For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Food Safety Day 2020 : ఆహారంతోనే అందరికీ ఆయువు... ఆహార భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత..

ప్రపంచ ఆహార దినోత్సవం 2020 సందర్భంగా ఆహారం గురించి ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం...

|

ఆహారం అందరికీ జీవనాధారం.. మనుషులకైనా.. మూగజీవాలకైనా ఆహారం ఉంటేనే ఆయువు ఉంటుంది. ఈ విశ్వంలో జీవించే సమస్త జీవకోటి రాశికి గాలి, నిద్ర, సెక్స్ ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బతకలేడు.

World Food Safety Day 202

అయితే అలాంటి ఆహారాన్ని భద్రంగా నిల్వ చేయడం.. వాటిని దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ అందేలా చేయడం..అనేది ప్రభుత్వాల బాధ్యత. అయితే దీనికి ఐక్యరాజ్య సమితి కూడా తన వంతు ప్రయత్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

World Food Safety Day 202

ప్రజల్లో ఆహార భద్రతపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జూన్ 7వ తేదీన ఆహార భద్రతా దినోత్సవంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. అంతేకాదు 'The Future of Food Safety' అనే నినాదంతో జెనివాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్సులో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది.

World Food Safety Day 202

2019 సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

World Food Safety Day 2020

అయితే ఆహార భద్రత అంటే ఏమిటి? దీనికి ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మందారం టీ తాగితే బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ కంట్రోల్..గుండే, కాలేయ ఆరోగ్యం పదిలంమందారం టీ తాగితే బరువు తగ్గడమే కాదు, డయాబెటిస్ కంట్రోల్..గుండే, కాలేయ ఆరోగ్యం పదిలం

ప్రతి ఒక్కరి పాత్ర..

ప్రతి ఒక్కరి పాత్ర..

అయితే ఆహార భద్రత అనేది కేవలం ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత. అంతేకాదు మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదా కాదా అని రైతు నుండి కూలి వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది.

ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం..

ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం..

ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత కోసం తగు చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం, ఆహార కొరత సమస్య రాకుండా చూడటం. ప్రజలు అనేక రకాల వ్యాధులను, ముఖ్యంగా కరోనా మహమ్మారి వంటి వాటిని ఎదుర్కోనేందుకు పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చేయడం తమ ప్రధాన ఎజెండాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది.

ఆహార భద్రత అంటే?

ఆహార భద్రత అంటే?

ఆహార భద్రత అంటే ఆహారం పాడవ్వకుండా సురక్షితంగా నిల్వ ఉంచడం. దాని కంటే ముందు ఆహారాన్ని ఉత్పత్తి చేయడం.

మీ శరీరంలో విటమిన్ సి తక్కువైందని సూచించే లక్షణాలు, ఇమ్యూనిటీలోపంతో ప్రమాదకర ఆరోగ్య సమస్యలు..మీ శరీరంలో విటమిన్ సి తక్కువైందని సూచించే లక్షణాలు, ఇమ్యూనిటీలోపంతో ప్రమాదకర ఆరోగ్య సమస్యలు..

ఎందుకు ముఖ్యమైనది..

ఎందుకు ముఖ్యమైనది..

ఆహార భద్రతకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారంటే... మనం శక్తివంతంగా తయారవ్వడానికి పౌష్టిక ఆహారం అవసరం. ఆహారం భద్రత లేకుండా, సరైన సమయానికి సరైన ఆహారం తీసుకకపోతే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గణాంకాల ప్రకారం ప్రతి ఏటా 600 మిలియన్ల కేసులు మరియు 4,20,000 మరణాలు ఆహార వ్యాధుల కారణంగా సంభవించాయి. అవి అసురక్షిత ఆహారం కారణంగా సంభవిస్తాయి.

చిన్నారుల మరణాలే..

చిన్నారుల మరణాలే..

ఈ ఆహార మరణాలలో ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలే దాదాపు 30 శాతం ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. మీరు ఆహారాన్ని కలుషితం కాకుండా, నిరోధించడానికి మరియు ఆహారం విషం కాకుండా శుభ్రంగా ఉంచేందుకు ఆహార భద్రత చాలాచాలాముఖ్యమైనది.

పరిశుభ్రతే ప్రధానం..

పరిశుభ్రతే ప్రధానం..

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పరిశుభ్రత పాటించడం. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత.. తర్వాత ఆహారాన్ని సరైన ప్రదేశంలో నిల్వ చేయడం. ఆహారం తయారు చేసేటప్పుడు కలుషితాన్ని తగ్గించేందుకు ప్రయత్నించడం. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే.. మీరు.. మీ కుటుంబసభ్యులందరూ సురక్షితంగా ఉంటారు.

English summary

World Food Safety Day 2020 date, theme and Significance

World Food Safety Day is observed on 7 June every year. Washing hands with soap and water before handling any food items, washing fruits and veggies before peeling and cooking raw meat thoroughly are some of the food safety tips that you should follow in your kitchen.
Story first published:Sunday, June 7, 2020, 2:39 [IST]
Desktop Bottom Promotion