For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Population Day 2020: జనాభా పెరుగుదలకు కారణం తెలిస్తే షాకవుతారు...!

|

మనలో చాలా మందికి జనాభా అనగానే మొట్టమొదట గుర్తొచ్చే దేశం చైనా. ఆ తర్వాతి స్థానం మన భారతదేశానిదే. అయితే మరికొన్ని రోజుల్లోనే మనం వరల్డ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుందని, ఇందుకు పరిష్కారం ఉందని, జనాభాను తగ్గించేందుకు చాలా మంది ప్రజలు కుటుంబ నియంత్రణ నిబంధననను కచ్చితంగా పాటిస్తే ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.

కానీ మన దేశంలో ఇది అంత సులభం కాదు. ఎందుకంటే ఇప్పటికీ భారత్ లో లైంగిక విద్యపై అందరికీ అంతగా అవగాహన లేదు. లింగ సమానత్వం, ఆరోగ్య హక్కుల గురించి కూడా సరిగా తెలియదు.

ఇలాంటి సమస్యలపై అవగాహన పెంచేందుకే ప్రతి సంవత్సరం జులై 11వ తేదీన ఐక్యరాజ్యసమితి(UNO) ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఇప్పటికీ చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కు ముందుకు రావడం లేదు.

అయితే కొందరు మహిళలు మాత్రం ధైర్యంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు. అయితే మగవారు మాత్రం ఇందుకు ముందుకు రావడం లేదు. అయితే పురుషులు, స్త్రీలు అందరూ కలిసి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటేనే ప్రపంచ జనాభా పునరుత్పత్తి విషయంలో ఇక ముందైనా పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ జనాభా యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

పురుషులలో వేడి మూత్రం: కారణాలు, లక్షణాలు మరియు దానిని ఎలా చికిత్స చేయాలి

ప్రపంచ జనాభా దినోత్సవం..

ప్రపంచ జనాభా దినోత్సవం..

ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి(UNO) 1987, జులై 11వ తేదీన ప్రారంభించింది. ఆ సమయంలో ప్రపంచ జనాభా 5 బిలియన్లకు పైగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా కారణంగా తలెత్తే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏదో ఒకటి కచ్చితంగా చేయాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి అధికారులు భావించారు.

పునరుత్పత్తి గురించి..

పునరుత్పత్తి గురించి..

అలా, 1989 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి అందరికీ గట్టిగా చెప్పాలని నిర్ణయించారు. వారు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ఇందులో చేర్చడానికి ప్రధాన కారణం చాలా మంది గర్భిణీ స్త్రీలకు పునరుత్పత్తి ఆరోగ్యం గురించి పెద్దగా తెలియకపోవడమే.

సిద్ధ న్యాచురోపతితో కరోనాకు చెక్ పెట్టొచ్చు... అదెలాగో తెలుసుకోండి...

కోవిద్-19 సమయంలో..

కోవిద్-19 సమయంలో..

అయితే కొన్నిసార్లు మనకు తెలిసినట్టుగానే కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. అదే సమయంలో ఏదైనా సమస్య ఏర్పడితే దానిపై ఒక నిర్దిష్ట పరిష్కారం చూపేందుకు అది సహాయపడుతుంది. అలా ఈ ఏడాది థీమ్ ‘COVID-19 సమయంలో మహిళల ఆరోగ్యం మరియు హక్కులను పరిరక్షించడం.'

ప్రపంచ జనాభా దినోత్సవ ప్రాముఖ్యత..

ప్రపంచ జనాభా దినోత్సవ ప్రాముఖ్యత..

  • పునరుత్పత్తి ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఇద్దరు పిల్లలు అందులోనూ బాలికల వరకు నియంత్రణ ఉంచుకోవాలి.
  • సమాజంలో ప్రబలంగా ఉన్న లింగ మూస పద్ధతులను నిర్మూలించడంపై ఇది ప్రభావం చూపుతుంది.
  • లైంగిక సంక్రమణ వ్యాధుల గురించి అవగాహన కల్పించడానికి వివిధ ఉపన్యాసాలు మరియు విద్యా చిత్రాలు విడుదలవుతాయి.
  • చిన్నపిల్లలు మరియు బాలికలు లైంగిక సంక్రమణ వ్యాధుల గురించి మరియు అవాంఛిత గర్భాలను ఎలా నివారించాలో తెలియజేస్తారు.
  • ఆడపిల్లల హక్కులను, వారి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించాలని కూడా ఈరోజు తెలియజేస్తుంది.
  • ప్రజలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను పొందేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
English summary

World Population Day 2020: Know About The History, Theme And Significance

Every year 11 July is observed as World Population Day to fight against the issues related to growing population and the poor reproductive health of people across the world.
Story first published: Saturday, July 11, 2020, 14:06 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more