూ, టివి, యూట్యూబ్ లలోనూ చాలా వ్యాపారమే జరుగుతుంది. మీమ్స్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ పేజీలు, పెయిడ్ ఓటింగ్స్ చాలానే ఉంటాయి.

బెట్టింగులు కూడా..

బెట్టింగులు కూడా..

మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో విన్నర్ ఎవరంటూ ఇంతవరకూ బెట్టింగులైతే జరగలేదు కానీ.. ముంబైలో 2017 సంవత్సరంలో జరిగిన బిగ్ బాస్ షో విన్నర్ గురించి బెట్టింగులు కూడా బాగానే జరిగాయంట.

క్యాష్ చేసుకుంటున్నారు..

క్యాష్ చేసుకుంటున్నారు..

అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సెలబ్రెటీలను యూట్యూబర్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి మనీ జనరేట్ చేసే కమర్షియల్ ఫార్ములా చుట్టూ జరిగే చిన్న వ్యాపారాలు చాలానే ఉన్నాయి.

సింపతీ వర్కవుట్..

సింపతీ వర్కవుట్..

2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇండియా నుండి ఓ సెలబ్రెటీగా పాల్గొన్నారు. అందులో ఆమెపై ఇంగ్లీష్ లేడీ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. దీంతో ఇంగ్లీష్ లేడీపై వ్యతిరేకత, శిల్పాశెట్టి మీద సింపతీ బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో ఆ సీజన్ టైటిల్ విన్నర్ గా శిల్పా నిలిచింది. ఇదిలా ఉంటే మన ఇండియాలో ఈ షో మొదటిసారిగా 2006లో ప్రారంభమైంది. ఆ తర్వాత శిల్పాశెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ ఈ షోలకు హోస్టుగా చేయడంతో దీనిపై క్రేజ్ ఓ రేంజ్ కు వెళ్లింది.

రియాల్టీ షో కింగ్..

రియాల్టీ షో కింగ్..

కింగ్ ఆఫ్ రియాల్టీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. తమకు నచ్చిన వారిని ప్రమోట్ చేస్తూ కొందరు.. నచ్చని వారిని ట్రోల్ చేస్తూ.. ఇదంతా చెత్త షో అంటూనే దానిపై మాట్లాడుతూ ఉంటారు మరికొందరు. ఇలా అందరూ తిట్టుకుంటూ.. పొగుడుకుంటూ.. దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

గంగవ్వకు గ్లామర్..

గంగవ్వకు గ్లామర్..

ఇటీవల ప్రారంభమైన బిగ్ బాస్ షోలో అంత వయసున్న గంగవ్వను మామూలుగా అయితే తీసుకునే వారైతే కాదు. ఎందుకంటే ఇది ఎక్కువగా సినీ, టివి గ్లామర్ పైనే నడుస్తుంది. కానీ గంగవ్వను తీసుకుని గ్లామర్ ను యాడ్ చేస్తే తమ టీఆర్పీ ఎంతో పెరుగుతుందనే ప్లాన్ తో ఆమెను ఈ షోకు సెలెక్ట్ చేశారు. వారు ఊహించినట్టే రేటింగ్స్ బాగా పెరిగాయి. కానీ ఆమెను నాలుగు గోడల మధ్య బంధిస్తే కష్టమని సంగతి బిగ్ బాస్ టీమ్ ఊహించలేదు. ఆమె అనారోగ్యానికి గురికావడంతో మొదట్లో ఆమెను సెలెక్ట్ చేసిన బిగ్ బాస్ టీమ్ ను మెచ్చుకున్న ఆడియెన్స్.. ఇప్పుడు వారినే తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో మరింత కష్టపెట్టొద్దని, గంగవ్వను పంపాలని.. సోషల్ మీడియాలో బిగ్ బాస్ టీమ్ ని ట్యాగ్ చేసి మరీ పెట్టే పోస్టులూ బాగానే ఉంటున్నాయి.

English summary

Why Is Big Boss Reality Show So Popular in India

Here we talking about in India why is big boss show is so popular in telugu. Read on
Desktop Bottom Promotion