For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Post Day 2021:భారత్ లో తొలి పోస్టాఫీస్ ఎక్కడ ప్రారంభించారో తెలుసా...

ప్రపంచ పోస్టల్ దినోత్సవం 2021 తేదీ, థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత మరియు పోస్టల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి మన చుట్టూ ఏం జరుగుతుందో మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి కొద్ది క్షణాల్లోనే తెలిసిపోతోంది. ముఖ్యంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా లాంటి యాప్ లతో ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితో అయినా మనం నేరుగా మాట్లాడగలుగుతున్నాం.

World Post Day 2021 Date, Theme, History, Significance and Interesting Facts in Telugu

అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికీ తపాలానే కమ్యూనికేషన్ సాధనం. మనుషులు దూరంగా ఉన్నా తమ బంధాన్ని.. అనుబంధాన్ని ఒక ఉత్తరం(Post) ద్వారా కొనసాగించేవారు. ఇదే పోస్ట్ మనీ ఆర్డర్ లాంటి సేవలతో ఎందరికో ఆర్థిక అవసరాలను సైతం తీర్చింది.

World Post Day 2021 Date, Theme, History, Significance and Interesting Facts in Telugu

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటారా? ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవం (అక్టోబర్ 9వ తేదీ)జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పోస్ట్ డే ఎప్పుడు ప్రారంభమైంది.. ఎక్కడ ప్రారంభమైంది.. తొలిసారి పోస్ట్ ఎవరు చేశారనే విషయాలతో పాటు ప్రపంచ తపాలా దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ డే ఎప్పుడంటే..

పోస్ట్ డే ఎప్పుడంటే..

1874వ సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపిఎన్) మొట్టమొదటిసారిగా ఏర్పడింది. కాబట్టి ఆరోజునే ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటారు. జపాన్ రాజధాని టోక్యోలో 1969 సంవత్సరంలో యూపీఎన్ మొదటి సమావేశం జరిగింది.

ప్రపంచంలో నలుమూలలకు..

ప్రపంచంలో నలుమూలలకు..

ఈ సమావేశంలో ప్రపంచంలోని చివరి వ్యక్తికి కూడా పోస్ట్ కార్డులు రాయాలని.. అవి వాటికి చేరాలనేదే ఈ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు అక్టోబర్ 9 నుండి 15వ తేదీ వరకు వారం రోజుల పాటు నేషనల్ పోస్ట్ వీక్ అంటే జాతీయ తపాలా వారోత్సవాలు నిర్వహిస్తారు.

తపాలా యొక్క చరిత్ర..

తపాలా యొక్క చరిత్ర..

సాంకేతికత ఏ మాత్రం అందుబాటులో లేని 16వ శతాబ్దం కాలంలో పలు దేశాలు పోస్ట్ కార్డులు రాయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలకు మరికొన్ని దేశాలకు ఈ సేవలు విస్తరించాయి. వీటికి అధికారికంగా యూనియన్ ఉంటే బాగుంటుందని, వీటి సేవల్ని సైతం అధికారికంగా ప్రచారం చేసేందుకు 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. పోస్టల్ వ్యవస్థ సక్రమంగా లేని రోజుల్లోనే మన దేశంలో కోల్ కత్తాలో 1774లో తొలి పోస్టల్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు రాజుల కాలంలో పావురాలతో ఉత్తరాలు చేరవేసేవారు.

మన దేశంలోనూ..

మన దేశంలోనూ..

1948 సంవత్సరంలో యుపిఎన్ యుఎన్ లోని ఓ ఏజెన్సీగా మారింది. 1969 అక్టోబర్ 9వ తేదీన తొలిసారిగా అధికారికంగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రతిపాదనను భారతదేశం నుండి ఆనంద్ నరులా ఆమోదించారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో సమాచార వ్యవస్థగా నలిచిన తపాలా శాఖ సేవలు ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది తమ ఉత్తరాల ద్వారా కోట్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసేవారు. ప్రభావితం అయ్యేవారు. అలాంటొ గొప్ప సేవల్ని స్మరించుకుంటూ వారి పేరిట పోస్టల్ స్టాంపులను పోస్టల్ శాఖ విడుదల చేస్తుంది.

వరల్డ్ పోస్ట్ డే థీమ్..

వరల్డ్ పోస్ట్ డే థీమ్..

ప్రతి సంవత్సరం వరల్డ్ పోస్ట్ డే సందర్భంగా ఒక థీమ్ అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరల్డ్ పోస్ట్ డే థీమ్ ఏంటంటే ‘ఇన్నోవేటివ్ టు రికవర్' డిజిటల్ కు మారుతున్న సందర్భంలో తపాలా శాకను రక్షించుకోవాలని, దీనికి పూర్వ వైభవం తీసుకురాలన్నది దీని ముఖ్య ఉద్దేశ్యం. తపాలా వారోత్సవాల సందర్భంగా పోస్టల్ ఉత్పత్తులు మరియు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కొన్ని దేశాలలో వరల్డ్ పోస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. భిన్న రకాల తపాలా స్టాంపులను సైతం ప్రదర్శిస్తారు. మరికొన్ని దేశాల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోస్టల్ ఉద్యోగులను గౌరవించి సన్మానాలు చేస్తారు.

ఇండియన్ పోస్టల్ కింగ్..

ఇండియన్ పోస్టల్ కింగ్..

ప్రపంచంలోని తపాలా శాఖలన్నింటిలో లక్షన్నరకు పైగా తపాలా కార్యాలయాలు ఒక్క మన దేశంలోనే ఉన్నాయి. అందుకే పోస్టల్ డిపార్ట్ మెంటులో ఇండియా కింగ్ లాంటిది. వీటిలో దాదాపు 89 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఉన్న తపాలా కార్యాలయాలు మాత్రం 23 వేల లోపే ఉన్నాయి.

FAQ's
  • ప్రపంచ తపాలా దినోత్సవాన్ని(World Post Day)ఎప్పుడు జరుపుకుంటారు?

    1874వ సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీన యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యుపిఎన్) మొట్టమొదటిసారిగా ఏర్పడింది. కాబట్టి ఆరోజునే ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటారు. జపాన్ రాజధాని టోక్యోలో 1969 సంవత్సరంలో యూపీఎన్ మొదటి సమావేశం జరిగింది.

English summary

World Post Day 2021 Date, Theme, History, Significance and Interesting Facts in Telugu

Here we are talking about the world post day 2021 date, theme, history, significance and intersting facts in Telugu. Have a look
Desktop Bottom Promotion