For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World No-Tobacco Day 2021 : ‘పొగ’ను తాగొద్దు పోతారు..! పైకి పోతారంటున్న అధ్యయనాలు...

ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్య్లుహెచ్ఒ) మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.

|

ధూమపానం చేసేవారంతా గుప్పు గుప్పుమని పొగ వదులుతున్నప్పుడు.. తాము రిలాక్స్ పొందుతున్నామని అనుకుంటారు.. కానీ వారికి తెలియని విషయమేమిటంటే వారు దానికి బానిసలుగా మారుతున్నారని.. ఎందుకంటే ప్రస్తుతం కరోనావైరస్ సెకండ్ మరియు థర్డ్ వేవ్ మహమ్మారి అందరినీ కలవరెపెడుతోంది.

World No-Tobacco Day 2020

ఇటీవలే సిగరెట్ తాగి ముగ్గురు కరోనా బారిన పడ్డారు. అంతేకాదు పొగాకును ఏ రూపంలో తీసుకున్నా సరే కరోనా వైరస్ వేగంగా వ్యాపించి మరణం సంభవించే అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనం కూడా తేల్చి చెప్పింది. మిగతా వారితో పోలిస్తే, పొగ తాగే వారిలో కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని తేల్చింది.

World No-Tobacco Day 2020

మే 31వ తేదీన పొగాకు వ్యతిరేక సందర్భంగా అక్కడి శాస్త్రవేత్తలు పొగ తాగిన వారిని, తాగని వారిపై కొన్ని ప్రయోగాలు చేశారు. వారి ఊపిరితిత్తుల కణ జాలలో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా శ్వాస మార్గంలోని వైరల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ఏసీఈ-2, ఫ్యూరిన్, టీఎంపీఆర్ఎస్ ఎస్ -2 కణజాలలను క్షుణ్ణంగా పరిశించిన తర్వాత, తేలిన విషయం ఏమిటంటే..

World No-Tobacco Day 2020

పొగ తాగని వారితో పోలిస్తే తక్కువలో తక్కువగా 100 సిగరెట్లు తాగిన వారి ఊపిరితిత్తుల కణజాలలు వైరస్ బారిన పడే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందని గుర్తించారు...

పొగరాయుళ్లు గుప్పుగుప్పుమని

పొగరాయుళ్లు గుప్పుగుప్పుమని

మరోవైపు ధూమపానం ప్రాణాంతకం అని తెలిసినా.. పొగరాయుళ్లు గుప్పుగుప్పుమని పొగ బయటికి వదులుతూ అర్థాంతరంగా ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ప్రతి ఏటా వందలాది మంది ఈ వ్యసనానికి బలి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా మే 31వ తేదీ ఆదివారం నాడు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వీటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

తాంబూలాలకు కూడా పొగాకు

తాంబూలాలకు కూడా పొగాకు

పొగాకు చెట్టు ఆకుల నుండి బీడీలు, చుట్టలు, సిగరెట్లను తయారు చేస్తారు. కొన్ని రకాల తాంబూలాలకు కూడా పొగాకు విరివిగా ఉపయోగిస్తారు. పొగాకు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి. మత్తు ఎక్కించే పదార్థం కూడా. దీంతో వివిధ రకాలుగా బాధపడేవారు పొగాకు వినియోగిస్తూ తాత్కాలికంగా తాము మానసిక ప్రశాంతత పొందవచ్చని అనుకుంటారు. కానీ దానికే బానిసలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఇదే లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పొగాకు వల్ల మరణిస్తున్నారు.

లంగ్ క్యాన్సర్..

లంగ్ క్యాన్సర్..

పొగాకును ఏ వ్యక్తి అయినా ఏ రూపంలో వినియోగించినా, అది అనారోగ్యానికి గురి చేస్తుంది. ఈ పొగ మనిషి జీవితంపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధానంగా పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె వ్యాధులు అధికంగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అకాల మరణాలకు ధూమపానం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

పొగ పీల్చేవారికి ప్రమాదమే..

పొగ పీల్చేవారికి ప్రమాదమే..

సాధారణంగా ఎవరు తాగినా పొగ తాగినా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. మనం పీల్చే గాలిలో స్వచ్ఛమైన ఆక్సీజన్ శరీరానికి అందుతుంది. అయితే పొగతాగే వారికన్నా పక్కనుండి ఆ పొగను పీల్చేవారే తీవ్ర అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పొగ తాగేవారిని యాక్టివ్ స్మోకర్లుగా, పీల్చేవారిని పాసివ్ స్మోకర్లుగా పిలుస్తారు. పొగ పీల్చడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి శక్తి తగ్గుతుంది. అంతేకాదు ఎక్కువగా పొగను పీల్చిన మహిళలకు అబార్షన్లు జరగడం.. ఒకవేళ పిండం ఎదిగినా చివర్లో చనిపోయిన శిశువులు జన్మించడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

దాదాపు 3 కోట్లు..

దాదాపు 3 కోట్లు..

మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 కోట్లు పొగ తాగే వారున్నారని ఒక సర్వేలో తేలిందట. మరో భయంకరమైన విషయమేమిటంటే ఒక సిగరెట్ తాగితే 43 రకాల విషవాయువులు వెలువడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

English summary

World No-Tobacco Day 2020: Date, Theme and Significance

World No Tobacco Day: Tobacco use and exposure can be detrimental to overall health.
Desktop Bottom Promotion