For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భార్యపోరు..భర్త బేజారు..వెంటనే విడాకులు ఖరారు..కానీ భరణంగా ఎన్ని వేల కోట్లిచ్చాడో తెలిస్తే షాకవుతారు

చైనాలో విడాకులు తీసుకున్నందుకు గాను తన భార్యకు అక్షరాల 3.2 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 24 వేల కోట్లు చెల్లించుకున్నాడో వ్యక్తి.

|

ప్రస్తుత సమాజంలో చాలా మంది త్వరగానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పెళ్లి అయిన కొద్ది కాలానికే విడాకుల పేరిట విడిపోతున్నారు.

World’s Latest Billionaire Emerges From Costly Asia Divorce

అయితే ఇలా భార్యభర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భర్త స్తోమతను బట్టి భార్యకు ఎంతోకొంత సొమ్మును సమర్పించుకోవాల్సిందే. అలా మన దేశంలో చాలా మంది ప్రముఖులు ఇలాంటివి చేస్తున్నారు. టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ కూడా తన భార్యలకు విడాకులు ఇచ్చే సమయంలో ఇదే చేశాడని, అందుకే వారు విడిపోవడానికి ఒప్పుకున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి.

World’s Latest Billionaire Emerges From Costly Asia Divorce

అంతేకాదు నెలవారీ మెయింటెన్స్ కూడా చెల్లిస్తున్నట్లు ఊహాగానాలు వెల్లువడ్డాయి. ఇలా పెద్ద పెద్ద ఆస్తిపాస్తులున్న వాళ్లు విడాకులు తీసుకున్న సమయంలో ఏకమొత్తంలో చెల్లింపులు మాత్రం చేయరు.

World’s Latest Billionaire Emerges From Costly Asia Divorce

అంతేకాదు విడిపోయిన తర్వాత తమ నెలవారీ మెయింటెనెన్స్ సొమ్మును కూడా ఎలా ఎగ్గొట్టాలా అని ఎదురుచూసే వారే ఎక్కువగా ఉంటారు. మరీ అవసరమైతే భారీ మొత్తంలో భరణం చెల్లించుకుని చేతులు దులుపుకుంటారు.

World’s Latest Billionaire Emerges From Costly Asia Divorce

ఆ తర్వాత వారు మరో పెళ్లి చేసుకోవడం లేదా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇదంతా చాలా కామన్. ఇదిలా ఉంటే విదేశాల్లో మాత్రం ఎవ్వరూ ఊహించనంత సొమ్మును చెల్లించి మరీ విడాకులు పొందుతున్నారు. ఇంతకుముందు అమెజాన్ సిఇఓ బెజోస్ కూడా విడాకులు ఇచ్చిన సమయంలో బిలియన్లలో సొమ్మును సమర్పించుకున్న విషయం తెలిసిందే. అది ఎంతంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. అయితే అలాంటి ఘటనే మన ఆసియా ఖండంలోనూ ఇటీవల చోటు చేసుకుంది.

3.2బిలియన్ డాలర్లు...

3.2బిలియన్ డాలర్లు...

చైనాలో ఒక భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినందుకు ఏకమొత్తంలో 3.2 బిలియన్లు అంటే అక్షరాల ఏకంగా 24 వేల కోట్ల రూపాయలను చెల్లించి మరీ దాంపత్య బంధం నుండి బయటపడ్డాడు.

వేల కోట్ల సొమ్ము...

వేల కోట్ల సొమ్ము...

ఆమెను వదిలించుకోవటానికి అంత సొమ్ము పోగొట్టుకోవటానికి కూడా సిద్ధపడ్డాడంటే అతను ఎంత నరకం అనుభవించాడో ఏమో. లేదా ఆమెనే ఆ సొమ్మునంతా ముక్కు పిండి వసూలు చేసిందో అనే వివరాలు తెలియదు.

కంపెనీ ఓనర్..

కంపెనీ ఓనర్..

ఆ వ్యక్తికి కంగ్ టాయ్ బయోలాజికల్ అనే ఒక కంపెనీ ఉంది. అది కరోనా మహమ్మారికి మందు కూడా ఉత్పత్తి చేయబోతున్నట్టు ప్రకటించింది కూడా. దాని ఓనర్ పేరే డు వీమిన్..

సేల్స్ మేన్ నుండి..

సేల్స్ మేన్ నుండి..

56 ఏళ్ల వయసున్న డు వీమిన్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రసాయశాస్త్రంలో పట్టు సాధించి ఓ మందుల కంపెనీలో సేల్స్ మేన్ గా చేరాడు. తర్వాత తనే ఓ కంపెనీ పెట్టాడు.

50 వేల కోట్ల టర్నోవర్..

50 వేల కోట్ల టర్నోవర్..

అలా పెట్టిన కంపెనీని కష్టపడి పైకి తీసుకొచ్చాడు. ఏకంగా 50 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాడు. ఇక తన ఆస్తి విలువ మార్కెట్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది.

కెనడా నుండి వచ్చి..

కెనడా నుండి వచ్చి..

ఇక ఆయన భార్య విషయానికొస్తే ఆమె పేరు యువాన్(49). ఆమె బీజింగ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చదువుకుంది. అంతేకాదు ఆమె కెనడా నుండి వచ్చి, తన భర్త కంపెనీలోనే డైరెక్టర్ గా ఉండి, దాని అనుబంధ కంపెనీకి వైస్ జనరల్ మేనేజర్ గా పని చేస్తుండేది.

అనుకోని కారణాల వల్ల..

అనుకోని కారణాల వల్ల..

ఏమయిందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. అంతే ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోదాం అనుకున్నారు.

లీగల్ సెటిల్ మెంట్లో..

లీగల్ సెటిల్ మెంట్లో..

ఇక లీగల్ సెటిల్ మెంట్ లో భాగంగా ఆ భర్త తన భార్యకు సొంత ఫార్మా కంపెనీకి చెందిన 16 కోట్ల షేర్లను బదిలీ చేశాడు. వాటి విలువ అక్షరాల 24 వేల కోట్ల రూపాయలు.

ధనిక మహిళ..

ధనిక మహిళ..

దీంతో ఆమె ఒక్కసారిగా ధనిక మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది. అయితే ఆ షేర్లకు సంబంధించిన హక్కులను మాత్రం తన భర్తకే వదిలేసిందట ఆ ధనిక మహిళ.

ట్రంప్ కూడా ఈ జాబితాలో..

ట్రంప్ కూడా ఈ జాబితాలో..

ఇక ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విడాకుల వివరాలను పరిశీలిస్తే అమెజాన్ సిఇొ బెజోన్ తర్వాత, మొఘల్ రూపర్ట్ మర్డోక్ 1999లోనే 17 బిలియన్ డాలర్లు సమర్పించుకున్నాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు 1992లోనే విడాకుల సందర్భంగా ఇవానాకు 2.5 కోట్ల డాలర్లను చెల్లించుకున్నాడు. అయితే మన దేశంలో ఇంత సీన్ ఎవ్వరికీ లేదు లేండి. ఎంతసేపు నెలవారీ భరణాల చెల్లింపు కేసులే కనిపిస్తాయి.

English summary

World’s Latest Billionaire Emerges From Costly Asia Divorce

Here we talking about world's latest billionaire emereges from costly asia divorce. Read on.
Desktop Bottom Promotion